నిర్మాతగా అమలాపాల్
మైనా కుట్టి అమలాపాల్ జీవిత పయ నం అనూహ్య మలుపులతో సాగుతోందని చెప్పవచ్చు. హీరోయిన్‌గా కోలీవుడ్‌లో సిం ధు సమ వెలి చిత్రంతో పలు విమర్శలను ఎదుర్కొన్నారు. దీంతో తదుపరి అవకాశం వస్తుందో? రాదో? అన్న సందేహంతో గడిపారు. అలాంటిది మైనా చిత్రం నటిగా ఆమె జీవితాన్నే మార్చేసింది. ఆ తరువాత తమిళంతో పాటు తెలుగులోనూ వరుసగా అవకాశాలు అమలాపాల్‌ను స్టార్ హీరోయిన్‌ను చేసేశాయి. అలా లైమ్‌టైమ్‌లో ఉండగానే ద ర్శకుడు విజయ్‌తో ప్రేమ, పెళ్లి ఇవి అనూ హ్య పరిణామాలే.
వివాహానంతరం నటన కు దూరం అవుతారని ఎవరూ ఊహించలే దు. అలాంటిది చిన్నగ్యాప్ తరువాత సూర్య సరసన ఐక్యూ చిత్రంలో అతిథి పాత్రలో మె రవనుండడం అనుకోని పరిణామమే. తాజా గా మరో కొత్త అవతారం ఎత్తనున్నారు. అదే నిర్మాత బాధ్యతలు భుజస్కంధాలపై వేసుకోనుండడం ఎస్. అమలాపాల్ నిర్మాతగా తన భర్త విజయ్ గురువు ప్రియదర్శన్ దర్శకత్వంలో చిత్రం నిర్మించనున్నారు. ఇంతకుముందు సైవం, ప్రస్తుతం నైట్‌షో చిత్రాల నిర్మాణ సంస్థ థింక్ బిగ్ స్టూడియో బాధ్యతలను విజయ్ తండ్రి ఏఎల్ అలగప్పన్‌తో కలిసి అమలాపాల్ పంచుకుంటున్నారు.
ఈ చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమాలు ఇటీవల ప్రారంభమయ్యాయి. ప్రకాష్‌రాజ్, శ్రేయారెడ్డి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి ఇంకా పేరు పెట్టలేదు. జాతీయస్థాయిలో గౌరవం లభించే విధంగా చిత్ర కథ, కథనాలు ఉంటాయంటున్నారు చిత్ర యూనిట్ వర్గాలు. తాను నిర్మిస్తున్న తొలి చిత్రమే జాతీయస్థాయి గుర్తింపు పొందే చిత్రంగా రూపొందనుండడం సంతోషంగా ఉంది. ప్రియదర్శన్, సంతోష్ శివన్, ప్రకాష్‌రాజ్, శ్రేయారెడ్డి లాంటి వారు పని చేయడం చిత్రానికి పక్కబలం అని అమలాపాల్ అన్నారు. ఈ చిత్ర షూటింగ్ ఆగస్టు నుంచి మొదలవుతుందని ఈ సందర్భంగా అమలాపాల్ తెలిపారు.