
ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన యాంథాలజీ ‘పిట్ట కథలు’ చిత్రంలో నటించి మెప్పించారు అమలాపాల్. నందిని రెడ్డి దర్వకత్వం వహించిన ఈ కథలో మీరా అనే మహిళా పాత్రలో ఆమె కనిపించారు. వివాహం మీద సాంప్రదాయ ఆలోచన ఉన్న ఆధునిక మహిళ మీరా. ఆమెను భర్త నిత్యం అనుమానిస్తూ ఉంటాడు. లైంగికంగా, శారీరక వేధింపులకు గురిచేస్తుంటాడు. అయినప్పటికీ మీరా అతనితోనే జీవితం కొనసాగిస్తుంటుంది. అయితే ఈ బంధం నుంచి బయటపడాలని అనుకున్నప్పుడు ఆమె చుట్టూ ఉన్న పరిస్థితులు మారిపోతాయి. చివరికి ఈ గృహహింస నుంచి తనెలా బయటపడిందనేది మీరా కథ. ఈ సిరీస్‌లోని తన నటనకు సినీ విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది ఈ కేరళ బ్యూటీ. ఈ క్రమంలో ఇటీవల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ముచ్చటించారు. వ్యక్తిగత జీవితం గురించి పలు విషయాలు చర్చించారు.
పిట్టకథలులోని తన పాత్ర దృష్టిలో పెట్టుకొని నిజ జీవితంలో చోటు చేసుకొన్న సంఘటనలను గుర్తు చేసుకొన్నారు. ‘ఏఎల్ విజయ్‌తో నెలకొన్న విభేదాల కారణంగా విడిపోవాలని అనుకొన్నప్పుడు నన్ను అందరూ భయపెట్టారు. నువ్వు ఒక అమ్మయివంటూ ఎగతాళి చేశారు. నాకు అండగా ఎవరూ నిలువడలేదు. నా కెరీర్ నాశనం అవుతుందని, సమాజం హేళన చేస్తుందని హెచ్చరించారు. నా సంతోం గురించి, నా మానసిక సంఘర్ణణను గురించి ఎవరూ పట్టించుకోలేదు’ అని అమలాపాల్ చెప్పుకొచ్చారు.
కాగా 2014 తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్‌ను ప్రేమించి పెళ్లాడిన అమలా పాల్ కొంత కాలానికే అతనితో విడిపోయారు. ఇద్దరి మధ్య తలెత్తిన మనస్పర్థలతో 2017 విడాకులు తీసుకున్నారు. అనంతరం ఆమధ్య కాలంఓ మరొకరితో రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు వెల్లడించారు. తనను బాగా అర్ధం చేసుకున్న వ్యక్తి తన జీవితంలోకి వచ్చాడని చెప్పినా.. తన పేరు మాత్రం వెల్లడించలేదు. అయితే దర్శకుడితో విడాకుల అనంతరం తన వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాన్ని టార్గెట్ చూస్తూ అనేకమంది అమలాను ట్రోల్స్ చేశారు. అయితే పట్టించుకోకుండా తన కెరీర్‌లో ముందుగు సాగుతున్నారు. ప్రస్తుతం అధో ఆంధా పరవాయి పోలా, ఆడు జీవితం, పరాణ్ణు పరాణ్ణు, పరాణ్ణు, కాడవెర్ చిత్రంలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రాలన్ని షూటింగ్ దశలో ఉన్నాయి.
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment