ఇటీవల స్మార్ట్ ఫోటోలు వచ్చాక తెగ క్లిక్ మనిపించేస్తున్నారు జనాలు. జస్ట్ చేతిలో ఫోను ఉంటే చాలు ప్రతిదాన్ని క్లిక్ మనిపించేయడమే!. ఇది.. అది.. అని ఏం ఉండదు. ఇక ఈ సోషల్ మీడియాల పుణ్యామా అని ఆ పిచ్చి మరీ ఎక్కువయ్యింది. ఏదోక రెసీపీ తయారు చేయడం వెంటనే సోషల్ మీడియాలోనే లేదా వాట్సాప్‌లో ఫ్రెండ్‌కో షేర్ చేయడం చేస్తుంటారు. అయితే ఇలా ఫుడ్ ఐటెమ్స్ గనుక ఫోటోలు తీస్తే తెలియకుండానే బరువు పెరగుతారట. ఏంటిది? ఫోటోలు తీస్తే బరువులు పెరగడమా! అని ఆశ్చర్యపోకండి. ఇది నిజం. యూఎస్‌లోని ఓ యూనివర్సిటి చేసిన అధ్యయనంలో ఈ షాకింగ్ విషయం వెల్లడైంది.
వివరాల్లోకెళ్తే..యూఎస్‌లో జార్జియా సదరన్ యూనివర్సిటీ పరిశోధకులు జరిపిన అధ్యయనంలో వందలో దాదాపు 70 మంది తినడానికి ముందు ఫుడ్ ఐటెమ్స్‌ని ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నట్లు తేలింది. అలా చేస్తున్న వాళ్లు అనూహ్యంగా బరువు పెరుగుతున్నట్లు గమనించారు. ఇలా ఫోటో తీసిన వాళ్లంతా మాములుగా తినేదాని కంటే ఎక్కువుగా తింటున్నట్లు అధ్యయనంలో వెల్లడైంది.
ఫోటో తీయడం వల్ల ఆహారంపై మక్కువ పెరిగి మళ్లీమళ్లీ కావాలనిపిస్తుందట. ఈ మేరకు జార్జియన్ యూనివర్సిటీ 145 మంది స్టూడెంట్స్‌పై పరిశోధన నిర్వహించింది. ఆ స్టూడెంట్స్‌ని రెండు గ్రూపులుగా విభజించి ఒక్కొక్కరికి ఒక్కో ప్లేట్ ఛీజ్‌క్రాకర్స్ ఇచ్చారు. ఒక గ్రూప్‌ని వెంటనే తినమని, మరో గ్రూప్‌ని ఫోటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాక తినమని చెప్పారు పరిశోధకులు. అలాగే తిన్న తర్వాత ఫుడ్ రేటింగ్ ఇవ్మమని కూడా అడిగారు.
అయితే సోషల్ మీడియాలో పోటో తీసిన వాళ్లంతా ఫుడ్‌ని చాలా ఎంజాయ చేశామని రేటింగ్ ఇవ్వడమే గాక, ఇంకా కావాలని అడిగినట్లు పరిశోధకులు వెల్లడించారు. ఇలా ఫోటోలు తీయడం అనేది ఒక స్వీట్ మెమొరీ కాబట్టి అది మనకు తెలియకుండానే తినేదానిపై ప్రభావం చూపుతుందన్నారు పరిశోధకులు. దీంతో బ్రెయిన్ మనలో మళ్లీ మళ్లీ తినాలనే కోరికను బలంగా ప్రేరేపిస్తుందన్నారు. అందువల్ల ఎవరైనా ఎక్కువగా తినకుండా ఉండాలన్నా లేదా జంక్ ఫుడ్ మానేయాలనుకున్నా ఇలా ఫుడ్ ఐటెమ్స్‌ని ఫోటోలు తీసుకోకపోవడమే మంచిదని జార్జియా యూనివర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు.
(చదవండి: తల్లిదండ్రుల చేసిన ఘాతుకానికి..ఏకంగా ఆ చిన్నారి 80 ఏళ్లుగా..)
Comments
Please login to add a commentAdd a comment