జయ్‌తో ఆండ్రియా రొమాన్స్ | Andrea Jeremiah Romance with jay | Sakshi
Sakshi News home page

జయ్‌తో ఆండ్రియా రొమాన్స్

Published Tue, May 27 2014 12:33 AM | Last Updated on Sat, Sep 2 2017 7:53 AM

జయ్‌తో ఆండ్రియా రొమాన్స్

జయ్‌తో ఆండ్రియా రొమాన్స్

 తెరవెనుక సంగీత దర్శకుడు అనిరుధ్‌తో రొమాన్స్ చేసిన ఆండ్రియా తాజాగా తెరపై యువ నటుడు జయ్‌తో ఫుల్‌గా రొమాన్స్ చేయడానికి సిద్ధమవుతున్నారు. జయ్ నటించిన తిరుమణం ఎన్నుం నిఖా చిత్రం త్వరలో తెరపైకి రానుంది. జయ్ తదుపరి చిత్రానికి రెడీ అయిపోయారు. ఈయన నటిస్తున్న చిత్రానికి వలియవన్ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఇందులో జయ్ సరసన నటి ఆండ్రియా హీరోయిన్‌గా జతకట్టడం విశేషం. వీరి కాంబినేషన్‌లో రూపొం దుతున్న ఈ చిత్రానికి ఎంగేయుం ఎప్పోదుం చిత్రం ఫేమ్ శరవణన్ దర్శకత్వం వహిస్తున్నారు.
 
  ఇప్పటికే తొలి షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ, వలియవన్ తన గత చిత్రాలకు పూర్తి భిన్నంగా ఉంటుందన్నారు. ఇం దులో యాక్షన్ కంటే రొమాన్సే అధికంగా ఉంటుందన్నారు. జయ్‌తో ఇంతకు ముందే ఎంగేయుం ఎప్పోదుం చిత్రంలో కలిసి పని చేశానని, అయితే ఆండ్రియా ఈ చిత్ర కథకు అవసరం అయ్యాయని వివరించారు. ఈ పాత్రకు ఆమె మినహా మరొక నటి గురించి ఆలోచన లేదన్నారు. ఈ చిత్రాన్ని ఎస్.కె.స్టూడియోస్ సంస్థ నిర్మిస్తున్నట్లు దర్శకుడు శరవణన్ తెలిపారు. ఆండ్రియా ఇప్పటికే జాతీయ అవార్డు గ్రహీత రామ్ దర్శకత్వంలో తరమణి చిత్రం లోను, కమల్ హాసన్ సరసన ఉత్తమ విలన్ చిత్రంలోనూ నటిస్తూ బిజీగా ఉన్నారు.  
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement