
మెగా హీరో వరుణ్ తేజ్, తన భార్య లావణ్య త్రిపాఠితో కలిసి తిరుమల స్వామి వారిని దర్శించుకున్నాడు. మంగళవారం రాత్రి కొండపై బస చేసి, బుధవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో దర్శనం చేసుకున్నారు. తర్వాత మొక్కులు చెల్లించుకున్నారు. వేదపండితులు ఆశీర్వచనం అందించగా.. ఆలయ అధికారులు తీర్ధ ప్రసాదాలు అందజేశారు.
(ఇదీ చదవండి: ఎన్టీఆర్‌కి రోడ్డు ప్రమాదం అని రూమర్స్.. టీమ్ క్లారిటీ)
గతేడాది పెళ్లి చేసుకున్న పనిలో బిజీ అయిపోయిన వరుణ్ తేజ్.. ఇన్నాళ్లకు తీరిక చూసుకుని భార్యతో కలిసి తిరుమల దర్శనం చేసుకున్నాడు. ఆలయం బయట వీళ్లని చూసిన పలువురు.. సెల్ఫీలు, ఫొటోలు దిగేందుకు పోటీపడ్డారు. ఇదిలా ఉండగా వరుణ్ తేజ్ ప్రస్తుతం 'మట్కా' సినిమా చేస్తున్నాడు. 80స్ బ్యాక్ డ్రాప్‌లో స్టోరీతో తీస్తున్నారు. వచ్చే ఏడాది థియేటర్లలోకి రావొచ్చు.
(ఇదీ చదవండి: అన్నీ తానై.. కంగన 'ఎమర్జెన్సీ' ట్రైలర్ రిలీజ్)
#VarunTej #LavanyaTripathi Visited Tirumala Tirupati Devasthanam pic.twitter.com/k4J76fsFzy
— Telugu Film Producers Council (@tfpcin) August 14, 2024