విడాకులు నిజమేనంట.. | Amala Paul’s divorce rumours are true | Sakshi
Sakshi News home page

విడాకులు నిజమేనంట..

Jul 28 2016 7:57 PM | Updated on Sep 4 2017 6:46 AM

ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్ అమలాపాల్ విడాకులు తీసుకుంటున్నారంటూ వచ్చిన రూమర్లు ఇప్పుడు నిజమేనంటున్నాయి కోలీవుడ్ వర్గాలు.

ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్ అమలాపాల్ విడాకులు తీసుకుంటున్నారంటూ వచ్చిన రూమర్లు ఇప్పుడు నిజమేనంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. దర్శకుడు ఎఎల్ విజయ్ను ప్రేమించి పెద్దలను ఒప్పించి 2014లో  వివాహం చేసుకున్నారు అమలాపాల్. అయితే రెండేళ్ల వ్యవధిలోనే వారి వివాహ బంధం బీటలు వారడం గమనార్హం.

అమలాపాల్ వరుసగా సినిమాలు చేస్తుండటం ఆమె భర్తకు నచ్చడంలేదన్నది విడాకులకు కారణంగా వినిపిస్తోంది. విజయ్ మాట కాదని అమలా కొన్ని సినిమాలు ఒప్పుకోవడం విడాకుల నిర్ణయానికి దారి తీసిందట. వీరి విడాకుల విషయం స్వయంగా విజయ్ తల్లిదండ్రులు ధృవీకరించడంతో.. ఇది నిజమేనంటూ చెన్నై సినీ వర్గాలు వెల్లడించాయి. విజయ్ తల్లిదండ్రులు కూడా ఈ నిర్ణయానికి సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం.  

చేతి నిండా సినిమాలతో కెరీర్ బిజీగా ఉన్న సమయంలోనే అమలా వివాహం చేసుకున్నారు. విజయ్ దర్శకత్వంలో ఆమె రెండు సినిమాల్లో నటించారు. ఆ పరిచయమే ప్రేమగా మారింది. పెళ్లి తర్వాత కొంత కాలం సినిమాల నుంచి విరామం తీసుకున్న ఆమె తిరిగి వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement