ఎన్టీఆర్‌కి రోడ్డు ప్రమాదం అని రూమర్స్.. టీమ్ క్లారిటీ | Actor Jr Ntr Hand Injury Latest News | Sakshi
Sakshi News home page

NTR Injury: ఎన్టీఆర్ ఎడమ చేతికి గాయం.. ఏమైందంటే?

Published Wed, Aug 14 2024 2:57 PM | Last Updated on Wed, Aug 14 2024 4:01 PM

Actor Jr Ntr Hand Injury Latest News

'దేవర' షూటింగ్ ఎన్టీఆర్ పూర్తి చేశాడు. తన పాత్రకు సంబంధించిన చిత్రీకరణ పూర్తయిందని తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. దీంతో అభిమానులు మూవీ ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ఇంతలోనే ఇతడు రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడని, ప్రస్తుతం ఆస్పత్రిలో ఉన్నాడని రూమర్స్ వచ్చాయి. ఇవి నిజం కాదని స్వయంగా తారక్ టీమ్ క్లారిటీ ఇచ్చింది.

(ఇదీ చదవండి: నాగచైతన్య ఎంగేజ్‌మెంట్‌.. అతనితో సమంత డేటింగ్‌!)

కొన్నిరోజుల క్రితం జిమ్‌లో వర్కౌట్ చేస్తుండగా ఎడమ చేయి మణికట్టు దగ్గర కాస్త బెణికిందని, కానీ దాన్ని భరిస్తూనే 'దేవర' షూటింగ్ పూర్తి చేశారని.. దీనికి బదులు రోడ్డు ప్రమాదమని రూమర్స్ వస్తున్నాయి. అయితే ఈ రూమర్స్ ఎవరూ నమ్మొద్దని ఎన్టీఆర్ టీమ్ క్లారిటీ ఇచ్చింది. రెండు వారాలు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని చెప్పుకొచ్చారు.

జూ.ఎన్టీఆర్ కు గాయం నిజమే.. కానీ

'ఆర్ఆర్ఆర్' తర్వాత ఎన్టీఆర్.. కొరటాల శివ దర్శకత్వంలో 'దేవర' చేస్తున్నాడు. సెప్టెంబరు 27న తొలి పార్ట్ థియేటర్లలోకి రానుంది. జాన్వీ కపూర్ హీరోయిన్. ఇప్పటికే రెండు పాటలు రిలీజ్ చేయగా, అవి రెండు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. నెక్స్ట్ ఏం ప్రమోషనల్ కంటెంట్ వస్తుందా అని ఫ్యాన్స్ వెయిటింగ్.

(ఇదీ చదవండి: జూనియర్ ఎన్టీఆర్‌ దేవర.. అప్‌డేట్‌ ఇచ్చిన యంగ్‌ టైగర్!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement