వరుణ్‌ తేజ్‌- లావణ్య పూజలు.. కారణం ఇదేనా..? | Varun Tej And Lavanya Tripathi Blessings Godavari Thalli | Sakshi
Sakshi News home page

వరుణ్‌ తేజ్‌- లావణ్య పూజలు.. కారణం ఇదేనా..?

Feb 25 2024 8:39 AM | Updated on Feb 25 2024 11:17 AM

Varun Tej And Lavanya Tripathi Blessings Godavari Thalli - Sakshi

వివాహం తర్వాత వెంటనే సినిమా పనుల్లో పడిపోయాడు మెగా హీరో మరుణ్‌ తేజ్‌. ఆయన సతీమణి లావణ్య కూడా పూర్తిగా సినిమాలపైనే ఫోకస్‌ పెట్టారు. మిస్ పర్‌ఫెక్ట్ వెబ్ సిరీస్‌తో హాట్‌స్టార్‌లో రీసెంట్‌గా పలకరించింది లావణ్య. ఈ సిరీస్‌లో ఆమె పాత్ర కాస్త భిన్నంగా పర్వాలేదనిపించింది. మరోవైపు వరుణ్‌ తేజ్‌ కూడా పరేషన్ వాలెంటైన్ సినిమాతో మార్చి 1న రానున్నాడు. శక్తి ప్రతాప్ డైరెక్షన్‌లో రానున్న ఈ సినిమాలో ప్రపంచ సుందరి మానుషి చిల్లర్ హీరోయిన్‌గా ఉంది.

ఆపరేషన్ వాలెంటైన్ సినిమాకు సంబంధించి వేగంగా ప్రమోషన్స్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి. రీసెంట్‌గా వచ్చిన ట్రైలర్‌ ప్రేక్షలను మెప్పించింది. వరుణ్‌కు ఈ సినిమా కమ్‌బ్యాక్‌గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో మెగా హీరో తనదైన స్టైల్లో యాక్షన్‌ సీన్స్‌లలో మెప్పించాడు. తాజాగా   వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి దంపతులు గోదావరి తల్లిని దర్శించుకున్నారు. వారిద్దరూ కలిసి అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ విషయాన్ని వరుణ్ తన ఇన్‌స్టా వేదికగా తెలిపాడు. ఫోటోలో పూజారులు, వరుణ్‌ మాత్రమే ఉన్నారు. లావణ్య లేదు. కానీ లావణ్య కూడా గోదావరిలోని పడవ ఫోటోను షేర్ చేసింది. దీంతో వారిద్దరూ కలిసే అక్కడకు వెళ్లినట్లు తెలుస్తోంది.

వారిద్దరి ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారడంతో వారిద్దరూ పూజలో ఎందుకు పాల్గొన్నారో అంటూ  ఇన్‌స్టాలో పలు ప్రశ్నలు వచ్చాయి. ఇప్పటికే వరుస ప్లాపులతో ఉన్న వరుణ్‌ తేజ్‌ తన కొత్త సినిమా ఆపరేషన్ వాలెంటైన్ మంచి విజయాన్ని అందుకోవాలని గోదావరి తల్లి ఆశీర్వాదం తీసుకున్నారా..? అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. లేకపోతే ఇంకేమైనా కారణం ఉందా అని తెగ ఆలోచనల్లో పడిపోయారు మెగా ఫ్యాన్స్‌.

నేడు (ఫిబ్రవరి 25) సాయింత్రం 6గంటలకు ఆపరేషన్ వాలెంటైన్ ప్రీ రిలీజ్‌ కార్యక్రమం హైదరాబాద్‌లో జరగనుంది. ఈ కార్యక్రమానికి పద్మవిభూషన్‌ చిరంజీవి ముఖ్య అతిథిగా రానున్నారు. జేఆర్‌సీ కన్వెన్షన్‌లో ఈ వేడుక జరగనుంది. ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్‌ రావడంతో ఈ సినిమాపై మెగా ఫ్యాన్స్‌ భారీ అంచనాలు పెట్టుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement