అమలాపాల్, విజయ్లకు విడాకులు మంజూరు | Amala Paul, AL Vijay legally divorced | Sakshi
Sakshi News home page

అమలాపాల్, విజయ్లకు విడాకులు మంజూరు

Feb 22 2017 2:28 PM | Updated on Sep 5 2017 4:21 AM

అమలాపాల్, విజయ్లకు విడాకులు మంజూరు

అమలాపాల్, విజయ్లకు విడాకులు మంజూరు

ప్రేమించి తరువాత పెద్దల అనుమతితో పెళ్లి చేసుకున్న సినీ తారలు అమలాపాల్, ఏఎల్ విజయ్లు లీగల్గా

ప్రేమించి తరువాత పెద్దల అనుమతితో పెళ్లి చేసుకున్న సినీ తారలు అమలాపాల్, ఏఎల్ విజయ్లు లీగల్గా       విడాకులు తీసుకున్నారు. 2014 జూన్ 12న ఇరు కుటుంబాల అనుమతితో ఒక్కటైన ఈ జంట కొంత కాలానికే విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు. పెళ్లి తరువాత సినిమాలకు దూరంగా ఉండాలన్న అత్తింటివారి ఆంక్షలు నచ్చని అమలా, విడాకులు తీసుకునేందుకు మొగ్గు చూపింది. జ్యుడిషియల్ సపరేషన్ పీరియడ్లో భాగంగా గత ఆరు నెలలుగా దూరంగా ఉంటున్న ఈ జంటకు, మంగళవారం చెన్నై ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది.

వివాహ బంధానికి దూరమైన తరువాత కెరీర్ మీద దృష్టి పెట్టిన ఇద్దరూ.., ప్రస్తుతం బిజీగా ఉన్నారు. ఇటీవల దేవీ సినిమాను డైరెక్ట్ చేసిన విజయ్, ప్రస్తుతం వనమగన్ సినిమాను రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. హీరోయిన్గా బిజీ అవుతున్న అమలాపాల్.. హెబ్బులి, అచ్చాయన్స్, సిండరెల్లా, వడ చెన్నై, తిరుట్టు పాయలె 2, విఐపి 2 చిత్రాల్లో నటిస్తోంది. విడాకుల వివాదం తరువాత అమలాపాల్కు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement