హనీమూన్‌ల కోసమే దళితుల ఇళ్లకు | meant the honeymoon home.. | Sakshi
Sakshi News home page

హనీమూన్‌ల కోసమే దళితుల ఇళ్లకు

Published Sat, Apr 26 2014 2:23 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

హనీమూన్‌ల కోసమే దళితుల ఇళ్లకు - Sakshi

హనీమూన్‌ల కోసమే దళితుల ఇళ్లకు

రాహుల్‌పై బాబా రాందేవ్ వివాదాస్పద వ్యాఖ్యలు

 లక్నో: హనీమూన్‌లు, విహార యాత్రల కోసమే కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ దళితుల ఇళ్లకు వెళ్తుంటారని బాబా రాందేవ్ విమర్శించారు. ఓ దళిత అమ్మాయిని పెళ్లి చేసుకుని ఉంటే ఆయన అదృష్టం మరింత బాగుండేదని, ప్రధాని అయివుండేవారని శుక్రవారం వ్యాఖ్యానించారు. విదేశీ వనితను వివాహం చేసుకుంటే ప్రధాని పదవి చేజారి పోతుందని, ముందు ప్రధాని పీఠం ఎక్కిన తర్వాత విదేశీ మహిళను పెళ్లి చేసుకోవచ్చని సోనియా చెబుతుండడంతో రాహుల్ పెళ్లి చేసుకోకుండా ఉండిపోతున్నారని బాబా ఎద్దేవా చేశారు. భారతీయ వనితను చేసుకోవడం రాహుల్‌కు ఇష్టం లేదని చెప్పారు. రాహుల్ బలవంతంగా ఒంటరి జీవితం గడుపుతున్నారని ఎద్దేవా చేశారు. కాగా, తన వ్యాఖ్యలు వివాదమవుతాయని భావించిన బాబా.. దళితుల మనోభావాలు దెబ్బతింటాయని భావిస్తే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటానన్నారు.
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement