బాలీవుడ్ నటి కంగన రనౌత్.. ప్రస్తుతం బీజేపీ తరఫున ఎంపీగా బాధ్యతలు నిర్వర్తిస్తోంది. ఇప్పుడు ఈమె ఒకప్పటి కాంగ్రెస్ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ పాత్రని పోషిస్తూ ఓ సినిమా చేసింది. అదే 'ఎమర్జెన్సీ'. చాన్నాళ్ల క్రితమే షూటింగ్ మొదలుపెట్టారు. ఇప్పుడు మూవీని రిలీజ్‌కి సిద్ధం చేశారు. సెప్టెంబరు 6న థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే ట్రైలర్ తాజాగా విడుదల చేశారు.
(ఇదీ చదవండి: ఎన్టీఆర్‌కి రోడ్డు ప్రమాదం అని రూమర్స్.. టీమ్ క్లారిటీ)
ట్రైలర్ విషయానికొస్తే.. 1971లో మన దేశంలో జరిగిన ఎమర్జెన్సీ పరిస్థితుల్ని కళ్లకు కట్టినట్లు చూపించినట్లు తెలుస్తోంది. ట్రైలర్ అంతా ఆసక్తిగా ఉంది. కంగన.. ఇందిరా గాంధీ, శ్రేయస్ తల్పడే.. వాజ్‌పేయి, అనుపమ్ ఖేర్.. జయప్రకాశ్ నారాయణ్ పాత్రల్లో కనిపించారు. మరి మూవీ ఎలా ఉండబోతుందో ఏంటో అని ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
(ఇదీ చదవండి: నాగచైతన్య ఎంగేజ్‌మెంట్.. అతనితో సమంత డేటింగ్!)
Comments
Please login to add a commentAdd a comment