Andrea Jeremiah's Look From 'Saindhav' Movie Is Out Now - Sakshi
Sakshi News home page

Andrea Jeremiah : వెంకటేశ్‌ 'సైంధవ్‌'లో ఆండ్రియా లుక్‌ చూశారా? ఫోటో వైరల్‌

Published Fri, Apr 28 2023 6:12 PM | Last Updated on Fri, Apr 28 2023 6:28 PM

Andrea Jeremiah Look From Saindhav Movie Is Out Now - Sakshi

విక్టరీ వెంకటేశ్‌ నటిస్తున్న తాజా చిత్రం సైంధవ్‌. హిట్‌ సిరీస్‌తో టాలెంటెడ్‌ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న శైలేష్‌ కొలను ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. పాన్‌ ఇండియా లెవల్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాప షూటింగ్‌ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది.

తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్‌డేట్‌ను వదిలారు. కోలీవుడ్‌ బ్యూటీ ఆండ్రియా ఈ సినిమాతో టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇస్తుంది. దీంతో ఆమె ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ని రిలీజ్‌ చేశారు. ఈ చిత్రంలో ఆమె జాస్మిన్‌ అనే పాత్రలో కనిపించనుంది.

చేతిలో రివాల్వర్‌తో స్టైలిష్‌ లుక్‌లో ఆండ్రియా దర్శనమిచ్చింది. కాగా గతంలో ఆమె నాగచైతన్య హీరోగా వచ్చిన తబాఖా మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సంగతి తెలిసిందే. మళ్లీ పదేళ్లకు ఆండ్రియా టాలీవుడ్‌లో మెరవనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement