Naresh, Pavitra Lokesh Went To Dubai For Honeymoon After Wedding, Here Pics - Sakshi
Sakshi News home page

Naresh-Pavitra Lokesh : పెళ్లి తర్వాత దుబాయ్‌లో వెకేషన్‌ ఎంజాయ్‌ చేస్తోన్న నరేష్‌-పవిత్ర

Mar 10 2023 1:56 PM | Updated on Mar 10 2023 3:20 PM

Naresh And Pavitra Lokesh Off To Dubai After Their Wedding - Sakshi

సినీ నటుడు నరేష్‌-పవిత్రా లోకేశ్‌లు పెళ్లిబంధంతో ఒక్కటయ్యారు. సన్నిహితులు, కుటుంబసభ్యుల సమక్షంలో వీరి వివాహం మైసూర్‌లో జరిగినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి పెళ్లి వీడియోను నరేష్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో క్షణాల్లోనే ఆ వీడియో వైరల్‌గా మారింది. ‘ఒక పవిత్ర బంధం, రెండు మనసులు, మూడు ముళ్ళు, ఏడు అడుగులు, మీ ఆశీస్సులు కోరుకుంటూ  ఇట్లు, మీ #PavitraNaresh’అంటూ నరేష్‌ ట్వీట్‌ చేశారు.

గత కొంతకాలంగా వార్తల్లో నిలుస్తున్న నరేష్‌-పవిత్రా లోకేశ్‌లు తాజాగా మరోసారి పెళ్లి వీడియోతో టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారారు. నరేష్‌కు ఇది నాలుగో పెళ్లికాగా పవిత్రా లోకేశ్‌కు ఇది మూడో పెళ్లి. ఇక ప్రస్తుతం ఈ కొత్తజంట హనీమూన్‌ కోసం దుబాయ్‌కు వెళ్లినట్లు నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇద్దరూ కలిసి దుబాయ్‌ వీధుల్లో సందడి చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement