న్యూఢిల్లీ : టీమిండియా లెగ్ స్పిన్నర్ యజ్వేంద్ర చహల్ కొత్తగా దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ జంట దుబాయ్‌లో హనీమూన్‌లో ఉంది. సోషల్ మీడియాలో ఎప్పడూ యాక్టివ్‌గా ఉండే ఈ ఇద్దరూ తమకు సంబంధించిన ఫొటోలను, వీడియోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంటారు. తాజాగా తమ హనీమూన్‌కు సంబంధించిన రొమాంటిక్ ఫొటోను చహల్ అభిమానులతో పంచుకున్నారు. ( బాక్సింగ్ డే టెస్టు: పట్టు బిగిస్తున్న భారత్ )
భార్య ధనశ్రీతో దిగిన ఫొటోను చహల్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. దుబాయ్‌లోని ఓ హోటల్‌లో దిగిన ఫొటో అది. ధనశ్రీ వైట్ అండ్ బ్లాక్ స్కట్‌తో.. చహల్ జర్కిన్, షార్ట్‌తో స్టైలిష్‌గా ఉన్నారు. దీంతో ఫొటో వైరల్‌గా మారింది. ఇప్పటివరకు 7లక్షల వ్యూస్ దక్కించుకుంది. కాగా, చహల్ డిసెంబర్ 22వ తేదీ మంగళవారం కొరియోగ్రాఫర్ కమ్ యూట్యూబ్ స్టార్ ధనశ్రీని వివాహం చేసుకున్నారు. ఢిల్లీ శివార్లలోని గుర్గావ్ పరిధిలో ఉన్న ఓ రిసార్ట్‌లో హిందూ సంప్రదాయం ప్రకారం ఈ వేడుక జరిగింది.
Comments
Please login to add a commentAdd a comment