నా దృష్టంతా నటనపైనే! | my Focus is Acting says amala paul | Sakshi
Sakshi News home page

నా దృష్టంతా నటనపైనే!

Dec 30 2016 10:47 PM | Updated on Aug 17 2018 2:24 PM

నా దృష్టంతా నటనపైనే! - Sakshi

నా దృష్టంతా నటనపైనే!

చాలా తక్కువ కాలంలోనే ఎక్కువ ప్రాచుర్యం పొందిన నటి అమలాపాల్‌. అదే విధంగా ఎంత తక్కువ కాలంలో దర్శకుడు విజయ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారో...

చాలా తక్కువ కాలంలోనే ఎక్కువ ప్రాచుర్యం పొందిన నటి అమలాపాల్‌. అదే విధంగా ఎంత తక్కువ కాలంలో దర్శకుడు విజయ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారో అంతే వేగంగా ఆయన నుంచి విడిపోయి వార్తల్లోకెక్కారు. భర్త నుంచి దూరమైన అమలాపాల్‌కు తొలి అవకాశం కల్పించింది నటుడు ధనుష్‌. ఆయన నిర్మించిన అమ్మాకణక్కు చిత్రంలో అమలాపాల్‌ ప్రధాన భూమికను పోషించారు. ఆ తరువాత వడచెన్నై, వీఐపీ–2 చిత్రాల్లో ధనుష్‌ తనకు జంటగా నటించే అవకాశాలను అమలాపాల్‌కే కల్పించారు. దీంతో ధనుష్‌తో అమలాపాల్‌ చెట్టాపట్టాల్‌ అంటూ రకరకాల ప్రచారాలు మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. వీటికి నటి అమలాపాల్‌ చాలా ఘాటుగానే స్పందించారు. ఇలాంటి వదంతులు పుట్టించడం నీచమైన చర్చగా పేర్కొన్నారు.

 ఎల్లప్పుడూ తన మంచి కోరే ధనుష్‌పై ఇలాంటి ఆరోపణలు చేయడం బాధగా ఉందన్నారు. తాను, విజయ్‌ విడిపోకూడదని భావించిన వారిలో నటుడు ధనుష్‌ ఒకరనీ పేర్కొన్నారు. ఈ విషయంలో ధనుష్‌ చర్చలు జరిపి విజయ్‌తో కలిసి జీవించడానికి చాలా ప్రయత్నం చేశారని చెప్పారు. అలాంటి ఆయనతో తనను కలుపుతూ మాట్లాడడం శోచనీయమన్నారు. ఇలాంటి వదంతులు జీర్ణించుకోలేని అసత్యాలని అన్నారు. వివాహరద్దుకు స్త్రీలనే బాధ్యులుగా చేయడం, వారిపైనే నేరం మోపడం సరికాదని అమలాపాల్‌ అన్నారు. జీవితంలో ఏదీ నిరంతరం కాదని, వివాహరద్దుకు సిద్ధం అవుతానని ఊహించనే లేదని అమలాపాల్‌ పేర్కొన్నారు. ప్రస్తుతం తన దృష్టి అంతా నటనపైనే ఉన్నట్లు ఆమె పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement