ఓ దర్శకుడితో వివాహం.. తర్వాత విడిపోవడం వంటి ఘటనలతో నటి అమలాపాల్.. ఆమధ్య వార్తల్లో ఉండేది. అయితే కొంతకాలం సైలెంట్ అయ్యింది. ఆ మధ్య నిర్మాతగానూ మారి ఎత్తి కడావర్ అనే చిత్రాన్ని నిర్మించి ప్రధాన పాత్రలో నటించింది. ఈమె తిరువళ్లూరు జిల్లా కోట్టకుప్పం ప్రాంతంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని అక్కడి నుంచి తాను చిత్ర నిర్మాణ కార్యక్రమాలు నిర్వహించింది.
ఈ క్రమంలో బవేందర్ సింగ్ అనే వ్యక్తి తనను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడని ఆరోపించింది. డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తాను అతనితో సన్నిహితంగా ఉన్న ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తానంటూ బెదిరిస్తున్నాడని గత నెల 22వ తేదీన తిరువళ్లూరు ఎస్పీకి తన మేనేజర్‌తో ఫిర్యాదు చెయించింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఈ నేపథ్యంలో అమలాపాల్ ఫిర్యాదు చేసిన బవేందర్ సింగ్‌ను అరెస్టు చేశారు. దీంతో అతను బెయిల్‌కోసం తిరువళ్లూరు కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. అందులో తాను నటి అమలాపాల్‌ను ఎలాంటి లైంగిక వేధింపులకు గురి చేయలేదని, తామిద్దరం 2019లో పెళ్లి చేసుకున్నామని పేర్కొంటూ అందుకు సంబంధించిన ఆధారాలను కోర్టులో సమర్పించాడు. దీంతో ఈ కేసును విచారించిన న్యాయస్థానం బవేందర్ సింగ్‌కు బుధవారం బెయిల్ మంజూరు చేసింది. దీంతో నటి అమలాపాల్కు రెండవ పెళ్లి జరిగినట్లు రుజువైంది.
Comments
Please login to add a commentAdd a comment