
ఒకప్పుడు తెలుగులో లవర్ బాయ్‌గా తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకున్న సిద్దార్థ్ తరువాత వరుస ఫ్లాప్ లతో టాలీవుడ్ కు దూరమయ్యాడు. ఇటీవల ఎక్కువగా తమిళ సినిమాల్లో మాత్రమే నటిస్తూ వస్తున్న సిద్ధూ లాంగ్ గ్యాప్ తరువాత తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నాడు. తెలుగు తెర మీద హిట్ ఫార్ములాగా పేరు తెచ్చుకున్న హర్రర్ జానర్‌లో గృహం పేరుతో తెరకెక్కిన సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఒకేసారి తెరకెక్కిన ఈ సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతోంది.
ఈ సినిమాను తమిళ వర్షన్ పాటు ఈ నెల 3న రిలీజ్ చేయాలని భావించారు. అయితే తెలుగునాట ఆశించిన స్థాయిలో థియేటర్లు దొరక్కపోవటంతో వారంపాటు వాయిదా వేసి నవంబర్ 10న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. కానీ 10న కూడా ఈ సినిమా రిలీజ్ కావటంలో కారణాలు వెల్లడించకపోయినా గృహం సినిమా వాయదా పడినట్టుగా ప్రకటించారు చిత్రయూనిట్. సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందన్న విషయాన్ని త్వరలోనే వెల్లడించనున్నట్టుగా తెలిపారు. చాలా రోజులుగా తెలుగులో మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న సిద్దార్థ్ ఈ సినిమాతో ఆకట్టుకుంటాడేమో చూడలి.
It pains us that #GRUHAM our Telugu film is still waiting for its censor certificate. We will try to release the film on November 17. #HOPE
— Siddharth (@Actor_Siddharth) 8 November 2017
Comments
Please login to add a commentAdd a comment