ఈ చిన్నారిని గుర్తుపట్టారా? ఇపుడు రాజ్యసభ ఎంపీ! | RS MP Sudhamurthy shares a childhood phot goes viral in social media | Sakshi
Sakshi News home page

ఈ చిన్నారిని గుర్తుపట్టారా? ఇపుడు రాజ్యసభ ఎంపీ!

Published Wed, Jul 31 2024 1:16 PM | Last Updated on Wed, Jul 31 2024 3:50 PM

RS MP Sudhamurthy shares a childhood phot goes viral in social media

రాజ్యసభ, ఎంపీ, రచయిత సుధానారాయణమూర్తి సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. అనేక సామాజిక అంశాలపై తన అభిప్రాయాలను పంచుకుంటూ ఉంటారు. ఒక్కోసారి తన వ్యక్తిగత విషయాలను  జోడిస్తూ, మరికొన్ని అవగాహన కల్పించే అంశాలను తన  అభిమానులతో కూడా షేర్‌ చేస్తూ ఉంటారు. తాజాగా తన చిన్నప్పటి  ఫోటో ఒకటి ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. దీంతో ఇది అభిమానులను ఆకట్టుకుంటోంది.

‘‘ఈ ఫోటో నాకు సంవత్సరం  వయస్సులో ఉన్నప్పుడు హుబ్లీలోని ఒక స్టూడియోలో తీసింది. ఆ సమయంలో, మేము షిగ్గావ్‌లో ఉండేవాళ్లం, కానీ అక్కడ స్టూడియోలు లేనందున, మేము ఈ ఫోటో కోసం హుబ్లీకి వెళ్లాం’’ అంటూ సుధామూర్తి తన బాల్య స్మృతులను  నెమరు వేసుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement