
విశాల్
హీరో విశాల్– దర్శకుడు మిస్కిన్ కాంబినేషన్‌లో ‘తుప్పారివాలన్’ (తెలుగులో డిటెక్టివ్) అనే చిత్రం వచ్చింది. మంచి సక్సెస్ అందుకుంది. ప్రస్తుతం ఈ సినిమా సీక్వెల్ తెరకెక్కుతుంది. మిస్కి దర్శకత్వంలోనే విశాల్ హీరోగా నటిస్తూ, ఈ సీక్వెల్‌ను నిర్మిస్తున్నారు. బడ్జెట్ సమస్యల కారణంగా సినిమా నుంచి తప్పుకున్నారు దర్శకుడు మిస్కిన్. దాంతో దర్శకత్వ బాధ్యతలను చేపట్టారు విశాల్. ‘‘దర్శకత్వం చేయాలనే ఆలోచన నాకు ఎప్పుట్నుంచో ఉంది. కానీ ఇలా వస్తుందని ఊహించలేదు. ఇది మారువేషంలో వచ్చిన అదృష్టంలా భావిస్తున్నాను. సినిమా మేకింగ్‌లో అన్ని బాధ్యతలు దర్శకుడి మీదే ఉంటాయి. డైరెక్షన్ చేయడానికి ఎగ్జయిటింగ్‌గా ఉన్నాను. ఈ సినిమాకు త్రిపాత్రాభినయం (నటన–నిర్మాణం– దర్శకత్వం) చేయబోతున్నాను’’ అన్నారు విశాల్.
Comments
Please login to add a commentAdd a comment