పదేళ్లుగా క్రమం తప్పకుండా వ్యాయామం
జిమ్ చేస్తుండగా సడెన్‌గా తీవ్రమైన తలపోటు
ఆసుపత్రికి తరలించేలోపే విషాదం
ఫిట్‌నెస్ కోసం వ్యాయామం చేస్తూ కుప్పకూలి ప్రాణాలు కోల్పోయిన ఘటన ఆందోళన రేపుతోంది. జిమ్‌లో వర్కౌట్స్ చేస్తూ అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు ఒక యువకుడు. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో ఈ విషాదం చోటు చేసుకుంది.
వారణాసికి చెందిన దీపక్ గుప్తా (32)గత పదేళ్లుగా జిమ్‌లో రెగ్యులర్‌గా వ్యాయామం చేస్తుండేవాడు.పలు ఫిట్‌నెస్ పోటీలలో చురుకుగా పాల్గొనేవాడు. ఫిట్‌నెస్ అంటే ప్రాణం పెట్టే దీపక్ రోజూలాగానే జిమ్‌కెళ్లి వ్యాయామం చేస్తుండగా తీవ్రమైన తలపోటుతో బాధపడినట్టుగా వీడియో ఫుటేజ్‌ని బట్టి తెలుస్తోంది. నేలపై పడకముందే తన తలని చేతుల్లో పెట్టుకుని కూర్చున్న దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి.
కిందపడిపోయిన దీపక్‌ను అక్కడున్న వారు లేపి కూర్చోబెట్టారు. నీళ్లు తాగించారు, వీపు, తలపై మసాజ్ చేశారు.అయినా గజ గజ వణికిపోయాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే ప్రాణం పోయిందని వైద్యులు ప్రకటించారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మెడికల్ రిపోర్టు వచ్చిన తర్వాత అతడి మృతికి ఖచ్చితమైన కారణం తెలియనుంది.
Comments
Please login to add a commentAdd a comment