
కోలీవుడ్ సంచలన హీరోయిన్లలో ఆండ్రియా ఒకరు అని చెప్పవచ్చు. ఏ విషయాన్నైనా చాలా బోల్డ్‌గా మాట్లాడే ఆండ్రియా నటి మాత్రమే కాదు మంచి గాయని కూడా. నటుడు శరత్‌కుమార్ హీరోగా నటించిన పచ్చైక్కిళి ముత్తుచ్చారం చిత్రం ద్వారా నాయకిగా పరిచయం అవగా ఆ తరువాత కమల్‌హాసన్, కార్తీ, ఉదయనిధి స్టాలిన్ వంటి పలువురు స్టార్ హీరోల సరసన నటించి తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్నారు.
ఆండ్రియా తెలుగు, మలయాళం ప్రేక్షకులకు సుపరిచితమే. ఇకపోతే ఆ మధ్య యువ సంగీత దర్శకుడు అనిరుధ్‌తో సరసాలు సాగించిన ఈ బ్యూటీ ఆ తరువాత ఆయనకు దూరం అయ్యారు.. కారణం తన కంటే అతని వయసు తక్కువ కావడమేనని ఒక భేటీలో బహిరంగంగానే చెప్పారు. ఇకపోతే ఇటీవల వివాహితుడైన ఒక వ్యక్తితో రెండేళ్లు రిలేషన్‌షిప్‌లో ఉండి జీవితాన్ని నాశనం చేసుకున్నానని చెప్పి వార్తల్లోకెక్కారు. ఆ తరువాత శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురవడంతో ఆయుర్వేద చికిత్సతో అందులోంచి బయట పడినట్లు చెప్పారు.
కాగా జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్న ఆండ్రియా ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఇది తనకు బ్లాక్ డే అని ట్వీట్ చేశారు. నల్లదుస్తులు ధరించిన తన ఫొటోను పెట్టి తాను ప్రస్తుతం సింగిలే అని పేర్కొన్నారు. ఈ ట్వీట్ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈమె చేతిలో పిశాచి 2 చిత్రం మాత్రమే ఉంది. మిష్కిన్ దర్శకత్వం వహించిన ఇందులో ఆండ్రియా ప్రధాన పాత్రలో నటించారు. ఇది త్వరలో విడుదలకు ముస్తాబవుతోంది.
చదవండి: వినరో భాగ్యము విష్ణుకథ హీరోయిన్ గురించి ఈ విషయాలు తెలుసా?
Comments
Please login to add a commentAdd a comment