
దర్శకుడు విజయ్, ఐశ్వర్య దంపతులు
చెన్నై,పెరంబూరు: నటి అమలాపాల్ మాజీ భర్త, సినీ దర్శకుడు ఏఎల్.విజయ్ రెండో పెళ్లి చేసుకున్నారు. కిరీటం, మదరాసు పట్టణం, తలైవా, దైవ తిరుమగళ్, దేవీ 1, 2 వంటి పలు చిత్రాల దర్శకుడు ఏఎల్.విజయ్. ఈయనకు దైవ తిరుమగళ్ చిత్ర షూటింగ్ సమయంలో ఆ చిత్రంలో ఒక హీరోయిన్‌గా నటించిన అమలాపాల్‌తో పరిచయం ప్రేమగా మారింది. దీంతో ఇద్దరూ పెళ్లి చేసుకున్నా రు. అయితే మూడేళ్లు తిరగకుండానే విజ య్, అమలాపాల్ మధ్య మనస్పర్థలు తలెత్తడం, విడిపోవడం జరిగిపోయింది. 2017 లో వీరిద్దరూ చట్టబద్ధంగా విడాకులు పొం దారు. ఆ తరువాత దర్శకుడిగా విజయ్, నటిగా అమలాపాల్ ఎవరి పనిలో వాళ్లు బిజీ అయిపోయారు.
ఇలాంటి పరిస్థితుల్లో దర్శకుడు విజయ్ ఇటీవల చెన్నైకి చెందిన ఐశ్వర్య అనే వైద్యురాలిని వివాహం చేసుకోనున్నట్లు ప్రకటించారు. అన్నట్టుగానే విజయ్, ఐశ్వర్యను శుక్రవారం వివాహం చేసుకున్నారు. వీరి వివాహం నిరాడంబరంగా జరిగింది. ఇరువర్గాల కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు మాత్రమే ఈ వేడుకలో పాల్గొన్నారు. కాగా విజయ్‌కి ఆయన అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. రెండో వివాహం మీ జీవితంలో సంతోషాలను కురిపించాలని కొందరంటే, గతాన్ని మరిచిపోయి కొత్త జీవితాన్ని ఆనందంగా అనుభవించాలని కొందరు శుభాకాంక్షలు సామాజిక మాధ్యమాల ద్వారా తెలుపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment