ఆ సీన్లు చేసుండాల్సింది కాదు! | Andrea Jeremiah regrets doing intimate scenes in Vada Chennai | Sakshi
Sakshi News home page

ఆ సీన్లు చేసుండాల్సింది కాదు!

Published Mon, Mar 2 2020 12:34 AM | Last Updated on Mon, Mar 2 2020 5:16 AM

Andrea Jeremiah regrets doing intimate scenes in Vada Chennai - Sakshi

ఆండ్రియా జర్మియా

‘‘ఏదైనా ఒక క్యారెక్టర్‌ బాగా చేస్తే ఆ తర్వాత అందరూ అలాంటి పాత్రలకే అడుగుతారు. చేసిన పాత్రలే చేస్తే నాకు బోర్‌ కొడుతుంది. చూసే ప్రేక్షకులు కూడా ఒకే రకమైన పాత్రల్లో కనిపిస్తోంది అంటారు’’ అంటున్నారు ఆండ్రియా జర్మియా. గాయనిగా, నటిగా మంచి పేరు తెచ్చుకున్న ఆండ్రియా ‘వడ చెన్నై’ అనే తమిళ సినిమాలో కొన్ని బోల్డ్‌ సీన్స్‌లో నటించారు. 2018లో ఈ చిత్రం విడుదలైంది. ఆ తర్వాత నుంచి ఇప్పటివరకూ ఆ సినిమాలో ఆమె చేసిన చంద్ర తరహా పాత్రలకే అడుగుతున్నారట.

ఆ విషయం గురించి ఆండ్రియా మాట్లాడుతూ – ‘‘వడ చెన్నై’ సినిమాలో నా కో–స్టార్‌ అమీర్‌తో కలిసి బెడ్‌రూమ్‌ సీన్స్‌ చేశాను. ఆ  రొమాంటిక్‌ సీన్స్‌ చేసినందుకు ఇప్పుడు పశ్చాత్తాపపడుతున్నాను. ఎందుకంటే చాలామంది దర్శకులు అలాంటి పాత్రలతో నా దగ్గరకు వస్తున్నారు. నాకిష్టం లేదు. ఒకవేళ రొమాంటిక్‌ సీన్స్‌ లేకుండా మంచి పాత్రకి అవకాశం వస్తే పారితోషికం తగ్గించుకోవడానికి కూడా నేను రెడీ’’ అన్నారు. ఇక సినిమాల విషయానికొస్తే.. విజయ్‌ హీరోగా రూపొందిన ‘మాస్టర్‌’లో నటించారు ఆండ్రియా. ఏప్రిల్‌లో ఈ చిత్రం విడుదల కానుంది. ప్రస్తుతం ‘కా’, ‘వట్టమ్‌’, ‘మాళిగై’, ‘అర్‌ణ్‌మనై’ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారామె.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement