దాని నుంచి బయట పడడానికి ఆయుర్వేద చికిత్స.. | Andrea Ayurvedic Treatment For Coffee Addiction | Sakshi
Sakshi News home page

దూరమైంది ఎందుకంటే.. ?

Published Fri, Aug 9 2019 8:32 AM | Last Updated on Fri, Aug 9 2019 8:32 AM

Andrea Ayurvedic Treatment For Coffee Addiction - Sakshi

సినిమా: నిజమే తాను కొంత కాలం సినిమాలకు దూరమయిన మాట నిజమే అంటోంది హీరోయిన్‌ ఆండ్రియా. ఇందుకు కారణం విశ్రాంతి లేకుండా నటించడంతో శారీరకంగానూ, మానసికంగానూ చాలా అలసిపోయాను అనడం కంటే బాధకు గురయ్యానని అంటోంది. ఈ అమ్మడు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. బహుభాషా నటినే కాకుండా చాలా విశాల మనస్తత్వం కలిగిన నటి. తాను చేయాలనుకున్నది ఎవరేమనుకున్నా డోంట్‌కేర్‌ అని చేసేస్తుంది. అలా ఆ మధ్య వివాదాస్పద సంఘటనలతో వార్తల్లోకెక్కిన ఆండ్రియా ఇటీవల ఇమేజ్‌ను పట్టించుకోకుండా వడచెన్నై చిత్రంలో సంచలన పాత్రను పోషించింది. అలా ఏడాదికి నాలుగైదు చిత్రాల్లో నటించే ఈ బ్యూటీ ఇటీవల తెరపై కనిపించలేదు. గత ఏడాది ఈ అమ్మడు నటించిన విశ్వరూపం 2, వడచెన్నై చిత్రాలు మాత్రమే తెరపైకి వచ్చాయి. ఆ తరువాత ఆండ్రియా మరో చిత్రంలో నటించలేదు.

ఇక సామాజిక మాధ్యమాల్లో తరుచూ తన అభిప్రాయాలను, ఫొటోలను పోస్ట్‌ చేసే ఆండ్రియా ఇటీవల అలాంటి వాటికి దూరంగా ఉంది. దీంతో ఈ జాన చిత్రాలకు గుడ్‌బై చెప్పిందా అనే అనుమానం పలువురికి కలుగుతోంది. దీంతో ఎట్టకేలకు ఈ బ్యూటీ తాజాగా తన ట్విట్టర్‌లో తాను సినిమాలకు దూరంగా ఉండడానికి కారణాన్ని వెల్లడించింది. ఆమె ఏం చెప్పిందో చూద్దాం. తాను విశ్రాంతి లేకుండా నటించడం కారణంగా మానసికంగానూ, శారీరకంగానూ చాలా బాధకు గురైనట్లు చెప్పింది. అందుకే కొంతకాలంగా నటనకు దూరంగా ఉన్నట్లు తెలిపింది. సమస్యల నుంచి విముక్తి పొందడానికి ఆయుర్వేద చికిత్స తీసుకుంటున్నానని చెప్పింది. కాఫీ తాగడానికి బానిసనైన తాను దాని నుంచి బయట పడడానికి ఆయుర్వేద చికిత్స పొందినట్లు తెలిపింది. అయితే అది అంత సాధ్యం కాలేదని అయినా వైద్య చికిత్సతో కష్టపడి ఆ అలవాటును మానుకున్నానని చెప్పింది. కాఫీకి బదులు ఉదయాన్నే ఒక కప్పు మూలిక తేనీరును తీసుకుంటూ, యోగాతో దిన చర్యలను ప్రారంభిస్తున్నానని తెలిపింది. అయితే ఆ వైద్యాన్ని బలహీన హృదయం కలవారు పాఠించలేరని చెప్పింది. తానే ఒక దశలో ఆ వైద్యం నుంచి బయట పడాలని భావించానని అంది. అయితే వైద్యుల సలహా మేరకు ఆయుర్వేద వైద్య చికిత్సను కొనసాగించినట్లు తెలిపింది. ³్పుడు తాను చాలా నూతనోత్సాహంతో ఉన్నట్లు చెప్పింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement