ప్రపంచంలోనే తొలి పోర్టబుల్‌ విపత్తు‌ ఆస్పత్రి!ఎక్కడంటే.. | India Builds World's First Portable Hospital To Keep 200 Survivors Alive For 48 Hrs | Sakshi
Sakshi News home page

ప్రపంచంలోనే తొలి పోర్టబుల్‌ విపత్తు‌ ఆస్పత్రి!ఎక్కడంటే..

Published Sun, May 26 2024 12:33 PM | Last Updated on Sun, May 26 2024 1:17 PM

India Builds World's First Portable Hospital To Keep 200 Survivors Alive For 48 Hrs

ఆస్పత్రిని అప్పటికప్పుడూ సెట్‌ వేసినట్లుగా సెటప్‌ చేసే పోర్టబుల్‌ ఆస్పత్రి గురించి విన్నారా. పైగా ఈ ఆస్పత్రి సాయంతో దాదాపు 200 మంది రోగులకి ఒకేసారి వైద్యం అందించొచ్చట కూడా. ఇంతకీ ఏ దేశం ఈ ఆస్పత్రి మోడల్‌ని తీసుకొచ్చిందంటే..

భారతదేశం ప్రపంచంలోనే తొలి విపత్తు ఆస్పత్రిని ప్రవేశపెట్టింది. దీనిని ఎయిర్‌లిఫ్ట్‌ చేసి సుమారు 72 క్యూబ్‌లు ప్యాక్‌ చేయవచ్చు. ఈ ప్రాజెక్ట్‌ను 'ఆరోగ్య మైఔత్రి క్యూబ్‌' అని పిలుస్తారు. భీష్మ(భారత హెల్త్‌ ఇనిషియేటివ్‌ ఫర్‌ సహయోగ్‌ హితా అండ్‌ మైత్రి ప్రాజెక్ట్‌)లో భాగంగా ఈ సరికొత్త ప్రాజెక్ట్‌ని తీసుకొచ్చారు. ఈ క్యూబ్‌లలో ఆపరేషన్‌ థియేటర్‌, మినీ ఐసీయలు, వెంటిలేటర్లు, రక్త పరీక్షపరికరాలు, ఎక్స్‌రే యంత్రం, వంట స్టేషన్‌, ఆహారం, నీరు, షెల్టర్‌ పవర్‌ జనరేటర్‌ వంటి అవసరమైన పరికరాలు, సామాగ్రి అందుబాటులో ఉంటాయి. అలాగే ప్రత్యేక కేజ్‌లో దాదాపు వందమంది రెండు రోజుల పాటు జీవించేందుకు అవసరమైన సామాగ్రితో నింపిన 36 మినీ క్యూబ్‌లను చూడవచ్చు. వీటిలో రెండు మెయిన్‌ కేజ్‌లు ఉంటాయి.

వాటిని మాస్టర్‌ క్యూబ్స్‌ అని పిలుస్తారు. వీటిల్లో దాదాపు 200 మంది ప్రాణాలను రక్షిచవచ్చు. ఈ మినీ ఫోర్టబుల్‌ ఆస్పత్రి 40 బుల్లెట్ గాయాలు, 25 పెద్ద రక్తస్రావం, 25 పెద్ద కాలిన గాయాలు, సుమారు 10 హెడ్‌ ఇంజూరీస్‌, వెన్నెముక గాయాలు, ఛాతీ గాయాలు, వెన్నుముకకి అయ్యే పగళ్లు గాయాలు వంటి వివిధ రకాల తీవ్రమైన గాయాలను నిర్వహించగల సామర్థ్యం గలది. గతేడాది ప్రధాని నరేంద్ర మోదీ ప్రాజెక్ట్‌ బీష్మలో భాగంగా ఈ ఆరోగ్య మైత్రి క్యూబ్‌ని ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత రక్షణ మంత్రిత్వ శాఖ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. నిజానికి ఈ ఆరోగ్య మైత్రి ప్రాజెక్ట్‌ని గత జనవరిలో జరిగిన గ్లోబల్‌ సదస్సులో ప్రకృతి వైపరీత్యాలు లేదా మానవతా సంక్షోభాల వల్ల ప్రభావితమైన అభివృద్ధి చెందుతున్న దేశాలకు అవసరమైన వైద్య సామాగ్రిని అందించే లక్ష్యంతో ప్రవేశపెట్టారు.

ఆగస్టులో గుజరాత్‌లోని గాంధీనగర్‌లో జరిగిన మెడ్‌టెక్ ఎక్స్‌పోలో జరిగిన జీ20 ఆరోగ్య మంత్రుల సమావేశంలో ఈ ప్రాజెక్టు అధికారిక ప్రారంభం జరిగింది. అంతేగాదు ఈ ప్రాజెక్టును మొదటగా మయన్మార్ అధికారులకు చూపించారు. ఇక  ప్రధాని మోదీ వ్యక్తిగతంగా ఆరోగ్య, రక్షణ మంత్రిత్వ శాఖలకు ఈ ఆలోచనను అందించారు. ఆయన సూచనల కారణంగా ఆయుర్వేద ఉత్పత్తులకు క్యూబ్స్‌లోని వస్తువులు జాబితాలో జోడించామని అధికారులు తెలిపారు. భారతదేశం మయన్మార్‌కు రెండు ఆరోగ్య మైత్రి క్యూబ్‌లను విరాళంగా అందించింది ఒక శ్రీలంకకు కూడా ఒకటి విరాళంగా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది.

(చదవండి: మిట్టీకూల్’: మట్టితో ఫ్రిడ్జ్‌‌!..కరెంట్‌తో పనిలేదు..!)

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement