![Andrea Jeremiah Said Someones Hand Inside Her T Shirt - Sakshi](/styles/webp/s3/article_images/2022/11/16/jeremiah.jpg.webp?itok=0upwIxnQ)
గాయనిగా, హీరోయిన్‌గా బాగా పాపులారిటీ సంపాదించుకుంది ఆండ్రియా జెర్మియా. ప్రస్తుతం ఆమె 'అనల్ మెలె పనితుళి' అనే తమిళ సినిమా ప్రమోషన్స్‌తో బిజీగా ఉంది. ఈ సందర్భంగా ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఆండ్రియా మాట్లాడుతూ.. 'ఇది నా చిన్నప్పుడు జరిగింది. అప్పుడు నా వయసు దాదాపు 11 ఏళ్లు ఉంటుంది. నాన్నతో కలిసి బస్సులో వెళ్తున్నా. ఆయన నా పక్కనే కూర్చున్నారు. సడన్‌గా ఒక చేతు నా వీపుపై ఆనింది. నాన్నేమో అనుకున్నా. కానీ అంతలోనే ఆ చేయి నా టీషర్ట్ లోపలికి వెళ్లడంతో నాన్న వైపు చూశాను. ఆయన రెండు చేతులు ముందే ఉన్నాయి.
ఇంతలో ఆ చేయి ఇంకా లోనికి వెళ్లడంతో వెంటనే నేను కాస్త ముందుకు జరిగి కూర్చున్నా. కానీ ఈ విషయాన్ని నాన్నకో, అమ్మకో చెప్పలేకపోయాను. ఎందుకు చెప్పలేదంటే నాదగ్గర కారణం లేదు. బహుశా పుట్టి పెరిగిన సమాజంలోని కట్టుబాట్లు దృష్టిలో పెట్టుకుని చెప్పలేకపోయానేమో! కానీ అప్పుడే ఇది బయటకు చెప్పుంటే నాన్న ఏదో ఒక పని చేసి అతడికి బుద్ధొచ్చేలా చేసేవాడు. ఒకసారైతే కాలేజ్ బస్‌లో ఒకతను నా దగ్గరకు వచ్చి ఐ లవ్ యూ అంటూ గట్టిగా అరిచాడు. ఇలాంటివి నా జీవితంలో చాలా జరిగాయి. అన్నీ చూస్తూ వదిలేయడమే తప్ప మనమేం చేయలేం' అని చెప్పుకొచ్చింది ఆండ్రియా.
చదవండి: త్వరలో వివాహ బంధంలోకి మిల్కీ బ్యూటీ
ప్రైజ్‌మనీలో భారీగా కోత, కెప్టెన్సీ కంటెండర్స్ వాళ్లే!
Comments
Please login to add a commentAdd a comment