
నటి అమలాపాల్ గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. మంచి, సంచలన, వివాదాస్పద నటి అంటూ ముద్రవేసుకున్న నటి ఈమె. మైనా చిత్రంతో కోలీవుడ్‌లో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న అమలాపాల్ ఆ తరువాత వరుసగా పలు చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. విజయ్, ధనుష్ వంటి ప్రముఖ నటులు సరసన నటించిన అమలాపాల్ టాలీవుడ్‌లోనూ నటించి బహుభాషా నటిగా పేరు తెచ్చుకుంది. నటిగా మంచి పీక్‌లో ఉండగానే దర్శకుడు విజయ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది.
(ఇదీ చదవండి: డ్రగ్స్ కేసుపై వివరణ ఇచ్చిన వరలక్ష్మీ శరత్‌కుమార్.. ఆదిలింగం ఎవరంటే)
అయితే రెండేళ్లలోపే మనస్పర్థలు రావడంతో వీరి పెళ్లి విడాకులకు దారి తీసింది. కాగా అమలాపాల్‌కు సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తోంది. అందులో మైనా చిత్రం తరువాత తాను చాలా మానసిక వేదనకు గురయ్యానని పేర్కొంది. జీవితంలో మోసపోయాను అనడం కంటే మోసగించబడ్డాననే చెప్పాలన్నారు. కరోనా కాలంలో రెండేళ్ల పాటు ఇంట్లోనే కూర్చొని తన గురించి తాను ఆలోచించుకుని ఆవేదన చెందానని చెప్పింది.
(ఇదీ చదవండి: విజయనిర్మల ఆస్తి ఎవరి సొంతం.. వీలునామాలో ఎవరి పేరు రాశారంటే: నవీన్)
తనను చూసి తన కంటే ఎక్కువ తన తల్లి బాధపడిందని చెప్పింది. తనకు మార్గదర్శి అంటూ ఎవరూ లేరంది. ఒక వేళ అలాంటి వ్యక్తి ఎవరైనా వుండి వుంటే తానూ అందరిలా ఆనందంగా ఉండేదానినేమోనని పేర్కొంది. కాగా ఆ మధ్య నిర్మాతగా మారిన అమలాపాల్ ప్రస్తుతం మాతృభాషలో మూడు చిత్రాలు, తమిళంలో ధనుష్ 50వ చిత్రంలో నటిస్తోంది.