మార్నింగ్‌ వాక్‌ వెళ్లిన వ్యక్తిపై కుక్కల దాడి.. అక్కడికక్కడే మృతి  | Man Mauled To Death By Stray Dogs At AMU Campus In Aligarh | Sakshi
Sakshi News home page

మార్నింగ్‌ వాక్‌ వెళ్లిన వ్యక్తిపై కుక్కల దాడి.. అక్కడికక్కడే మృతి 

Published Sun, Apr 16 2023 8:45 PM | Last Updated on Sun, Apr 16 2023 8:47 PM

Man Mauled To Death By Stray Dogs At AMU Campus In Aligarh - Sakshi

లక్నో: ఇటీవలి కాలంలో కుక్కల దాడులు ఎక్కువయ్యాయి. దేశవ్యాప్తంగా కుక్కల దాడి ఘటనలు ఎక్కువ సంఖ్యలో వెలుగులోకి వస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఏదో ఒకచోట కుక్కల దాడిలో ఎవరో ఒకరు మృతిచెందడం లేక గాయపడటం జరుగుతోంది. ఇక, తాజాగా మార్నింగ్‌ వాక్‌ చేస్తున్న ఓ వ్యక్తిపై కుక్కలు మూకుమ్మడి దాడి చేశాయంతో తీవ్రంగా గాయపడి మృతిచెందాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ క్యాంపస్‌లో డాక్టర్ సఫ్దర్ అలీ అనే వ్యక్తి ఆదివారం ఉదయం 6 గంటల ప్రాంతంలో మార్నింగ్‌ వాక్‌ చేస్తున్నారు. పార్క్‌లో ఓ చోట నిలుచుని వ్యాయామం చేస్తున్నాడు. ఈ క్రమంలో అక్కడున్న కుక్కలు ఒక్కసారిగా అతడిపై దాడి చేశాయి. పది కుక్కుల గుంపుగా ఏర్పడి మూకుమ్మడిగా దాడి చేశాయి. తప్పించేందుకు ఆయన ఎంతగా ప్రయత్నించినప్పటికీ అవి పదే పదే దాడి చేయడంతో పాటు నోటితో ఈడ్చుకెళ్లి తీవ్రంగా గాయపరిచాయి. తీవ్రగాయాలతో సఫ్దర్ అలీ ఘటనాస్థలిలోనే ప్రాణాలు కోల్పోయాడు.

అనంతరం, అటుగా వచ్చిన కొందరు వ్యక్తులు సప్దర్‌ అలీ మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో, ఘటనా స్థలానికి చేరుకున్ని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే, అతను ఎలా చనిపోయాడోనని పోలీసులు సీసీ ఫుటేజీని పరిశీలించగా కుక్కల దాడిలో మృతిచెందినట్టు గుర్తించారు. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని విడుదల చేశారు. దీంతో, ఈ వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ ఘటన నేపథ్యంలో స్థానికులు ఆ ప్రాంతంలో తిరిగేందుకు టెన్షన్‌ పడుతున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement