అలీఘడ్‌ ముస్లిం వర్సిటీకి ‘యోగి’ ఎఫెక్ట్‌ | Now, Meat Goes Off the Menu at Aligarh Muslim University | Sakshi
Sakshi News home page

అలీఘడ్‌ ముస్లిం వర్సిటీకి ‘యోగి’ ఎఫెక్ట్‌

Published Thu, Mar 30 2017 11:35 AM | Last Updated on Mon, Aug 27 2018 3:32 PM

అలీఘడ్‌ ముస్లిం వర్సిటీకి ‘యోగి’ ఎఫెక్ట్‌ - Sakshi

అలీఘడ్‌ ముస్లిం వర్సిటీకి ‘యోగి’ ఎఫెక్ట్‌

లక్నో: ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌ తీసుకున్న నిర్ణయం ప్రభావం ఇప్పుడు అలీఘడ్‌ ముస్లిం విశ్వవిద్యాలయంపై పడింది. ఇప్పటి వరకు ఆ విశ్వవిద్యాలయంలో వారానికి రెండుసార్లు మాంసాన్ని పెట్టే పరిస్థితి ఉండగా ఇప్పుడు అది కాస్త మెనూలో నుంచి మాయం కానుంది. అక్రమ కబేళాలను మూసివేయాలని, ప్రభుత్వ నిబంధనలు పాటించని మాంసం దుకాణాలపై కూడా తాము కఠిన చర్యలు తీసుకుంటామని యోగి నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌ మొత్తం కూడా మాంసం విక్రయాలు ఆగిపోయాయి.

ముస్లిం యూనివర్సిటీలోని ఫుడ్‌ మెనూలో విద్యార్థులకు వారానికి రెండుసార్లు మాంసంతో భోజనం పేర్కొన్నారు. ప్రస్తుతం మాంసం లభించని పరిస్థితి ఉన్న నేపథ్యంలో గత వారం నుంచి వారికి కేవలం కూరగాయల భోజనం వడ్డిస్తున్నారు. ఈ విషయం గందరగోళం వైపు దారి తీయకముందే నేడు ఆ వర్సిటీ వీసీ నేడు విద్యార్థి సంఘాలతో భేటీ అయ్యి ప్రస్తుతానికి మాంసం విషయాన్ని మెనూలో నుంచి తొలగిస్తున్న విషయాన్ని ప్రకటించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement