హనీమూన్‌కి వెళ్లిన మెగా కపుల్ వరుణ్-లావణ్య? | Varun Tej And Lavanya Tripathi Honeymoon Pic Viral | Sakshi
Sakshi News home page

Varun Tej Lavanya: పెళ్లి తర్వాత తొలిసారి వెకేషన్‪‌కి వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి

Published Sun, Dec 3 2023 6:10 PM | Last Updated on Sun, Dec 3 2023 6:43 PM

Varun Tej And Lavanya Tripathi Honeymoon Pic Viral - Sakshi

మెగా కపుల్ వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి పెళ్లి హడావుడి పూర్తిగా అయిపోయింది. దీంతో ఎంచక్కా కొత్తజంట టూర్ ప్లాన్ చేశారు. వివాహం తర్వాత తొలిసారి ఫారిన్ చెక్కేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే ఇది హనీమూన్ అని మెగా ఫ్యాన్స్ కింద కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ ఏంటి విషయం?

(ఇదీ చదవండి: 'ఏ మాయ చేసావె' నటి కన్నుమూత.. చివరి వీడియో వైరల్‌)

ఈ ఏడాది జూన్‌లో మెగా హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠితో నిశ్చితార్థం చేసుకుని చాలామందికి షాకిచ్చారు. ఎందుకంటే వీళ్లిద్దరూ గత ఆరేడేళ్లుగా ప్రేమలో ఉన్నప్పటికీ ఈ విషయం బయటపడలేదు. దీంతో ఎంగేజ్‌మెంట్‌ హాట్‌టాపిక్‌గా మారిపోయింది. ఇది జరిగిన దాదాపు నాలుగు నెలల తర్వాత నవంబరు 1న ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. 

నవంబర్ అంతా కూడా పెళ్లి హడావుడి, మిగతా కార్యక్రమాలతో బిజీ అయిపోయిన న్యూలీ వెడ్డింగ్ కపుల్.. ఇప్పుడు ఎంచక్కా వెకేషన్‌కి వెళ్లిపోయారు. అయితే ఇది హనీమూన్ ట్రిప్ అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. బహుశా తమకు అచ్చొచ్చిన ఇటలీ వెళ్లారా? లేదంటే మాల్దీవులుకి ఏమైనా వెళ్లారా అనేది ఒకటి రెండు రోజుల్లో వరుణ్, లావణ్య పోస్ట్ చేసే ఫొటోలు బట్టి తెలుస్తుంది.

(ఇదీ చదవండి: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన యంగ్ హీరోయిన్.. ఈమె ఎవరో తెలుసా?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement