బిలియనీర్ల పిల్లలు.. దాదాపు వారి కుటుంబ వ్యాపారాలను చూసుకుంటూ వాటిని అభివృద్ధి చేయడంలో నిమగ్నమై ఉంటారు. ఈ కోవకు చెందిన వారిలో ముకేశ్ అంబానీ పిల్లలు (ఇషా, అనంత్, ఆకాష్) మాత్రమే కాకుండా.. ఉదయ్ కోటక్ కుమారుడు జై కోటక్ కూడా ఉన్నారు.
జై కోటక్ డిజిటల్ బ్యాంకింగ్ విభాగం కోటక్811కి కో-హెడ్‌గా.. సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్నారు. ఉదయ్ కోటక్ స్థాపించిన కోటక్ మహీంద్రా బ్యాంక్ మార్కెట్ క్యాప్ రూ. 3,53,000 కోట్లు. కాగా ఉదయ్ కోటక్ నికర విలువ 13.4 బిలియన్ డాలర్లు. భారతీయ కరెన్సీ ప్రకారం దీని విలువ సుమారు లక్ష కోట్ల కంటే ఎక్కువ.
2015లో ఫెమినా మిస్ ఇండియా కిరీటం సొంతం చేసుకున్న ప్రముఖ నటి 'అదితి ఆర్య'ను జై కోటక్ 2023 నవంబర్ 7న పెళ్లి చేసుకున్నారు. కాగా ఈ ఏడాది నవంబర్ 7న వీరిద్దరూ తమ మొదటి వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను కూడా జై తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా షేర్ చేశారు.
జై కోటక్.. కొలంబియా యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ, హార్వర్డ్ బిజినెస్ స్కూల్ నుంచి ఎంబీఏ పట్టా పొందారు. అయితే ఇతడు తన తండ్రి బ్యాంకులో చేరడానికి ముందు, మెకిన్సేలో రెండు సంవత్సరాలు (2012-2014) బిజినెస్ అనలిస్ట్‌గా పనిచేశారు. తర్వాత, అతను 2010లో గోల్డ్‌మన్ సాచ్స్‌లో ఇంటర్న్‌షిప్ పూర్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment