పెళ్లైన వ్యక్తితో ఎఫైర్‌.. అందుకే డిప్రెషన్‌: నటి | Andrea Jeremiah says affair with married man pushed her into depression | Sakshi
Sakshi News home page

పెళ్లైన వ్యక్తితో ఎఫైర్‌.. అందుకే డిప్రెషన్‌: నటి

Published Sat, Aug 10 2019 8:42 PM | Last Updated on Sat, Aug 10 2019 8:57 PM

Andrea Jeremiah says affair with married man pushed her into depression - Sakshi

చెన్నై: ధనుష్‌ ‘వడ చెన్నై’ సినిమాలో అద్భుతమైన నటన కనబర్చిన నటి, గాయని ఆండ్రియా జెరెమియా గత ఏడాదికాలంగా సినిమాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల మళ్లీ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా మారిన ఆండ్రియా పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఈ మధ్యకాలంలో తీవ్ర కుంగుబాటు (డిప్రెషన్‌)కు గురయ్యానని, దాని నుంచి కోలుకొని మళ్లీ సినిమాల్లో నటిస్తున్నానని ఆమె తెలిపారు. ఇటీవల బెంగళూరులో ఆండ్రియా తన కవితల పుస్తకం ‘బ్రోకెన్‌ వింగ్స్‌’ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అందులోని భావోద్వేగపరితమైన కవితను ఆమె చదివి వినిపించారు. ఈ సందర్భంగా శ్రోతలు ఆమె కవితలోని పలు బాధాత్మక పంక్తులను గురించి ప్రశ్నిం‍చారు.

దీనికి ఆండ్రియా సమాధానమిస్తూ.. తాను కొంతకాలం ఓ వివాహితుడితో రిలేషన్‌షిప్‌లో ఉన్నానని, అతను తనను మానసికంగా, శారీరకంగా వేధించి..గాయపర్చాడని, అందుకే తాను డిప్రెషన్‌లోకి వెళ్లినట్లు చెప్పారు. ఈ డిప్రెషన్‌ నుంచి బయటపడటానికి సినిమాలకు దూరంగా ఉంటూ.. ఆయుర్వేద చికిత్స పొందానని ఆమె తెలిపినట్లు ‘ఇండియా గ్లిట్జ్‌’ వెబ్‌సైట్‌ ఓ కథనంలో పేర్కొంది. తన కవితల ద్వారా వ్యక్తిగత భావాలను వెల్లడించానని, ఇలా వెల్లడించడానికి ఎంతో ధైర్యం కావాలని ఇన్‌స్టాగ్రామ్‌లో ‘బ్రోకెన్‌ వింగ్స్‌’ కవర్‌ పేజీ పోస్టు చేస్తూ.. ఆండ్రియా పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement