అవును విడిపోతున్నాం: హీరోయిన్ భర్త | Director Vijay confirms separation from wife Amala Paul | Sakshi
Sakshi News home page

అవును విడిపోతున్నాం: హీరోయిన్ భర్త

Published Thu, Aug 4 2016 11:33 AM | Last Updated on Mon, Sep 4 2017 7:50 AM

అవును విడిపోతున్నాం: హీరోయిన్ భర్త

అవును విడిపోతున్నాం: హీరోయిన్ భర్త

చెన్నై: తన భార్య అమలాపాల్ నుంచి విడాకులు తీసుకోనున్నట్టు తమిళ దర్శకుడు విజయ్ తెలిపాడు. తాము విడిపోతున్నామని అధికారికంగా ప్రకటించాడు. తమ వివాహ బంధం ఈవిధంగా ముగుస్తుందని తాను ఊహించలేదన్నాడు. 'మేము విడిపోతున్నామంటూ పలు రకాల వార్తలు వస్తున్నాయి. మేము విడిపోవడానికి అసత్య కారణాలు సాకుగా చూపుతున్నారు. ఈ ప్రచారం అవాస్తవం. మేము విడిపోవాలనుకున్న మాట నిజమే. దీనికి కారణం ఎవరికీ తెలియదు. నాకొక్కడికే తెలుసు' అని విజయ్ అన్నాడు.

పెళ్లైన తర్వాత   సినిమాల్లో నటించొద్దని అమలాపాల్ కు తాము అడ్డు చెప్పలేదని తెలిపాడు. 'నా సామాజిక బాధ్యత పట్ల చాలా జాగ్రత్తగా ఉంటా. నేను ఇప్పటివరకు 9 సినిమాలకు దర్శకత్వం వహించాను. నా సినిమాల్లో మహిళల పాత్రలను హుందాగా, ఆత్మగౌరవం ఉట్టిపడేట్టు చూపిస్తుంటాను. అలాంటిది నా భార్య స్వేచ్ఛను ఎలా అడ్డుకుంటాను. పెళ్లైన తర్వాత సినిమాల్లో నటిస్తానని అమల అంటే నేను అడ్డుచెప్పలేదు. మేము వద్దన్నామని వచ్చిన వార్తల్లో వాస్తవం లేద'ని విజయ్ పేర్కొన్నాడు. విజయ్, అమలాపాల్ 2014, జూన్ 12న పెళ్లి చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement