aligarh muslim university
-
‘మైనార్టీ హోదా’పై కొత్త బెంచ్
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని ప్రఖ్యాత అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ(ఏఎంయూ)కి మైనార్టీ విద్యాసంస్థ హోదా ఉందో లేదో తేల్చే అంశంపై ఏడుగురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక తీర్పు వెలువరించింది. ఈ వ్యవహారాన్ని నూతన ధర్మాసనానికి(బెంచ్)కు అప్పగిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం 4–3 మెజార్టీతో శుక్రవారం 118 పేజీల తీర్పు ఇచ్చింది. విద్యా సంస్థ నియంత్రణ, పరిపాలన విషయంలో పార్లమెంట్లో చట్టం చేసినప్పటికీ ఆ సంస్థకు ఉన్న మైనార్టీ హోదాను రద్దు చేయరని వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వ చట్ట ప్రకారం అలీగఢ్ ముస్లిం వర్సిటీని మైనార్టీ విద్యాసంస్థగా పరిగణించలేమంటూ 1967లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తోసిపుచ్చింది. పరిపాలనా విభాగంలో మైనార్టీలు లేనంత మాత్రాన మైనార్టీ విద్యాసంస్థ కాకుండాపోదని తేల్చిచెప్పింది. మతపరంగా లేదా భాషపరంగా మైనార్టీలైన వ్యక్తులు విద్యాసంస్థలు స్థాపించడం లేదా నిర్వహించడాన్ని వ్యతిరేకిస్తూ, వివక్ష చూపుతూ తీసుకొచ్చిన చట్టం లేదా కార్యనిర్వాహక చర్య రాజ్యాంగంలోని ఆర్టికల్ 30(1)కు విరుద్ధమని తేల్చిచెప్పింది. ఈ ఆర్టికల్ ప్రకారం విద్యాసంస్థలను స్థాపించే, నిర్వహించే హక్కు మత, భాషాపరమైన మైనార్టీలకు ఉంది. ‘‘ఏఎంయూను మైనార్టీ విద్యాసంస్థగా పరిగణించలేం.. అది సెంట్రల్ యూనివర్సిటీ అంటూ ఎస్.అజీజ్ బాషా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో 1967లోఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును తోసిపుచ్చుతున్నాం. తాము స్థాపించిన విద్యా సంస్థ మైనార్టీల ప్రయోజనాల కోసమేనని దానిని ఏర్పాటు చేసినవారు నిరూపించుకోవాలి. రాజ్యాంగం అమల్లోకి రాకముందు ఏర్పాటైన యూనివర్సిటీలకు సైతం ఆర్టికల్ 30(1) కింద ఇచ్చిన హక్కు వర్తిస్తుంది’’ అని ధర్మాసనం స్పష్టంచేసింది. అయితే, ఇదే ధర్మాసనంలోని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మ మూడు వేర్వేరు భిన్నమైన తీర్పులు ఇచ్చారు. ఏఎంయూ మైనార్టీ విద్యాసంస్థ కాదని జస్టిస్ దీపాంకర్ దత్తా తన తీర్పులో స్పష్టంచేశారు. ఏమిటీ కేసు? స్వాతంత్య్రానికి పూర్వమే 1875లో మహ్మదన్ ఆంగ్లో ఓరియంటల్గా కాలేజీగా ప్రారంభమైన ఈ విద్యాసంస్థను 1920లో యూనివర్సిటీగా మార్చారు. ఏఎంయూ అనేది కేంద్ర ప్రభుత్వం నిధులు సమకూరుస్తున్న సెంట్రల్ యూనివర్సిటీ అని, దాన్ని మైనార్టీ విద్యాసంస్థగా పరిగణించలేమని 1967లో సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. ఈ నేపథ్యంలో 1981లో పార్లమెంట్లో ఏఎంయూ(సవరణ) చట్టాన్ని తీసుకురావడంతో ఏఎంయూకు మళ్లీ మైనార్టీ విద్యాసంస్థ హోదా లభించింది. ఈ చట్ట సవరణను సవాలు చేస్తూ అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దాంతో ఏఎంయూ(సవరణ) చట్టం–1981ను కొట్టివేస్తూ హైకోర్టు 2006లో తీర్పు ఇచ్చింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ 2006లో అప్పటి యూపీఏ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ దాఖలు చేసింది. మరికొందరు సైతం పిటిషన్లు దాఖలుచేశారు. యూపీఏ ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు 2016లో ఎన్డీయే ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. మిగిలిన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ ప్రారంభించింది. ఈ అంశాన్ని 2019 ఫిబ్రవరి 12న ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి అప్పగించింది. పిటిషన్లపై ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. ఏఎంయూకు మైనార్టీ సంస్థ హోదా ఉందో లేదో నూతన బెంచ్ నిర్ణయిస్తుందని తేల్చిచెప్పింది. -
సీజేఐ లాస్ట్ వర్కింగ్ డే.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
న్యూఢిల్లీ:సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)గా డీవై చంద్రచూడ్ చివరి పనిదినమైన శుక్రవారం(నవంబర్ 8) సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రముఖ అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీకి మైనార్టీ హోదాపై సీజేఐ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం 4:3 మెజారిటీతో తీర్పు చెప్పింది. అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ సెంట్రల్ యూనివర్సిటీ అయినంత మాత్రాన మైనార్టీ హోదా ఉండదనే సుప్రీంకోర్టు 1967లో ఇచ్చిన తీర్పును ధర్మాసనంలో సీజేఐ డీవై చంద్రచూడ్ సహా జస్టిస్ సంజీవ్ కన్నా,జస్టిస్ జేబీ పార్థీవాలా,జస్టిస్ మనోజ్మిశ్రాలు తోసిపుచ్చారు. ఇక ఈ తీర్పుతో ధర్మాసనంలోని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ ఎస్సీ శర్మ విభేదించారు. అయితే అలీగఢ్ యూనివర్సిటీకి మైనార్టీ హోదా ఉంటుందా ఉండదా అనే అంశాన్ని తేల్చేపనని ధర్మాసనం ముగ్గురు జడ్జిల ప్రత్యేక బెంచ్‌కు అప్పగించింది. కాగా, ఈ ఏడాది జనవరి చివరిలో ఈ కేసులో ఎనిమిది రోజుల పాటు వాదనలు విన్న అనంతరం ఫిబ్రవరి 1న సుప్రీంకోర్టు తీర్పు రిజర్వు చేసింది. శుక్రవారం సీజేఐ చంద్రచూడ్ చివరి పనిదినం కావడం గమనార్హం. ఆయన నవంబర్ 10 (ఆదివారం) రిటైర్ అవుతున్నారు.ఇదీ చదవండి: కోల్‌కతా హత్యాచార కేసు బదిలీకి సుప్రీం నో -
ఆరుగురు అలీగఢ్ వర్సిటీ విద్యార్థుల అరెస్ట్
లక్నో: ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్(ఐసిస్) తరఫున పనిచేస్తున్నారనే ఆరోపణలపై యూపీ పోలీసులు అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీకి చెందిన ఆరుగురు విద్యార్థులను అరెస్ట్ చేశారు. నిందితులందరికీ అలీగఢ్ యూనివర్సిటీ విద్యార్థుల సంఘమైన స్టూడెంట్స్ ఆఫ్ అలీగఢ్ యూనివర్సిటీ(సము)తో సంబంధాలున్నట్లు పోలీసులు తెలిపారు. వీరు తరచుగా సమావేశాలు నిర్వహిస్తూ, ఐసిస్‌లోకి కొత్త వారిని చేర్చుకుంటున్నారని ఉత్తరప్రదేశ్ యాంటీ టెర్రర్ స్క్వాడ్(ఏటీఎస్) విభాగం తెలిపింది. దేశంలో భారీ ఉగ్రదాడికి వీరు కుట్ర పన్నుతున్నారని వెల్లడించింది. అరెస్టయిన వారిలో రకీమ్ ఇనామ్, నవీద్ సిద్దిఖి, మహ్మద్ నొమాన్, మహ్మద్ నజీమ్ అనే నలుగురిని గుర్తించింది. వీరందరినీ రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో అరెస్ట్ చేసినట్లు వివరించింది. ఇప్పటికే ఈ విద్యార్థి సంఘం కార్యకలాపాలపై కేంద్ర నిఘా వర్గాలు ఓ కన్నేసి ఉంచాయని కూడా పేర్కొంది. -
మార్నింగ్ వాక్ వెళ్లిన వ్యక్తిపై కుక్కల దాడి.. అక్కడికక్కడే మృతి
లక్నో: ఇటీవలి కాలంలో కుక్కల దాడులు ఎక్కువయ్యాయి. దేశవ్యాప్తంగా కుక్కల దాడి ఘటనలు ఎక్కువ సంఖ్యలో వెలుగులోకి వస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఏదో ఒకచోట కుక్కల దాడిలో ఎవరో ఒకరు మృతిచెందడం లేక గాయపడటం జరుగుతోంది. ఇక, తాజాగా మార్నింగ్ వాక్ చేస్తున్న ఓ వ్యక్తిపై కుక్కలు మూకుమ్మడి దాడి చేశాయంతో తీవ్రంగా గాయపడి మృతిచెందాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ క్యాంపస్‌లో డాక్టర్ సఫ్దర్ అలీ అనే వ్యక్తి ఆదివారం ఉదయం 6 గంటల ప్రాంతంలో మార్నింగ్ వాక్ చేస్తున్నారు. పార్క్‌లో ఓ చోట నిలుచుని వ్యాయామం చేస్తున్నాడు. ఈ క్రమంలో అక్కడున్న కుక్కలు ఒక్కసారిగా అతడిపై దాడి చేశాయి. పది కుక్కుల గుంపుగా ఏర్పడి మూకుమ్మడిగా దాడి చేశాయి. తప్పించేందుకు ఆయన ఎంతగా ప్రయత్నించినప్పటికీ అవి పదే పదే దాడి చేయడంతో పాటు నోటితో ఈడ్చుకెళ్లి తీవ్రంగా గాయపరిచాయి. తీవ్రగాయాలతో సఫ్దర్ అలీ ఘటనాస్థలిలోనే ప్రాణాలు కోల్పోయాడు. అనంతరం, అటుగా వచ్చిన కొందరు వ్యక్తులు సప్దర్ అలీ మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో, ఘటనా స్థలానికి చేరుకున్ని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే, అతను ఎలా చనిపోయాడోనని పోలీసులు సీసీ ఫుటేజీని పరిశీలించగా కుక్కల దాడిలో మృతిచెందినట్టు గుర్తించారు. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని విడుదల చేశారు. దీంతో, ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ ఘటన నేపథ్యంలో స్థానికులు ఆ ప్రాంతంలో తిరిగేందుకు టెన్షన్ పడుతున్నారు. #Aligarh #DogMenance CCTV footage of the painful death of a person due to dog attack emerged. More than half a dozen #dogs attacked a person in the Aligarh Muslim University campus of Thana Civil Line area of Aligarh, which killed the person on the spot. pic.twitter.com/5XedupSu90 — Dr. Sandeep Seth (@sandipseth) April 16, 2023 -
మరో అందమైన మగ తోడు కనిపిస్తే భర్తకు విడాకులే..
న్యూఢిల్లీ: మనిషి జీవితంలో వివాహానికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. జీవితంలో ఏదో ఒక దశలో తోడు అవసరం అవుతుంది. ఇది గమనించే మనకు పెళ్లి, పిల్లలు, కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేశారు పెద్దలు. అయితే దురదృష్టం కొద్ది విడాకులు అనే సౌలభ్యాన్ని కూడా ఏర్చర్చుకున్నాడు మనిషి. విడాకులు అనేది ఇద్దరు వ్యక్తులనే కాక.. రెండు కుటుంబాలను తీవ్రంగా బాధపెడుతుంది. అయితే దంపతులు విడిపోవాలనుకోవడానికి ప్రధాన కారణం.. వారి మధ్య మూడో వ్యక్తి ప్రవేశించడం. పిల్లలు ఎదుగుతున్న సమయంలో దంపతులు విడాకులు తీసుకుంటే అది పిల్లల భవిష్యత్‌పై చాలా తీవ్ర పరిణామాలు చూపిస్తుంది. ఇప్పుడు ఈ విడాకులు ముచ్చట ఎందుకంటే మనుషుల మాదిరే పక్షుల్లో కూడా విడాకులు సంప్రదాయం ఉందట. జంట పక్షి నచ్చకపోయినా.. వేరే పక్షి అందంగా కనిపించినా.. వెంటనే భాగస్వామికి విడాకులు ఇచ్చేస్తాయట. అలానే తప్పుడు భాగస్వామిని ఎన్నుకున్నట్లు భావించినప్పుడు కూడా విడాకులు తీసుకుంటాయట. ఈ విషయాలను ఓ ప్రముఖ పరిశోధకుడు తెలిపారు. (చదవండి: విడాకులపై పూనమ్ సంచలన వ్యాఖ్యలు, కాసేపటికే ట్వీట్ డిలీట్) కొన్ని సంవత్సరాల క్రితం, అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయం (ఏఎంయూ)లోని వన్యప్రాణి విభాగానికి చెందిన ప్రొఫెసర్ హెచ్ఎస్ఎ యాహ్యా ఉర్దూలో ఒక పుస్తకాన్ని రాశారు. గార్డ్-ఓ-పెష్ అనే తన 11వ పుస్తకంలో, పక్షుల మధ్య సంబంధాల గురించి పరిశోధనా వాస్తవాలను ముందుకు తెచ్చాడు. దీని వెనుక ఆయన 4 దశాబ్దాల పరిశోధన ఉంది. ప్రొఫెసర్ యాహ్యా 40 ఏళ్లకు పైగా పక్షులపై పరిశోధనలు చేస్తున్నారు. ఈ పుస్తకంలో, ఆయన చాలా అసాధారణమైన వాస్తవాలను వెల్లడించారు. ప్రొ.యాహ్యా తన పరిశోధనల కోసం కాలిఫోర్నియా, స్కాట్లాండ్, సౌదీ అరేబియా తదితర అనేక దేశాలను సందర్శించారు. ముఖ్యంగా వార్బెట్ జాతుల పక్షులు, నార్కోండమ్ హార్న్ బిల్, ఖర్మోర్, తెల్ల రెక్కల బాతు మొదలైన వాటిపై ఆయన విస్తృత పరిశోధనలు చేశారు. (చదవండి: టెక్కీ దంపతులు.. 3 నెలలకే విడాకుల వరకు, ఎందుకిలా జరుగుతోంది?) ఈ పరిశోధనల అనంతరం ఆయన గుర్తించింది ఏంటంటే పక్షులు కూడా విడాకులు ఇస్తాయట. ప్రొఫెసర్ యాహ్యా పరిశోధన ప్రకారం, బయా పక్షులు అత్యధిక జంటలను ఏర్పరుస్తాయి. మగ పక్షి గూడు నిర్మాణం ప్రారంభించి.. అసంపూర్ణంగా వదిలివేస్తుంది. మిగిలిన గూడును జంటగా మారిన తర్వాత, మగ, ఆడ రెండూ కలిసి పూర్తి చేస్తాయి. రెండు కలిసి ఆ గూట్లో నివసిస్తాయి. (చదవండి: ఈ చెట్టు పిట్టలని చంపుతుంది.. కారణం తెలుసా!?) ఇక్కడ ఓ ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే.. ఆడ బయా పక్షికి.. తన సహచరుడి కంటే మెరుగైన మగతోడు దొరికినప్పుడు.. మొదటిదానిని వదిలి.. కొత్తగా దొరికిన తోడుతో వెళ్లిపోతుందట. ప్రొఫెసర్ యాహ్యా పరిశోధన ప్రకారం, పాలియాండ్రీ, అమెరికన్ మాకింగ్ బర్డ్స్ అనే జాతుల పక్షుల్లో ఆడ పక్షి.. ఒకదాని కంటే ఎక్కువ మగ పక్షులతో సంబంధం కలిగి ఉంటుందని తెలిపారు. బర్డ్ ఆఫ్ ప్యారడైజ్ జాతుల పక్షులు కూడా ఇలానే ప్రవర్తిస్తాయట. ఒకటి కంటే ఎక్కువ మంది భాగస్వాములతో సంబంధాల కారణంగా స్త్రీ, పురుషుల మధ్య విడాకులు ఎలా సంభవిస్తాయో.. పక్షుల్లో కూడా ఇదే కారణంగా విడాకులు సంభవిస్తాయని ప్రొఫెసర్ యాహ్య తెలిపారు. (చదవండి: 'ఫ్యామిలీ మ్యాన్' వెబ్‌సిరీస్ తర్వాత సమంత ఆ నిర్ణయం తీసుకుంది) అలానే పక్షులు తప్పుడు భాగస్వామిని ఎన్నుకున్నట్లు గ్రహించిన వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడాకులు తీసుకుంటాయట. ఆడ పక్షికి.. మరో మగ పక్షి మరితం ఆకర్షణీయంగా కనిపిస్తే.. తన పాత భాగస్వామిని వదిలివేస్తుందట. అదే సమయంలో, భాగస్వామి ప్రమాదంలో గాయపడితే విడాకులు తీసుకుంటాయట. పక్షులు బలహీనమైన సహచరులను ఇష్టపడరట. మనుషుల్లాగే అవి కూడా తమ జీవితానికి భద్రతను కోరుకుంటాయట. చదవండి: మాస్క్‌లు లేవు.. భౌతిక దూరం బాధే లేదు... -
మహిళ ఒత్తిడితో 24 ఏళ్ల యువకుడి ఆత్మహత్య
ఆగ్రా: ఉత్తర ప్రదేశ్‌లోని అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ (ఏఎంయూ) హాస్టల్లో 24 ఏళ్ల టీచర్ ఉరి వేసుకుని మరణించడం కలకలం రేపింది. బాధితుడు అలీగఢ్‌లోని ఏఎన్సీ కాలేజ్‌లో అధ్యాపకుడిగా పనిచేస్తున్న అభిషేక్ కుమార్ సక్సేనాగా పోలీసులు గుర్తించారు. సక్సేనా గురువారం హాస్టల్ గదిలోని సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. అభిషేక్ గత వారం రోజులుగా తన వసతి గృహాన్ని ఖాళీ చేసి హాస్టల్ గదిలో ఉంటున్నాడు. అయితే ఆగ్రాకు చెందిన ఓ మహిళ ఒత్తిడి కారణంగానే అభిషేక్ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాడని అతని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ‘అభిషేక్ ఆత్మహత్యకు పాల్పడే సమయంలో ఒక మహిళతో వీడియో కాల్ మాట్లాడుతున్నాడు. ఆమె నా సోదరుడిని బ్లాక్మెయిల్ చేసింది’ అని బాధితుడి సోదరుడు ఆరోపించారు. యూపీలోని ఫిలిబిత్ అభిషేక్ స్వస్ధలమని పోలీసులు తెలిపారు. సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్లో బాధితుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు చేయడంతో సెక్షన్ 306 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం దర్యాప్తు జరుగుతుందని సివిల్ లైన్స్ ఎస్హెచ్ఓ రవీంద్ర కుమార్ దుబే తెలిపారు. -
ఓఎల్ఎక్స్లో అమ్మకానికి మిగ్-23 విమానం
లక్నో: ఓఎల్ఎక్స్లో ఎవరైనా మొబైల్ ఫోన్లు, బైకులు, ఫర్నిచర్ అమ్మకానికి పెడతారు. కానీ ఓ ప్రబుద్ధుడు మాత్రం ఏకంగా అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో ఉన్న యుద్ధ విమానం మిగ్-23నే అమ్మకానికి పెట్టాడు. అది కూడా 9.99 కోట్ల రూపాయలకు. కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న ఈ విమానాన్ని అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయానికి 2009 లో భారత వైమానిక దళం (ఐఏఎఫ్) బహుమతిగా ఇచ్చింది. క్యాంపస్‌లో విద్యార్థుల పరిశోధనలకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఐఏఎఫ్ దీన్ని యూనివర్సిటీకి ఇచ్చింది. (అమ్మకానికి పటేల్ విగ్రహం..!) ఇంతటి చరిత్ర కలిగిన ఈ మిగ్-23 యుద్ధ విమానాన్ని ప్రస్తుతం ఓఎల్ఎక్స్లో అమ్మకానికి ఉంచడంతో సంచలనం రేపుతోంది. ఎవరో కావాలనే యూనివర్సిటీ ప్రతిష్టను దెబ్బ తీయడానికి విమానం ఫోటోను ఓఎల్ఎక్స్లో పెట్టారని సిబ్బంది తెలిపారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ ప్రొక్టార్ ప్రొఫెసర్ మహమ్మద్ వసీం అలీ మాట్లాడుతూ.. ‘మా యూనివర్సిటీకి చెందిన వారు ఎవరూ ఆ విమానాన్ని ఓఎల్ఎక్స్లో అమ్మకానికి పెట్టలేదు. ఇది ఎవరో ఆకతాయిలు చేసిన పని’ అని తెలిపారు. ఈ విషయంపై తాము విచారణ చేపట్టామని, ఈ పని ఎవరు చేశారో తెలుసుకుని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వసీం అలీ వెల్లడించారు. అంతేకాక సదరు విమానం ఫొటోను వెబ్సైట్ నుంచి తీసేశామని తెలిపారు. -
విద్యార్థులపై హింస: స్పందించిన సుప్రీం
న్యూఢిల్లీ: ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ, ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్ యూనివర్సిటీలో పోలీసులు విద్యార్థులపై దాడి చేసిన అంశంపై సుమోటోగా విచారణ చేపట్టాలన్న అభ్యర్థనపై సుప్రీంకోర్టు స్పందించింది. మొదట అల్లర్లు ఆగిపోయి.. శాంతి నెలకొల్పాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే స్పష్టం చేశారు. ఈ అంశంపై మంగళవారం వాదనలు వింటామని ఆయన స్పష్టం చేశారు. ‘మొదట అల్లర్లు ఆగాలని మేం కోరుకుంటున్నాం. అలర్లు ఎలా జరుగుతున్నాయో మాకు తెలుసు. ఇలాంటి వాతావరణంలో మేం ఎలాంటి నిర్ణయం తీసుకోలేం. ముందు ఇది ఆగాలి’ అని చీఫ్ జస్టిస్ పేర్కొన్నారు. వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల సందర్భంగా జామియా, అలీగఢ్ యూనివర్సిటీల్లో హింస చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ అంశాన్ని న్యాయవాదులు ఇందిరా జైసింగ్, కోలిన్ గోన్సాల్వే సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. రిటైర్డ్ న్యాయమూర్తులను ఆ రెండు యూనివర్సిటీలకు పంపి.. విద్యార్థులపై జరిగిన హింస పట్ల దర్యాప్తు జరిపి నిజానిజాలు వెలికితీయాలని కోరారు. ‘ఎందుకు ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు? బస్సులను తగులబెడుతున్నారు. శాంతియుత వాతావరణం నెలకొన్న తర్వాతే ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటాం. అల్లర్లు చేస్తున్నవారు వెంటనే వాటిని ఆపాలి’ అని జస్టిస్ బాబ్డే పేర్కొన్నారు. -
5 వేల మంది ఒకవైపు.. ఒక్కడు ఒకవైపు
-
5 వేల మంది ఒకవైపు.. ఒక్కడు ఒకవైపు
లక్నో : పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై దేశవ్యాప్తంగా నిరనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈశాన్య రాష్ట్రాలతోపాటు, పశ్చిమ బెంగాల్, ఢిల్లీలో కూడా నిరసనలు ఊపందుకున్నాయి. రెండు రోజుల క్రితం ఢిల్లీలోని జామియా యూనివర్సిటీలో విద్యార్థుల నిరసనలు ఉద్రిక్తంగా మారిన సంగతి తెలిసిందే. ఇక ఉత్తరప్రదేశ్‌లోని ప్రసిద్ధ అలీఘర్ ముస్లిం యూనివర్సిటీలో కూడా సీఏఏపై శుక్రవారం విద్యార్థులు ఆందోళనకు దిగారు. అయితే, జిల్లా ఎస్పీ ఆకాశ్ కుల్హరీ చాకచక్యంతో దాదాపు 5 వేల మంది పాల్గొన్న ఈ నిరసన కార్యక్రమం ప్రశాంతంగా ముగిసింది. యూనివర్సీటీ క్యాంపస్ నుంచి జిల్లా జడ్జి కార్యాయలం వరకు.. ర్యాలీగా వెళ్తేందుకు ప్లాన్ చేసుకున్న విద్యార్థులపై ఎస్పీ వ్యాఖ్యలు పనిచేశాయి. (చదవండి : ‘పౌరసత్వం’పై అపోహలు.. నిజాలు తెలుసుకోండి..!) ‘ప్రజస్వామ్యయుతంగా నిరసన తెలుపుకునే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. శాంతియుతంగా.. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపితే మీతో పాటు నేనూ ఉంటాను. కానీ, అతిగా ప్రవర్తించి.. మీ నిరసనలో జోక్యం చేసుకునే అవకాశం ఇతరులకు ఇవ్వొద్దు’ అని ఆకాశ్ మైక్‌లో చెప్పారు. ‘మీ వినతి జిల్లా న్యాయమూర్తికి చేరేలా నేను చూసుకుంటాను’అని హామినిచ్చాడు. దీంతో అక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదు. జిల్లా జడ్జికి వినతిని అందించిన విద్యార్థులు ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. ఇక నిముషంపాటు ఉన్న ఆకాశ్ స్పీచ్ వీడియోపై ప్రశంసలు కురుస్తున్నాయి. అసలైన పోలీసుకు అర్థం చెప్పావంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. (చదవండి : ‘అల్లర్లు ఆగకపోతే రాష్ట్రపతి పాలనే’) -
యోగికి ఝలక్: ఆయనను కలిసేందుకు మేం రాం!
లక్నో: జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ను రద్దు నేపథ్యంలో అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ (ఏఎంయూ)లో చదువుతున్న కశ్మీరీ విద్యార్థులకు చేరువయ్యేందుకు ప్రయత్నించిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌కు చుక్కెదురైంది. ఆర్టికల్ 370 రద్దుతో కశ్మీర్‌కు కలిగే ప్రయోజనాలను వివరిస్తాను.. తనతో ముఖాముఖి మాట్లాడేందుకు రావాలని యోగి పంపిన ఆహ్వానాన్ని కశ్మీర్ విద్యార్థులు నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. యోగి ఆహ్వానం రాజకీయ స్వభావంతో ఉందని, దీనిని అంగీకరించబోమని ఏఎంయూలో చదువుతున్న కశ్మీరీ విద్యార్థులు తేల్చిచెప్పారు. యోగితో సమావేశానికి వెళ్లరాదని కశ్మీరీ విద్యార్థులు ఏకగ్రీవంగా, మూకుమ్మడిగా నిర్ణయం తీసుకున్నారని, ఎవరైనా వెళ్లి సీఎంను కలిస్తే.. అది వారి వ్యక్తిగత అభీష్టంగా చూడాలి కానీ, కశ్మీరీ విద్యార్థుల అభిప్రాయంగా చూడరాదని ఓ కశ్మీరీ రీసెర్చ్ స్కాలర్ చెప్పారు. యోగి ఆహ్వానం పూర్తిగా రాజకీయ ప్రేరేపితమైనదని, ఆర్టికల్ 370 రద్దు తర్వాత కూడా కశ్మీర్లో సాధారణ పరిస్థితులు ఉన్నాయని, అందరూ ఆనందంగా ఉన్నారని ప్రపంచానికి చూపేందుకు ఇలాంటి జిమ్మిక్కులు చేస్తున్నారని మరో కశ్మీరీ విద్యార్థి పేర్కొన్నారు. -
అలీగఢ్ విద్యార్థులపై దేశద్రోహ కేసులు
అలీగఢ్: ఓ స్టూడెంట్ యూనియన్ అధ్యక్షుడు సహా 14 మంది విద్యార్థులపై దేశద్రోహం కేసు నమోదైన ఘటన అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో బుధవారం చోటుచేసుకుంది. యూనివర్సిటీలో జరగబోయే ఓ కార్యక్రమానికి హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీని ఆహ్వానించిన నేపథ్యంలో క్యాంపస్‌లో యుద్ధ వాతావరణం నెలకొంది. బీజేవైఎం కార్యకర్తలు వర్సిటీలో ఒవైసీ పర్యటనకు వ్యతిరేకంగా మంగళవారం నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఒవైసీ పర్యటనను నిషేధించాలని డిమాండ్ చేశారు. ఇటు వర్సిటీలో చిత్రీకరించడానికి వచ్చిన ఓ టీవీ చానెల్ సిబ్బందితో సైతం కొందరు విద్యా ర్థులు గొడవ పడ్డారని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే మంగళవారం రాత్రి బీజేవైఎంకు చెందిన ముఖేశ్ లోధి బైక్‌పై వస్తుండగా క్యాంపస్‌లో అడ్డగించి కొందరు పాకిస్తాన్ అనుకూల నినాదాలు చేస్తూ దాడికి పాల్పడినట్లు కేసు నమోదైంది. విద్యార్థి యూనియన్ అధ్యక్షుడు సల్మాన్ ఇంతియాజ్, ఉపాధ్యక్షుడు హుజైఫా అమీర్ సహా 14 మందిపై కేసులు నమోదయ్యాయి. -
ఆ వర్సిటీ తాలిబన్‌కు వత్తాసు..
లక్నో : యూపీ బీజేపీ ఎంపీ సతీష్ కుమార్ గౌతమ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ (ఏఎంయూ) తాలిబన్ సిద్ధాంతాల ప్రకారం నడుచుకుంటోందని దుయ్యబట్టారు. ఏఎంయూ క్యాంపస్‌లో జమ్ము కశ్మీర్ లేని భారత మ్యాప్‌ను చూపుతున్న పోస్టర్లు దర్శనమిచ్చిన నేపథ్యంలో బీజేపీ ఎంపీ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఏఎంయూ వైస్ చాన్సలర్‌కు ఈ మేరకు అలీగఢ్ ఎంపీ గౌతమ్ లేఖ రాశారు. భారత మ్యాప్‌లో జమ్ము కశ్మీర్, ఈశాన్య భారత్‌లో కొంత ప్రాంతం లేకుండా పోస్టర్లను వర్సిటీ క్యాంపస్‌లో ప్రదర్శించారని మీడియా ద్వారా తన దృష్టికి వచ్చిందని లేఖలో ఎంపీ పేర్కొన్నారు. ఏఎంయూలో దేశ వ్యతిరేక శక్తులు ఇటీవల పేట్రేగిపోతున్నాయన్నది వెల్లడవుతోందన్నారు. హతమైన హిజ్బుల్ ఉగ్రవాది మనన్ వనీ కోసం వర్సిటీలో ప్రార్థన సమావేశాలు జరిగినప్పుడే కఠిన చర్యలు చేపడితే ఇలాంటి చర్యలు జరిగిఉండేవి కావన్నారు. కాగా దేశ విభజనకు వ్యతిరేకంగా క్యాంపస్‌లో నిర్వహించ తలపెట్టిన డ్రామా కోసమే ఈ పోస్టర్లను డ్రామా సొసైటీ రూపొందించిందని ఏఎంయూ అధికారులు వివరణ ఇచ్చారు. -
కశ్మీర్ లేకుండా భారత చిత్రపటం
లక్నో : వివాదాలకు కేంద్ర బిందువుగా మారే ఉత్తరప్రదేశ్‌లోని అలీఘడ్ ముస్లిం యూనివర్సిటీ (ఎఎమ్‌యూ) మరోసారి వార్తల్లో నిలిచింది. విశ్వవిద్యాలయ విద్యార్థులు మంగళవారం భారత చిత్రపటాన్ని ఆవిష్కరించి.. గోడలపై అంటించారు. ఐతే వారు ఆవిష్కరించిన మ్యాప్‌లో కశ్మీర్ లేకపోవడం వివాదానికి దారితీసింది. వెంటనే మేలుకున్న యూనివర్సిటీ యాజమాన్యం వాల్‌పోస్టర్లను తొలగించింది. కొంత మంది విద్యార్థులు ఈచర్యకు పాల్పడ్డారని వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపింది. కాగా గత కొంతకాలం నుంచి ఎఎమ్‌యూ వివాదాస్పద చర్యలతో వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. పాకిస్తాన్ జాతిపిత మహ్మద్‌అలీ జిన్నా చిత్రాన్ని యూనివర్సిటీలో పెట్టడంతో గతంలో పెద్ద దుమారమే చెలరేగింది. -
ఆజాద్ వ్యాఖ్యలపై మండిపడ్డ బీజేపీ
న్యూఢిల్లీ: తనను ఎన్నికల ప్రచారానికి పిలిచే హిందువుల సంఖ్య తగ్గిపోయిందని కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ చేసిన వ్యాఖ్యలు వివాదస్పదంగా మారాయి. ఆయన చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ప్రతిపక్ష పార్టీ హిందువుల మనోభావాలను కించపరిచే విధంగా వ్యవహారిస్తుందని విమర్శించింది. బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర మాట్లాడుతూ.. ఆజాద్‌ను తక్కువ మంది ప్రచారానికి పిలువడానికి.. ఆయన హిందూ, ముస్లింలను వేరుగా చూడటమే కారణమని ఆరోపించారు. బీజేపీ అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీని ప్రతిష్టను దెబ్బతీసేవిధంగా ప్రయత్నిస్తుందనే ఆరోపణలను కూడా ఆయన ఖండించారు. కాగా, అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ వార్షికోత్సవంలో పాల్గొన్న ఆజాద్ మాట్లాడుతూ.. ‘ నేను యూత్ కాంగ్రెస్ నాయకునిగా ఉన్నప్పటి నుంచి దేశవ్యాప్తంగా వివిధ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేశాను. గతంలో నన్ను 95 శాతం హిందూ సోదరులు, 5శాతం ముస్లిం సోదరులు ప్రచారానికి పిలిచేవారు. కానీ గత నాలుగేళ్లలో నన్ను ప్రచారానికి పిలిచే హిందూ సోదరుల సంఖ్య 20 శాతం పడిపోయింది. నేను వారి తరఫున ప్రచారం చేస్తే ఓట్లు రావాని వారు భయపడుతున్నారు. అందుకే నన్ను పిలవడానికి ఇష్టపడటంలేద’ని అన్నారు. అదేవిధంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై కూడా ఆజాద్ పలు విమర్శలు చేశారు. -
వర్సిటీ విద్యార్థులపై రాజ్యద్రోహం కేసు
లక్నో : ఉత్తర ప్రదేశ్‌లోని అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ (ఎఎమ్‌యూ) రాజ్యద్రోహం ఆరోపణలతో మరోసారి వార్తల్లో నిలిచింది. కశ్మీర్లో ఇటీవల ఎన్కౌంటర్లో హతమైన నిషేధిత ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిదీన్ సభ్యుడు బషీర్ వనీకి మద్దతుగా వర్సిటీ విద్యార్థులు సభ ఏర్పాటుకు ప్రయత్నించారు. దీనిలో కీలమైన విద్యార్ధులు వసీం యాకుబ్ మాలిక్, అబ్దుల్ మీర్‌లపై యూపీ పోలీసులు ఐపీసీ సెక్షన్ 124(ఎ) ప్రకారం రాజ్యద్రోహం కేసు నమోదు చేశారు. కశ్మీర్లో ఉగ్రవాద కర్యాకలపాలకు పాల్పడుతున్న వనీని ఇటీవల భద్రత ధళాలు మట్టుపెట్టిన విషయం తెలిసిందే. వనీ మృతికి నివాళిగా అతని మద్దతు దారులు కొంతమంది వర్సిటీలో సమావేశం నిర్వహించి.. దేశ సమగ్రతను దెబ్బతినే విధంగా నినాదాలు చేశారని పోలీసులు తెలిపారు. వనీ ఎన్కౌంటర్ తరువాత కొంత మంది కశ్మీరి యువకులు ఆయనకు మద్దతుగా సభ నిర్వహించాలని ప్రయత్నం చేశారని.. వారికి వర్సిటీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు యాజమాన్యం తెలిపింది. విద్యార్థులపై రాజ్యద్రోహం కేసు పెట్టడంపై వర్సిటీ విద్యార్థి సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. తమకున్న వాక్ స్వాతంత్ర్యన్ని ప్రభుత్వాలు హరిస్తున్నాయని విద్యార్థి సంఘం నేత ఫజీల్ హుస్సెన్ పేర్కొన్నారు. పీహెచ్డీ వద్దని మిలిటెన్సీలోకి.. 2016లో బుర్హాన్ వనీ హతమైన తరువాత మిలిటెన్సీ వైపు ఆకర్షితులైన విద్యావంతుల్లో బషీర్ వనీ ఒకడు. ముందునుంచి చదువుల్లో చురుకుగా ఉన్న బషీర్ వనీ ప్రతిష్టాత్మక సైనిక్ స్కూల్లో 11, 12వ తరగతులు పూర్తిచేశాడు. మెరిట్ విద్యార్థిగా పాఠశాల, కళాశాల రోజుల్లో ఎన్నో అవార్డులు గెలుచుకున్నాడు. ఎన్సీసీ క్యాడెట్‌గా పంద్రాగస్టు, రిపబ్లిక్ డే కవాతుల్లో కూడా పాల్గొన్నాడు. 2010, 2016లో కశ్మీర్ లోయలో చెలరేగిన తీవ్ర నిరసనల వైపు కన్నెత్తి కూడా చూడలేదు. అలాంటి వాడు, అలీగఢ్ యూనిర్సిటీలో పీహెచ్డీ చదువుతుండగా 2017 చివరన దక్షిణ కశ్మీర్‌కు చెందిన కొందరు విద్యార్థులతో ఏర్పడిన పరిచయంతో మిలిటెన్సీలో చేరాడు. ఈ ఏడాది జనవరి 3న అలీగఢ్ వర్సిటీని వదిలి వెళ్లాడు. అతని పేరు ఇప్పటికీ వర్సిటీ అధికారిక వెబ్సైట్లో కనిపిస్తోంది. భూగర్భశాస్త్రంలో పీహెచ్డీ చదువుతున్న వనీకి భోపాల్‌లో జరిగిన అంతర్జాతీయ సదస్సులో ‘బెస్ట్ పేపర్ ప్రజెంటేషన్’ అవార్డు కూడా దక్కింది. హిజ్బుల్ టాప్ కమాండర్ వనీ హతం -
కేంద్రానికి షాకిచ్చిన అలీఘడ్ యూనివర్సిటీ..!
లక్నో: దేశంలోని అన్ని ఉన్నత విద్యా సంస్థల్లో సెప్టెంబర్ 29వ తేదీన ‘సర్జికల్ దాడుల దినోత్సవం’ను జరపాల్సిందిగా ఆదేశిస్తూ ‘యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్’ తాజాగా జారీ చేసిన సర్కులర్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై యూపీలో అలీఘడ్ ముస్లిం యూనివర్సిటీ (ఎఎమ్‌యూ) విద్యార్థులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. సర్జికల్ దాడుల దినోత్సవంను తాము వ్యతిరేకిస్తున్నామని ఎమ్‌యూ విద్యార్థి సంఘం అధ్యక్షుడు మషుష్కర్ అహ్మద్ ఉస్మానీ తెలిపారు. భారత సైన్యం దాడులు చేయడం ఇదే తొలిసారి కాదని... ఇంతకు ముందు కూడా అనేక సందర్భల్లో దాడులు నిర్వహించారని ఆయన వ్యాఖ్యానించారు. గతంలో ప్రభుత్వాలు ఇలా ఎప్పుడు ప్రచారం చేసుకోలేదని ఆయన పేర్కోన్నారు. దేశభక్తిని చాటిచెప్పేందుకు ప్రతీ ఏడాది ఆగస్ట్ 15న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని.. ఇప్పుడు ఈ దినోత్సవాలు ఎందుకని ఉస్మానీ ప్రశ్నించారు. బీజేపీ ప్రభుత్వం సర్జికల్ దాడుల దినోత్సవం జరుపుకోవాలి అనుకుంటే, ఆర్ఎస్ఎస్ కార్యాలయాల్లో నిరభ్యంతరంగా జరుపుకోవచ్చని అన్నారు. కాగా యూనివర్శిటీలతో ఎలాంటి సంప్రతింపులు లేకుండానే యూజీసీ ఏకపక్షంగా జారీ చేసిన ఈ సర్కులర్‌ను విద్యార్థులు, అధ్యాపకులు పలువురు తప్పుపడుతున్నారు. -
అరుదైన సర్జరీ.. 7 నెలల చిన్నారికి పునర్జన్మ
లక్నో: అలిఘర్ ముస్లిం యూనివర్సిటీ జవహార్‌లాల్ నెహ్రూ మెడికల్ కాలేజీ(జేఎన్ఎమ్సీ) వైద్యులు అరుదైన సర్జరీతో ఓ పసికందు ప్రాణాలు నిలబెట్టారు. అత్యంత సంక్లిష్టమైన ఆపరేషన్‌ను నాలుగు గంటలపాటు శ్రమించి విజయవంతంగా పూర్తి చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని అలిఘర్‌కు చెందిన సల్మాన్ కూతురు మెహిరా అనే 7 నెలల చిన్నారి పుట్టుకతోనే గుండెసంబంధిత వ్యాధితో బాధపడుతోంది. వారు జేఎన్ఎమ్సీని ఆశ్రయించగా.. వైద్యులు ఆచిన్నారికి పునర్జన్మను ప్రసాదించారు. ఆ పసికందు కడుపులో ఉన్నప్పుడే గుండెకు సంబంధించిన గదులు నిర్మితం కాలేదని, పైగా ఆ గుండెకు రంధ్రం కూడా పడిందని డాక్టర్లు పేర్కొన్నారు. దీంతో ఆమె రక్తం కలుషితమై నీలి రంగులోకి మారిందని, శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బంది కలిగిందని తెలిపారు. ఆపరేషన్‌తో ఆ చిన్నారి రక్తం తల నుంచి మెడ, చేతుల ద్వారా ఊపిరితిత్తులకు చేరేలా చేశామన్నారు. ప్రస్తుతం ఆ చిన్నారి కోలుకుందని, డిశ్చార్జ్కూడా చేసినట్లు పేర్కొన్నారు. భవిష్యత్తులో ఎలాంటి సమస్య లేకుండా ఆరోగ్యమైన జీవితాన్ని గడపవచ్చన్నారు. ఈ ఆపరేషన్ రాష్ట్రీయ బాల్ స్వస్త్యా కార్యక్రమం(ఆర్బీఎస్కే) ద్వారా ఉచితంగా నిర్వహించినట్లు తెలిపారు. జేఎన్ఎమ్సీలో ఇప్పటి వరకు గుండెకు సంబంధించిన శస్త్రశికిత్సలు చాలా చేశామని డాక్టర్ అజమ్ హసన్ మీడియాకు వివరించారు. సుమారు 80 మంది పిల్లలకు ఆర్బీఎస్కే ద్వారా ఉచితంగా సర్జరీలు చేసి ప్రాణాలు కాపాడినట్లు పేర్కొన్నారు. -
రోజుకు 150 సార్లు సెల్‌ఫోన్‌ను..
లక్నో: నేటి ప్రపంచంలో సెల్‌ఫోన్ ఓ అవసరంగా కాదు.. వ్యసనంలా మారింది. ఒక పూట తిండిలేకపోయినా ఉండగలరేమో గాని సెల్‌ఫోన్ వాడకుండా ఉండలేకపోతున్నారు. ఇక యుక్త వయస్సులో ఉన్న వాళ్లు ఫోన్‌కు బానిసలయ్యారని చెప్పొచ్చు. ఇదే విషయాన్ని కొన్ని సర్వేలు కూడా తేల్చిచెబుతున్నాయి. భారతదేశంలోని కాలేజీ విద్యార్థులు ప్రతిరోజూ కనీసం 150 సార్లు సెల్‌ఫోన్‌ను వాడుతున్నారని పరిశోధకులు తేల్చారు. అలీగఢ్ ముస్లిం యూనివర్శిటీ, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ రీసెర్చ్ నిర్వహించిన సర్వేలో ఈ విషయం తేటతెల్లమైంది. ‘‘స్మార్ట్ ఫోన్ డిపెండెన్సీ, హెడోనిజమ్ అండ్ పర్చేజ్ బిహేవియర్ : ఇంప్లికేషన్ ఫర్ డిజిటల్ ఇండియా ఇన్సియేటివ్ ’’ పేరిట ఈ సర్వేను నిర్వహించారు. దాదాపు 20 యూనివర్శిటీలకు చెందిన 200 మందిని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఇందులో 26 శాతం మంది ఇతరులతో మాట్లాడుకోవడానికి మాత్రమే సెల్‌ఫోన్ ఉపమోగిస్తామని తెలిపారు. మిగిలిన వారు రోజుకు కనీసం 150 సార్లు సెల్ వాడుతున్నారని తేలింది. సెల్‌ఫోన్ అతిగా వాడటం వల్ల అది వారి ఆరోగ్యం, చదువులపై ప్రభావం చూపింది. 2017 సంవత్సరంలో నిర్వహించిన సర్వేలో 63 శాతం మంది ఒక రోజులో 7 గంటలు సెల్‌ఫోన్ వాడుతున్నారని, 23శాతం మంది కనీసం 8 గంటల సేపు ఫోన్ వాడుతున్నట్లు తేలింది. సెల్‌ఫోన్ ఒక అవసరంగా ఉన్నంత వరకు ఎటువంటి ఢోకా లేదని వ్యసనంలా మారితే భారీ నష్టం తప్పదని మేధావులు హెచ్చరిస్తున్నారు. -
మోదీకి అలీగఢ్ యూనివర్సిటీ విద్యార్థుల లేఖ
లక్నో: అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో మహ్మద్ అలీ జిన్నా చిత్రపటాన్ని తొలగించాలని ఘర్షణలకు పాల్పడ్డ హిందుత్వ కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలని యూనివర్సిటీ విద్యార్థులు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. గత కొన్ని రోజులుగా ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో పాకిస్తాన్ వ్యవస్థాపకుడు మహ్మద్‌అలీ జిన్నా ఫొటోపై వివాదం రేగుతున్న విషయం తెలిసిందే. ఆర్ఎస్ఎస్, బీజేపీ కార్యకర్తలు యూనివర్సిటీలో జిన్నా చిత్రపటానికి వ్యతిరేకంగా దాడులకు పాల్పడ్డారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. దాడులకు పాల్పడుతూ, చారిత్రాత్మక యూనివర్సిటీ ఖ్యాతిని పోగొడుతున్న హిందుత్వ కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీ, యూపీ సీఎం ఆదిత్యానాథ్, మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్‌కి విద్యార్థులు శుక్రవారం లేఖ రాశారు. ప్రతిష్టాత్మక యూనివర్సిటీ వాతావరణాన్ని చెడగొడుతున్న హిందూత్వ కార్యకర్తల మీద చర్యలు తీసుకోవాలని యూనైటేడ్ అరబ్ ఏమిరేట్స్‌లో(యూఏఈ) అల్యూమ్ని ఫోరమ్ తరఫున కూడా భారత కాన్సూలేటర్కి లేఖ రాశారు. యోగా గురువు రాందేవ్ బాబా జిన్నాకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారన్న విషయాన్ని కూడా వారు లేఖలో పేర్కొన్నారు. జిన్నా పాకిస్తానీయులకు గొప్పవాడే, కానీ భారతీయులు అతన్ని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం లేదని రాందేవ్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. -
జిన్నా మహాపురుషుడు: బీజేపీ ఎంపీ
లక్నో : అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ (ఏఎంయూ)లో పాకిస్తాన్ వ్యవస్థాపకుడు మహమ్మద్ అలీ జిన్నా చిత్రపటంపై వివాదం చల్లారకముందే బీజేపీ ఎంపీ సావిత్రిబాయి పూలే మరో వివాదానికి తెర లేపారు. జిన్నాను మహాపురుషుడిగా (గొప్ప వ్యక్తి) కీర్తించి కలకలం రేపారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహా పురుషుడని జిన్నాను పొగిడారు. సావిత్రి బాయి గత కొన్ని రోజులుగా బీజేపీ విధానాలను వ్యతిరేకిస్తూ సొంత పార్టీకి తలనొప్పిగా మారారు. తాజాగా అలీగఢ్ విశ్వవిద్యాలయంలో జిన్నా ఫొటో వివాదానికి ఆజ్యం పోశారు. జిన్నా గురించి మాట్లాడుతూ... ‘భారత స్వాతంత్ర్య పోరాటంలో జిన్నా ఎనలేని కృషి చేశారు. ఆయన మహాపురుషుడు, మనం ఆయన త్యాగాన్ని మరవకూడదు’ అంటూ పొగిడి బీజేపీని ఇరుకున పెట్టారు. అంతేకాక తాజాగా రాష్ట్రంలో, కేంద్రంలో బీజేపీ నిర్వహిస్తున్న ‘దళితల ఇళ్ల సందర్శన’ కార్యక్రమంపై విమర్శలు గుప్పించారు. రాజకీయ నాయకులు దళితుల ఇళ్లకు వెళ్లడమంటే వారిని తీవ్రంగా అవమానించడమే అవుతుందని వ్యాఖ్యానించారు. ఏఎంయూలో జిన్నా చిత్రపటాన్ని ఎందుకు ఉంచారో వివరణ ఇవ్వాలని స్థానిక బీజేపీ ఎంపీ సతీశ్ గౌతమ్.. వర్సిటీ వైస్ చాన్స్‌లర్ (వీసీ) తారిఖ్ మన్సూర్‌కు లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ విషయం గురించి ఏఎంయూ అధికార ప్రతినిధి షఫీ కిద్వాయ్ మీడియాకు వివరణ ఇచ్చారు. ‘జిన్నా ఏఎంయూ వ్యవస్థాపక సభ్యుడు. వర్సిటీకి విరాళం ఇచ్చారు. అంతేకాదు పాకిస్తాన్ కోసం డిమాండ్ చేయకముందే వర్సిటీ ఏర్పాటుకు కృషి చేశారు. 1938లో వర్సిటీ విద్యార్థి సంఘం జీవిత కాల సభ్యత్వం పొందారు. అలా సభ్యత్వం పొందినవారి చిత్రపటాలు యూనియన్ కార్యాలయంలో ఉంచడం సంప్రదాయంగా వస్తోంది. ఆ చిత్రపటాలు ఉమ్మడి భారతదేశ వారసత్వ సంపద’ అన్నారు. -
జిన్నా ఫొటో అంత ముఖ్యమా!: రాందేవ్
పట్నా: అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ(ఏఎంయూ)లో వివాదంగా మారిన మహ్మద్ అలీ జిన్నా చిత్రపటంపై ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా స్పందించారు. ముస్లింలు చిత్ర పటాలకు, విగ్రహాలకు ప్రాధాన్యత ఇవ్వరని, కానీ జిన్నా ఫొటోకు అంత ప్రాధాన్యత ఎందుకు ఇస్తున్నారంటూ ఆయన ప్రశ్నించారు. బిహార్‌లోని ప్రతిష్టాత్మక నలందాలో ఏర్పాటు చేసిన యోగా కార్యక్రమంలో రాందేవ్ పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం రాందేవ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘పాకిస్తాన్ వ్యవస్థాపకుడు మహ్మద్ అలీ జిన్నా వారి దేశానికి గొప్పవ్యక్తి కావచ్చు. భారతదేశ ఐక్యత, సమగ్రతను నమ్మేవారు జిన్నాను ఆదర్శ వ్యక్తిగా భావించకూడదు. ముస్లిం మతస్తులు విగ్రహాలకు, చిత్రపటాలకు ప్రాధాన్యత ఇవ్వరు. అందులో భాగంగానే జిన్నా చిత్రపటానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదని’ పేర్కొన్నారు. కాగా మే 3న యూనివర్సిటీ విద్యార్థులకు, హిందూత్వ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణలో 28 మంది విద్యార్థులు గాయపడిన విషయం తెలిసిందే. -
అనవసర వివాదం
ఒక చిత్రపటం చుట్టూ అల్లుకున్న వివాదం ఇప్పుడు ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ(ఏఎంయూ)ని అట్టుడికిస్తోంది. సరిగ్గా ఏడు దశాబ్దాలక్రితం మరణించిన పాకిస్తాన్ జాతిపిత మహమ్మదాలీ జిన్నా చిత్రపటం ఆ యూనివర్సిటీ విద్యార్థి సంఘం కార్యాలయంలో ఉండొచ్చా లేదా అనే అంశంపై ఈ వివాదం రేకె త్తింది. ఆయన చిత్రపటంపై విద్యార్థుల్లో విభేదాలు తలెత్తితే అర్ధం చేసుకోవచ్చు. దాన్ని చక్కదిద్దడానికి యూనివర్సిటీ అధికారులు తమ వంతు ప్రయత్నం చేస్తారు. హద్దులుదాటి ప్రవర్తించిన విద్యార్థులపై చర్యలు తీసుకుంటారు. కానీ జిన్నా చిత్రపటంపై అభ్యంతరం లేవనెత్తినవారు స్థానిక బీజేపీ ఎంపీ సతీష్ గౌతమ్. దేశ విభజనకు కారకుడైన వ్యక్తి చిత్రపటం ఈ విశ్వవిద్యాలయంలో ఎలా ఉంచుతా రంటూ వైస్ చాన్సలర్‌కు ఆయనొక లేఖ రాశారు. తక్షణం తొలగించాలంటూ డిమాండ్ చేశారు. అలా లేఖ రాసిన మూడు రోజులకు హిందూ యువవాహిని కార్యకర్తలు ప్రాంగణంలోకి చొరబడ్డారు. వారిని విద్యార్థులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఘర్షణ వాతావరణం ఏర్పడి పోలీసులు లాఠీచార్జి, రబ్బర్ బుల్లెట్లు ప్రయోగించారు. 1875లో ఒక కళాశాలగా ప్రారంభమై, 1920 కల్లా విశ్వవిద్యాల యంగా మారిన ఏఎంయూకి పరిష్కరించుకోవాల్సిన సమస్యలు చాలా ఉన్నాయి. ఇతర విశ్వవిద్యాలయాల తరహాలోనే అది కూడా మనుగడ కోసం, ఉన్నత ప్రమా ణాలను అందుకోవడం కోసం ఎన్నో అవరోధాలను అధిగమించాల్సి ఉంది. అన్ని విశ్వవిద్యాలయాలూ ఎదుర్కొంటున్న అధ్యాపకుల కొరత ఏఎంయూకి కూడా ఉంది. ఇవి చాలవన్నట్టు మైనారిటీ విద్యా సంస్థ ప్రతిపత్తిని కోల్పోవడంతో రెండేళ్ల నుంచి దానికి ఆర్థిక ఇబ్బందులు కూడా మొదలయ్యాయి. ప్రాంగణంలో కట్టుబాట్ల పేరుతో అమలయ్యే ఆంక్షలు ఆమధ్య పెను వివాదాన్ని తెచ్చాయి. అక్కడ మంచి గ్రంథాలయం ఉన్నా విద్యార్థినులకు అందులో ప్రవేశం ఉండేది కాదు. దశాబ్దాల నుంచి అమలవుతున్న ఈ వివక్షపై 2014లో విద్యార్థినులు తిరగబడ్డారు. అమ్మా యిల్ని అనుమతిస్తే అక్కడికొచ్చే అబ్బాయిల సంఖ్య నాలుగు రెట్లు పెరుగుతుం దని, దాంతో చోటు సమస్య తలెత్తుతుందని, ‘క్రమశిక్షణ’ దెబ్బతింటుందని వైస్ చాన్సలర్ చేసిన ప్రకటన అందరినీ దిగ్భ్రమపరిచింది. లింగ వివక్ష పాటించడం తగదని అలహాబాద్ హైకోర్టు చీవాట్లు పెట్టడంతో అధికారులు దారి కొచ్చారు. ఇలా విద్యా సంబంధ విషయాలపై, అధ్యాపకుల కొరతపై, సదు పాయాల లేమిపై ఆందోళనలు తలెత్తితే అర్థం చేసుకోవచ్చు. కానీ ఎన్నడో 1938లో పెట్టిన జిన్నా చిత్రపటం ఇప్పుడు వివాదానికి కేంద్ర బిందువు కావడం ఆశ్చర్యం కలిగిస్తుంది. జిన్నాపై బీజేపీకి ఉన్న ఏవగింపులో దాపరికమేమీ లేదు. కానీ ఆ విషయంలో ఆ పార్టీ కీలక నేతలే గతంలో తీవ్రంగా విభేదించారు. 2005లో బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న ఎల్ కే అద్వానీ పాకిస్తాన్ సందర్శించి జిన్నా సమాధి వద్ద నివాళులర్పించ డంతోపాటు ఆయన్ను సెక్యులర్ నేతగా కొనియాడారు. చరిత్రపై చెరగని ముద్ర వేసిన అరుదైన నేతల్లో ఆయనొకరని కీర్తించారు. ఆ తర్వాత కొన్నాళ్లకు అద్వానీ పార్టీ అధ్యక్ష పదవి పోయింది. అయితే 2009లో ప్రధాని అభ్యర్థిగా ఆయన్ను నిర్ణ యించడానికి, 2014లో ఎంపీగా అవకాశమివ్వడానికి ఆ వ్యాఖ్యలు అడ్డురాలేదు. మరో సీనియర్ నేత జశ్వంత్ సింగ్ కూడా జిన్నాను కీర్తించారు. కాంగ్రెస్, నెహ్రూలు ఆయన్నొక భూతంగా చూపారని 2009లో వెలువరించిన గ్రంథంలో ఆరోపిం చారు. జశ్వంత్‌ను వెనువెంటనే పార్టీ నుంచి బయటకు పంపేసినా, మరో ఏడాదికి తిరిగి చేర్చుకున్నారు. 2012లో ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేశారు. 2014 వరకూ పార్టీ ఎంపీగా ఉన్నారు. ఇప్పుడు వివాదం రేకెత్తడానికి కారకుడైన బీజేపీ ఎంపీ సతీష్ గౌతమ్ తీరును ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కేబినెట్లోని మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య ప్రశ్నించారు. జిన్నా మహోన్నతుడని ప్రశంసిం చారు. తమ పార్టీ నేతల్లోనే ఇలా వేర్వేరు అభిప్రాయాలు పెట్టుకుని విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం కార్యాలయం మాత్రం జిన్నా చిత్రపటం పెట్టుకోరాదని ఎంపీ హుకుం జారీ చేయడం, దాన్ని అమలు చేయలేదని బయటి వ్యక్తులను దాడికి పంపడం ఆశ్చర్యకరం. జిన్నా మితవాద రాజకీయాలతో, దేశ విభజనకు కార ణమైన ఆయన సిద్ధాంతంతో ఎవరూ ఏకీభవించరు. అంతమాత్రాన స్వాతంత్య్ర సమరంలో, కాంగ్రెస్‌లో ఆయన పాత్రను విస్మరించలేం. ఆ సమరంలో పాలుపం చుకున్న నేతలు, ప్రముఖులు విశ్వవిద్యాలయాన్ని సందర్శించినప్పుడు విద్యార్థి సంఘంలో వారికి జీవితకాల సభ్యత్వాన్నిచ్చి, వారి చిత్రపటాన్ని కార్యాలయంలో ఉంచడం ఆనవాయితీ. అలా 1938లో జిన్నా చిత్రపటం అక్కడ చేరింది. సరోజినీ నాయుడు, రాజగోపాలాచారి, డాక్టర్ సీవీ రామన్, బ్రిటన్ రచయిత ఈ ఎమ్ ఫార స్టర్ తదితరుల చిత్రపటాలు కూడా అక్కడున్నాయి. పైగా 1938 నాటికి జిన్నా దేశ విభజన కోరలేదు. రెండు దేశాలుగా విడిపోయి ఉండొచ్చుగానీ మన చరిత్రతో, సంప్రదాయంతో ముడిపడ్డ అనేక ప్రదేశాలు పాకిస్తాన్లో ఉన్నాయి. అక్కడి తక్షశిలలోనే చాణక్యుడు అర్థశాస్త్రాన్ని రాశాడు. సంస్కృత వ్యాకరణకర్త పాణిని తన ప్రస్థానాన్ని ప్రారం భించింది తక్షశిలలోనే. ఆయుర్వేదానికి ఆద్యుడనదగ్గ చరకుడు అక్కడి వాడే. మహాభారతంలో ప్రస్తావనకొచ్చే ప్రదేశాలు, బౌద్ధానికి సంబంధించిన అనేక చారి త్రక విశేషాలు పాక్‌లో ఉన్నాయి. విప్లవవీరుడు భగత్‌సింగ్ భారత్, పాకిస్తాన్ల ఉమ్మడి హీరో అని పాక్‌లోని పంజాబ్ ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. చరిత్ర మనం కోరుకున్నటు ఉండదు. అందులో మంచిని స్వీకరించి, విషాదకర ఘట్టాల నుంచి గుణపాఠాలు నేర్చుకుని మున్ముందుకెళ్లడమే మనం చేయగలిగే పని. జిన్నాపై మనకెలాంటి అభిప్రాయాలున్నా ఆయనలోని అనుకూలాంశాలు, ప్రతికూ లాంశాలు చర్చించుకోగలం తప్ప వాటిని తుడిచేయడం సాధ్యపడదు. విశ్వవిద్యాల యాలకు, ప్రత్యేకించి ఏఎంయూకు ఎన్నో సమస్యలుండగా పాలకపక్షంగా వాటిని పరిష్కరించే ప్రయత్నం చేయడానికి బదులు అనవసర వివాదాలను రేకెత్తించడం బీజేపీకి తగని పని. -
కర్ణాటక ఎన్నికల కోసమే ఆ దాడి చేశారా?
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్ ముస్లిం యూనివర్శిటీ గత రెండు రోజులుగా ఆందోళనలతో అట్టుడికి పోతోంది. మాజీ ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీకి యూనివర్శిటీ విద్యార్థుల సంఘం శాశ్వత సభ్యత్వం బహూకరించేందుకు బుధవారం సన్నాహాలు జరుగుతుండగా హఠాత్తుగా హిందూ యువ వాహిణికి చెందిన కార్యకర్తలు కర్రలు, పిస్టళ్లు పట్టుకొని యూనివర్శిటీలోకి వచ్చి నానా బీభత్సం సష్టించారు. వారు ఆ సమయంలో మాజీ ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ బస చేసిన యూనివర్శిటీ భవనంలోని గేటును ధ్వంసం చేశారు. లోపలకి జొరబడేందుకు ప్రయత్నించారు. వారిలో హిందూ యువ వాహిణికి చెందిన ఆరుగురు కార్యకర్తలు యూనివర్శిటీ భద్రతా సిబ్బంది పట్టుకొని అక్కడ ఉన్న పోలీసులకు అప్పగించారు. యూనివర్శిటీపై దాడి చేసిన ఆరుగురు గూండాలను యూనివర్శిటీ భద్రతా సిబ్బంది పోలీసులకు అప్పగిస్తే మరుసటి రోజుకల్లా వారిని పోలీసులు ఎలాంటి కేసును కూడా నమోదు చేయకుండా విడిచిపెట్టారని యూనివర్శిటీ అధికార ప్రతినిధి ఎం. షఫే కిద్వాయ్ గురువారం నాడు మీడియాకు తెలియజేశారు. పిస్టళ్లలాంటి మారణాయుధాలను కూడా వారు పట్టుకొచ్చారని చెప్పారు. అన్సారీ కార్యక్రమానికి బందోబస్తుగా యూనివర్శిటీలోకి పోలీసులు వచ్చారు. ఉత్తరప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ 2002లో ఏర్పాటు చేసిన హిందు యువ వాహిణికి చెందిన వారు నిందితులు కనుక పోలీసులు వారిని వదిలేశారని, కేసు పెట్టే ధైర్యం పోలీసులు చేయలేకపోయారని సులభంగానే అర్థం చేసుకోవచ్చు. ఇదే విషయమై ఫిర్యాదు చేయడానికి యూనివర్శిటీ విద్యార్థులు ఊరేగింపుగా పోలీసు స్టేషన్‌కు వెళ్లగా వారిపై పోలీసులు తీవ్రంగా లాఠీచార్జి చేసి పంపించారని కిద్వాయ్ ఆరోపించారు. ఆలీగఢ్ ముస్లిం యూనివర్శిటీలో ఆరెస్సెస్ శాఖను ఏర్పాటు చేయాలని కొంతకాలంగా ఆరెస్సెస్ డిమాండ్ చేస్తుండగా, యూనివర్శిటీ విద్యార్థి సంఘం కార్యాలయంలో ఉన్న మొహమ్మద్ అలీ జిన్నా ఫొటోను ఎత్తివేయాలని స్థానిక బీజేపీ ఎంపీ పిలుపుతో సంఘ్ పరివార్ డిమాండ్ చేస్తోంది. ఆ ఫొటోను తొలగించడం కోసమే బుధవారం నాడు యూనివర్శిటీ క్యాంపస్‌లోకి జొరబడినట్లు హిందూ యువ వాహిణి కార్యకర్తలు తెలిపారు. విద్యార్థి సంఘం కార్యాలయంలో జిన్నా ఫొటోతోపాటు జాతిపిత మహాత్మాగాంధీ, జవహర్లాల్ నెహ్రూ, మౌలానా అబ్దుల్ కలామ్ ఆజాద్‌ల ఫొటోలు ఉన్నాయి. వారంతా బ్రిటీష్ పాలకులకు వ్యతిరేకంగా దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన యోధులే. అవిభక్త భారత చరిత్రలో జిన్నాకు కూడా ఎంతో పాత్ర ఉంది. ఆ పాత్రను ఎవరూ కాదనలేరు. గతంలో ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా, జవహర్లాల్ నెహ్రూ యూనివర్శిటీ, హైదరాబాద్‌లోని సెంట్రల్ యూనివర్శిటీలపై దాడి చేసిన మతతత్వ హిందూ శక్తులు ఇప్పుడు అలీగఢ్ యూనివర్శిటీపై దాడి చేశాయి. ఏఎంయూలోని మొహమ్మద్ అలీ జిన్నా ఫొటోపై 80 ఏళ్లుగా ఎలాంటి గొడవ చేయని సంఘ్ పరివారం ఇప్పుడే ఎందుకు గొడవ చేయాల్సి వచ్చిందన్నది కోటి రూకల ప్రశ్నే. అయితే కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో సులభంగానే సమాధానం దొరకుతుంది. -
జిన్నా ఫొటోపై వివాదం
అలీగఢ్ (యూపీ): అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ (ఏఎంయూ)లో పాకిస్తాన్ వ్యవస్థాపకుడు మహమ్మద్ అలీ జిన్నా చిత్రపటం ఉండటంపై వివాదం చెలరేగుతోంది. వర్సిటీలో జిన్నా చిత్రపటాన్ని ఎందుకు ఉంచారో వివరణ ఇవ్వాలని స్థానిక బీజేపీ ఎంపీ సతీశ్ గౌతమ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన వర్సిటీ వైస్ చాన్స్‌లర్ (వీసీ) తారిఖ్ మన్సూర్‌కు లేఖ రాశారు. వారం కిందట ఏఎంయూలో ఆరెస్సెస్ శాఖ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని ఓ విద్యార్థి కోరగా.. వీసీ అందుకు అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో ఏఎంయూ స్టూడెంట్ యూనియన్ కార్యాలయంలో ఉన్న జిన్నా చిత్రపటంపై సతీశ్ గౌతమ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై ఏఎంయూ అధికార ప్రతినిధి షఫీ కిద్వాయ్ మీడియాకు వివరణ ఇచ్చారు. ‘జిన్నా ఏఎంయూ వ్యవస్థాపక సభ్యుడు. వర్సిటీకి విరాళం ఇచ్చారు. అంతేకాదు పాకిస్తాన్ కోసం డిమాండ్ చేయకముందే వర్సిటీ ఏర్పాటుకు కృషి చేశారు. 1938లో వర్సిటీ విద్యార్థి సంఘం జీవిత కాల సభ్యత్వం పొందారు. అలా సభ్యత్వం పొందినవారి చిత్రపటాలు యూనియన్ కార్యాలయంలో ఉంచడం సంప్రదాయంగా వస్తోంది. ఆ చిత్రపటాలు ఉమ్మడి భారతదేశ వారసత్వ సంపద. మహాత్మా గాంధీ, మౌలానా ఆజాద్, సర్వేపల్లి రాధాకృష్ణ, సి.రాజగోపాలాచారి, రాజేంద్ర ప్రసాద్, నెహ్రూలతో సహా ఏ జాతీయ నాయకుడూ ఆ చిత్రపటం గురించి అభ్యంతరం వ్యక్తం చేయలేదు’అని చెప్పుకొచ్చారు. ఆరెస్సెస్ శాఖ ఏర్పాటుకు అనుమతిపై వివరణ ఇస్తూ వర్సిటీలో రాజకీయ పార్టీలు, దాని అనుబంధ సంస్థల ప్రత్యక్ష ప్రవేశానికి తావు లేదన్నారు.