జూనియర్ ఎన్టీఆర్‌ దేవర.. అప్‌డేట్‌ ఇచ్చిన యంగ్‌ టైగర్! | Jr NTR Shares Devara Part 1 Latest Update Shares With Fans | Sakshi
Sakshi News home page

Jr NTR: ఆ రోజు కోసం ఎదురుచూస్తున్నా: జూనియర్ ఎన్టీఆర్‌

Published Wed, Aug 14 2024 7:04 AM | Last Updated on Wed, Aug 14 2024 9:01 AM

Jr NTR Shares Devara Part 1 Latest Update Shares With Fans

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం దేవర. ఈ మూవీకి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్‌ దాదాపు పూర్తి కావొస్తోంది. ఈ సినిమా ద్వారా బాలీవుడ్ భామ జాన్వీ కపూర్‌ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఇప్పటికే రిలీజైన సాంగ్స్‌, గ్లింప్స్‌కు ఆడియన్స్‌ అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.  సముద్రం బ్యాక్‌డ్రాప్‌లో ఈ కథను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.

తాజాగా దేవర పార్ట్‌-1కు సంబంధించిన ఎన్టీఆర్‌ కీలక అప్‌డేట్‌ ఇచ్చారు. ప్రస్తుతం చివరిదశ షూట్‌ జరుగుతోందని వెల్లడించారు. ఈ జర్నీ అద్భుతంగా సాగిందని.. టీం అందరినీ మిస్‌ అవుతున్నానని తెలిపారు. సెప్టెంబర్‌ 27 కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు.  ఈ సందర్భంగా సెట్‌లో డైరెక్టర్‌తో ఫోటో దిగిన ఫోటోను పంచుకున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌ కీలకపాత్ర పోషిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement