'నా సినిమాకు 'ఏ' సర్టిఫికేట్ ఇవ్వమన్నా' | Siddharth About Gruham Movie | Sakshi
Sakshi News home page

'నా సినిమాకు 'ఏ' సర్టిఫికేట్ ఇవ్వమన్నా'

Published Thu, Nov 16 2017 10:44 AM | Last Updated on Thu, Nov 16 2017 10:45 AM

Siddharth About Gruham Movie - Sakshi

ఒక్కప్పుడు లవర్ బాయ్ టాలీవుడ్ లో స్టార్ ఇమేజ్ అందుకున్న సిద్ధార్థ్ తరువాత వరుస ఫ్లాప్ లతో తెలుగు సినిమాకు దూరమయ్యాడు. కోలీవుడ్ లో అడపాదడపా సినిమాలు చేస్తున్నా.. పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. దీంతో కొంత గ్యాప్ తీసుకొని సొంత నిర్మాణ సంస్థ లో ఓ హర్రర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఒకే సారి తమిళ్ తో పాటు తెలుగు, హిందీ భాషల్లోనూ ఈ సినిమాను తెరకెక్కించాడు.

ఇప్పటికే కోలీవుడ్, బాలీవుడ్ లలో రిలీజ్ అయిన సిద్దార్థ్ హర్రర్ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాను శుక్రవారం టాలీవుడ్ లో రిలీజ్ చేస్తున్నారు. గృహం పేరుతో రిలీజ్ అవుతున్న ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు సిద్ధూ. తన సినిమాకు ఏ సర్టిఫికేట్ ఇవ్వాల్సిందిగా తానే సెన్సార్ బోర్డ్ ను కోరాడాట. అన్ని సినిమాలు కుటుంబ సమేతంగా చూడాల్సిన అవసరం లేదన్న సిద్ధూ. ఈ సినిమాకు 18 ఏళ్ల పై బడినవారే రావాలని కోరాడు. అంతేకాదు గుండె జబ్బులు ఉన్నవారు కూడా తన సినిమా చూడవద్దని తెలిపాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement