చెన్నై: ప్రముఖ దర్శకుడు ఏఎల్ విజయ్ తండ్రి అయ్యాడు. ఆయన సతీమణి ఐశ్వర్య విజయ్ శనివారం ఉదయం పండంటి బిడ్డకు జన్మనిచింది. చెన్నైలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో ఐశ్వర్య విజయ్ మగబిడ్డకు జన్మనిచ్చిందని, తల్లీ బిడ్డలు క్షేమంగా ఉన్నట్లు విజయ్ సోదరుడు, నటుడు ఉదయ తెలిపారు. ‘నేను పెద్దనాన్నని అయ్యాను. ఉదయం 11.25 గంటల సమయంలో విజయ్, ఐశ్వర్య దంపతులకు మగ బిడ్డ పుట్టాడు. చాలా సంతోషంగా ఉంది’ అని ఉదయ ట్వీట్ చేశారు. (రూ.30 కోట్లు అడగలేదు: నటుడి భార్య)
కాగా హీరోయిన్ అమలాపాల్‌తో విడాకుల అనంతరం డాక్టర్ ఆర్.ఐశ్వర్యను దర్శకుడు ఏఎల్ విజయ్ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. విజయ్ 2014లో అమలాపాల్‌ను ప్రేమ వివాహం చేసుకున్నారు. మూడేళ్లు వీరి వైవాహిక జీవితం బాగానే సాగింది. ఆ తరవాత వ్యక్తిగత కారణాల వల్ల వీరిద్దరూ విడిపోయారు. 2017లో విడాకులు తీసుకున్నారు. కాగా, ప్రస్తుతం అమలాపాల్ సింగిల్‌గానే ఉన్నారు. (బాలయ్యకు మద్దతు తెలిపిన నిర్మాత)
Yes..IAM A PERIYAPPA now..Brother Director VIJAY And AISHWARYA VIJAY blessed with baby boy at 11.25am ...Happppyyyyyyyy....Soooo happpy....@onlynikil
— Udhaya (@ACTOR_UDHAYAA) May 30, 2020
Comments
Please login to add a commentAdd a comment