ఏదీ శాశ్వతం కాదు! | Amala Paul about Vijay | Sakshi
Sakshi News home page

ఏదీ శాశ్వతం కాదు!

Published Tue, Jan 31 2017 11:33 PM | Last Updated on Tue, Sep 5 2017 2:34 AM

ఏదీ శాశ్వతం కాదు!

ఏదీ శాశ్వతం కాదు!

‘‘ఇప్పటికీ విజయ్‌ అంటే నాకు ఇష్టమే. అతనిపై కోపమూ లేదు... అతణ్ణి చూసి అప్‌సెట్‌ కావడమూ లేదు’’అన్నారు అమలా పాల్‌. విడాకులు తీసుకున్నప్పటికీ మాజీ భర్తపై ఈ మలయాళీ ముద్దుగుమ్మకి మంచి అభిప్రాయం ఉన్నట్టుంది. తమిళ దర్శకుడు ఏఎల్‌ విజయ్‌తో ఈ కథానాయిక ప్రేమ, పెళ్లి, విడాకుల వ్యవహారాలు అందరికీ తెలిసినవే. విజయ్‌ తల్లిదండ్రులు పెట్టిన ఆంక్షల వల్లే అమలా పాల్‌ విడాకులు తీసుకున్నారని అప్పట్లో వార్తలు వినిపించాయి. వేరుపడిన తర్వాత ఇద్దరూ ఎవరి పనుల్లో వారు బిజీ అయ్యారు. దర్శకుడిగా విజయ్, హీరోయిన్‌గా అమలా పాల్‌ సినిమాలపై దృష్టి పెడుతున్నారు.

ఈ క్రమంలో విజయ్‌ దర్శకత్వంలో నటించే ఛాన్స్‌ వస్తే మీరు చేస్తారా? అనే ప్రశ్న అమలా పాల్‌ ముందుంచితే – ‘‘జీవితంలో ఏదీ శాశ్వతం కాదు. సినిమాల్లో నటించడం తప్ప ఇతర విషయాల గురించి నేను ఆలోచించడం లేదు. మేమొకటి తలిస్తే.. విధి మరొకటి తలచింది. ఈ జీవిత ప్రయాణంలో మన దరికి వచ్చిన అంశాలను, అవకాశాలను అంగీకరించి ముందుకు వెళ్లాలి’’ అన్నారామె. దీనర్థం... విజయ్‌ నుంచి వ్యక్తిగతంగా మాత్రమే విడిపోయాననీ, వృత్తిపరమైన సంబంధాలు కొనసాగుతాయని అమలా పాల్‌ చెబుతున్నారని ఊహించవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement