
లక్నో : వివాదాలకు కేంద్ర బిందువుగా మారే ఉత్తరప్రదేశ్‌లోని అలీఘడ్ ముస్లిం యూనివర్సిటీ (ఎఎమ్‌యూ) మరోసారి వార్తల్లో నిలిచింది. విశ్వవిద్యాలయ విద్యార్థులు మంగళవారం భారత చిత్రపటాన్ని ఆవిష్కరించి.. గోడలపై అంటించారు. ఐతే వారు ఆవిష్కరించిన మ్యాప్‌లో కశ్మీర్ లేకపోవడం వివాదానికి దారితీసింది. వెంటనే మేలుకున్న యూనివర్సిటీ యాజమాన్యం వాల్‌పోస్టర్లను తొలగించింది.
కొంత మంది విద్యార్థులు ఈచర్యకు పాల్పడ్డారని వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపింది. కాగా గత కొంతకాలం నుంచి ఎఎమ్‌యూ వివాదాస్పద చర్యలతో వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. పాకిస్తాన్ జాతిపిత మహ్మద్‌అలీ జిన్నా చిత్రాన్ని యూనివర్సిటీలో పెట్టడంతో గతంలో పెద్ద దుమారమే చెలరేగింది.
Comments
Please login to add a commentAdd a comment