డిటెక్టివ్ గా టాలీవుడ్ కోలీవుడ్ లలో సత్తా చాటిన విశాల్, త్వరలో అభిమన్యుడుగా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటిస్తుండగా.. సీనియర్ యాక్షన్ హీరో అర్జున్ కీలక పాత్రలో నటిస్తున్నారు. తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతున్న ఈ సినిమాను కోలీవుడ్ హీరో విశాల్ తన సొంత నిర్మాణ సంస్థ విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్ పై తెరకెక్కిస్తుండగా తెలుగులో హరి వెంకటేశ్వరా ఫిలింస్ బ్యానర్ పై రిలీజ్ చేస్తున్నారు. పి ఎస్ మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమాను 2018 సంక్రాంతి బరిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. ఇప్పటి నుంచే ప్రచార కార్యక్రమాలు ప్రారంభించిన విశాల్ తెలుగు ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment