పాప్‌ సింగర్‌ జెన్నిఫ‌ర్ పాత్రలో ఆండ్రియా | Andrea Jeremiah As Jennifer In Ayushman Bhava | Sakshi
Sakshi News home page

Published Tue, Jul 10 2018 3:34 PM | Last Updated on Tue, Jul 10 2018 3:39 PM

Andrea Jeremiah As Jennifer In Ayushman Bhava - Sakshi

చ‌ర‌ణ్ తేజ్ హీరోగా త‌న స్వీయ ద‌ర్శక‌త్వంలో తెరకెక్కిస్తున్న సినిమా ఆయుష్మాన్‌ భవ. నేను లోక‌ల్ ఫేం త్రినాథ్ రావు న‌క్కిన కథ అందిస్తూ దర్శకత్వ పర్యవేక్షణ చేస్తున్న ఈ సినిమాకు మరో యువ దర్శకుడు మారుతి సహ నిర్మాతగా వ‍్యవహరిస్తున్నారు. సీనియర్ రచయిత పరుచూరి బ్రదర్స్‌ ఈ సినిమాకు స్క్రీన్‌ప్లే సమకూరుస్తుండటం విశేషం. బాలీవుడ్‌ లో బేబీ డాళ్‌, హ్యాంగ్ ఓవర్‌, హైహీల్స్‌ లాంటి చిత్రాలకు సంగీతమందించిన బ్రోస్‌ ఈ చిత్రానికి సంగీతమందిస్తున్నారు.

చరణ్‌ తేజ్‌ సరసన స్నేహా ఉల్లాల్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా మరో కీలక పాత్రలో కోలీవుడ్ బ్యూటీ ఆండ్రియా అలరించనున్నారు. అది కూడా పాప్‌ సింగర్‌ జెన్నిఫర్‌ పాత్రలో ఆండ్రియా కనిపించనున్నారు. ప్రేమ పట్ల సమాజం వ్యవహరిస్తున్న తీరు నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే విడుదల చేసిన  దీర్ఝ ఆయుష్మాన్ భవ టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. త్వర‌లో జెన్నీఫర్‌గా ఆండ్రియా లుక్‌ను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement