India map
-
స్టార్ హీరోపై నెటిజన్ల ఫైర్.. మీకు కొంచెమైనా సిగ్గుందా..!
బాలీవుడ్ అక్షయ్‌కుమార్‌పై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ప్రపంచం చూపే గ్లోబ్‌పై నడుస్తూ ఇండియా మ్యాప్‌పై ఆయన షూస్ ధరించి నడవడాన్ని నెటిజన్స్ తప్పుపడుతున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను అక్షయ్ కుమార్ తన ట్వటర్లో పోస్ట్ చేశారు. ఇది చూసిన నెటిజన్లు బాలీవుడ్ హీరో తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. అక్షయ్ తన ఉత్తర అమెరికా టూర్‌ను ప్రమోట్ చేయడానికి ఒక వీడియోను పోస్ట్ చేశాడు. ఈ వీడియోలో ఆయన చేసిన పనితో ఇండియాను అగౌరవపరిచారని మండిపడుతున్నారు. ఈ వీడియోలో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్‌తో పాటు దిశా పటానీ, నోరా ఫతేహి, మౌని రాయ్, సోనమ్ బజ్వా కూడా ఉన్నారు. ప్రమోషనల్ పోస్ట్‌లో వారు గ్లోబ్‌పై నడుస్తూ కనిపించారు. అక్షయ్ కుమార్ ఈ వీడియో క్లిప్ షేర్ చేస్తూ.. "ఉత్తర అమెరికాకు 100% దేశీ వినోదాన్ని తీసుకురావడానికి ఎంటర్టైనర్స్ సిద్ధంగా ఉన్నారు. మీ సీట్ బెల్ట్‌లు పెట్టుకోండి. మేము మార్చిలో వస్తున్నాము.' అంటూ రాసుకొచ్చారు. ఈ వీడియోపై పలువురు నెటిజన్లు తీవ్రస్థాయిలో స్పందించారు. ఓ ట్విటర్ యూజర్.. ఓ కెనడియన్ నటుడు భారత మ్యాప్‌పై తిరుగుతూ భారతీయులను అవమానిస్తున్నారు. ఇది ఎంతవరకు ఆమోదయోగ్యం? ఈ సిగ్గుమాలిన చర్యకు మీరు 150 కోట్ల భారతీయులకు క్షమాపణలు చెప్పాలి.' అని రాశారు. మరొక నెటిజన్ రాస్తూ.. భాయి మన భారత్‌ను కాస్తైనా గౌరవించండి.' అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. చాలా మంది అతన్ని 'కెనడియన్ కుమార్' అని ఎగతాళి చేశారు. అక్షయ్ కుమార్ పౌరసత్వంపై పలు ప్రశ్నలు సంధించారు నెటిజన్స్. అతను కెనడియన్ పాస్‌పోర్ట్ కలిగి ఉండటం వల్ల నెటిజన్ల్ ట్రోల్స్ చేస్తున్నారు. The Entertainers are all set to bring 100% shuddh desi entertainment to North America. Fasten your seat belts, we’re coming in March! 💥 @qatarairways pic.twitter.com/aoJaCECJce — Akshay Kumar (@akshaykumar) February 5, 2023 The Entertainers are all set to bring 100% shuddh desi entertainment to North America. Fasten your seat belts, we’re coming in March! 💥 @qatarairways pic.twitter.com/aoJaCECJce — Akshay Kumar (@akshaykumar) February 5, 2023 Bhai sahab indian political map ko har subeh me puja karta hun rajniti shastra ka vidyarthi hun .aur ap bharat ke upar he shoe pahen ke khada ho gaye. — Raja.. (@MadanBag8) February 5, 2023 #AkshayKumar set foot on India🤬 Sharm nhi aayi @akshaykumar aisa karte huye jis india me itna paisa kama raha ..usi par apne per rakh raha hai..@narendramodi jii plzz take action.#shameonyouakshaykumar pic.twitter.com/PfIaxyzl30 — Devil V!SHAL (@VishalRCO07) February 5, 2023 -
భారత్‌లో ఉండాలని లేదా? ‘వాట్సాప్’కి కేంద్రం హెచ్చరిక!
న్యూఢిల్లీ: ప్రముఖ మెసేజింగ్ యాప్ ‘వాట్సాప్’ తన ట్విట్టర్ ఖాతాలో భారత్ మ్యాప్‌ను తప్పుగా చూపించే గ్రాఫిక్ చిత్రాన్ని పోస్టు చేయడంపై వివాదం రాజుకుంది. ప్రపంచపటంలో పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్, చైనా తమదేనని చెబుతున్న ప్రాంతాలు లేని భారత చిత్రపటాన్ని పంచుకుంది వాట్సాప్. దీనిపై కేంద్రం ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ హెచ్చరికలు చేశారు. జరిగిన తప్పును వెంటనే సరిదిద్దాలని లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించారు. ‘డియర్ వాట్సాప్.. భారత మ్యాప్‌లో తలెత్తిన తప్పును వెంటనే సరిదిద్దాలని కోరుతున్నాం. భారత్‌లో వ్యాపారం చేస్తున్న అన్ని సంస్థలు, వ్యాపారం కొనసాగించాలనుకుంటున్న సంస్థలు తప్పనిసరిగా సరైన మ్యాప్‌ను వినియోగించాలి. ’అని ట్విట్టర్లో వాట్సాప్ పోస్టును రీట్వీట్ చేశారు కేంద్ర మంత్రి. అలాగే వాట్సాప్ మాతృసంస్థ ‘మెటా’ను ట్యాగ్ చేశారు. కొత్త ఏడాది ని పురస్కరించుకుని ఈ గ్రాఫిక్ చిత్రాన్ని వాట్సాప్ పోస్ట్ చేసిన కొద్ది గంటల్లోనే జరిగిన తప్పును గుర్తించిన మంత్రి వెంటనే మెటాకు ఫిర్యాదు చేశారు. తప్పును సరిదిద్దకుంటే ఎదురయ్యే పరిణామాలపై సూత్రప్రాయంగా హెచ్చరించారు. Dear @WhatsApp - Rqst that u pls fix the India map error asap. All platforms that do business in India and/or want to continue to do business in India , must use correct maps. @GoI_MeitY @metaindia https://t.co/aGnblNDctK — Rajeev Chandrasekhar 🇮🇳 (@Rajeev_GoI) December 31, 2022 భారత భూభాగాలను తప్పుగా చూపించే చిత్రాలను పోస్ట్ చేయడం పోలీసు కేసుకు దారితీస్తుంది. అలాంటి తప్పులు చేసే వారికి జైలు శిక్ష పడే అవకాశాలు ఉన్నాయి. కశ్మీర్ లేకుండా మ్యాప్‌లను చూపించండంపై గతంలోనే ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు ఇతర సంస్థల తీరుపట్ల అసహనం వ్యక్తం చేసింది భారత్. వాట్సాప్ క్షమాపణలు.. మంత్రి హెచ్చరికలతో తప్పుగా ఉన్న ట్వీట్‌ను తొలగించింది వాట్సాప్. జరిగిన తప్పుకు ట్విట్టర్ వేదికగా క్షమాపణలు తెలిపింది. ‘అనుకోకుండా జరిగిన తప్పును గుర్తించినట్లు మంత్రిగారికి కృతజ్ఞతవలు. దానిని వెంటనే తొలగిస్తున్నాం. అలాగే క్షమాపణలు చెబుతున్నాం. ఈ విషయాన్ని భవిష్యత్తులోనూ మా దృష్టిలో ఉంచుకుంటాం.’ అని రాసుకొచ్చింది వాట్సాప్ ఇదీ చదవండి: స్నైఫర్ డాగ్ గర్భం దాల్చడంపై ‘బీఎస్ఎఫ్’ అనుమానాలు.. దర్యాప్తునకు ఆదేశం -
ఇక్కత్ రుమాలుపై ఇండియా మ్యాప్
భూదాన్‌పోచంపల్లి: ఇక్కత్ వ్రస్తాల తయారీలో వినూత్న ప్రయోగాలు చేస్తున్న యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లికి చెందిన చేనేత కళాకారుడు భోగ బాలయ్య తాజాగా మగ్గంపై డబుల్ ఇక్కత్ విధానంలో రుమాలు (స్కార్ప్)పై ఇండియా మ్యాప్ నేసి ఔరా అనిపించారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆజాదీకా అమృత్ మహోత్సవాలను పురస్కరించుకొని తన దేశభక్తి చాటేందుకు ఆయన ఇండియా మ్యాప్, మధ్యన రాట్నం వచ్చేటట్టుగా స్కార్ప్ నేశారు. ఇందుకోసం మృదువుగా ఉండే ప్రత్యేకమైన నూలును కోయంబత్తూర్ నుంచి తెప్పించారు. అలాగే పర్యావరణ హితమైన ఎకో ఫ్రెండ్లీ వ్యాట్ రంగులను వినియోగించారు. భోగ బాలయ్య తాను నేసిన ఇక్కత్ ఇండియా మ్యాప్ రుమాలు ఫొటోలను పీఎంఓకు, మంత్రి కేటీఆర్‌తో పాటు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతికి ట్విట్టర్లో పోస్ట్ చేశారు. బాలయ్య ఇప్పటికే వినూత్న డిజైన్‌తో ఇక్కత్ చీరను నేసి గత ఏడాది ఆచార్య కొండా లక్ష్మణ్‌బాపూజీ పురస్కారాన్ని మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా అందుకున్నారు. -
ట్విట్టర్‌పై కేసుల వెల్లువ
నోయిడా/ ఢిల్లీ: కేంద్రంతో ధిక్కార ధోరణి అవలంబిస్తున్న సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్‌పై మంగళవారం మరికొన్ని కేసులు నమోదయ్యాయి. ట్విట్టర్ ఎండీపై యూపీ, ఎంపీ పోలీసులు కేసులు నమోదు చేయగా, ట్విట్టర్‌పై ఢిల్లీ పోలీసులు కేసు పెట్టారు. జమ్మూకశ్మీర్, లద్దాఖ్‌లను వేరే దేశంగా పేర్కొంటూ తమ వెబ్సైట్లో ఓ తప్పుడు మ్యాప్‌ను ప్రదర్శించినందుకు గానూ ట్విట్టర్ సీనియర్ అధికారులపై ఉత్తరప్రదేశ్ పోలీసులు, మధ్య ప్రదేశ్ పోలీసులు వేరువేరుగా కేసులు నమోదు చేశారు. సంస్థ ప్లాట్‌ఫామ్‌పై పిల్లల నీలిచిత్రాలకు యాక్సెస్ ఇస్తున్నందుకు న్యూఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. భారత చిత్రపటాన్ని తప్పుగా చూపారని భజరంగ్‌దళ్ కార్యకర్తల ఫిర్యాదు మేరకు మనీశ్ మహేశ్వరితో పాటు న్యూస్ పార్టనర్ షిప్స్ హెడ్ అమృతా త్రిపాఠిపై యూపీలోని ఖుర్జానగర్ పోలీసు స్టేషన్లో ఐపీసీ సెక్షన్ 505–2, ఐటీ చట్టం 74 కింద ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇదే అంశంపై బీజేపీ నేత ఫిర్యాదు ఆధారంగా మధ్యప్రదేశ్ సైబర్ క్రైమ్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తప్పుడు మ్యాపింగ్ అంశంపై లోతైన దర్యాప్తు జరపాలని ఎంపీ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా రాష్ట్ర డీజీపీని ఆదేశించారు. భారత్‌కు సంబంధించి తప్పుడు మ్యాప్‌ను ట్విట్టర్ సోమవారం తన వెబ్సైట్లో ప్రదర్శించడం వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. ఇలా ఉండగా, కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్, కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ఖాతాలను ఇటీవల బ్లాక్ చేయడంపై రెండు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఐటీపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ట్విట్టర్‌కు నోటీసులు జారీ చేసింది. చదవండి: Prashant Bhushan: వ్యాక్సిన్ వ్యతిరేక ట్వీట్లు.. షాకిచ్చిన ట్విటర్ -
తీవ్ర దుశ్చర్యకు పాల్పడిన ట్విటర్.. చర్యలకు కేంద్రం రెడీ..!
న్యూ ఢిల్లీ: గత కొన్నిరోజులుగా ట్విటర్‌కు కేంద్రానికి మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. తాజాగా ట్విటర్ పాల్పడిన తీవ్ర దుశ్చర్యతో కేంద్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా ట్విటర్ ఇండియా మ్యాప్ నుంచి జమ్మూకశ్మీర్‌ను తొలగించింది. జమ్మూ కశ్మీర్‌ను పాకిస్థాన్‌లో అంతర్బాగంగా చూపించింది. అంతేకాకుండా కేంద్ర పాలిత ప్రాంతం లద్దాఖ్‌ను వేరే దేశంగా చూపించింది. దీంతో ట్విటర్‌పై కేంద్రం తీవ్ర చర్యలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితం కేంద్ర ఐటీ శాఖ మంత్రి ట్విటర్ ఖాతాను బ్లాక్ చేసి తిరిగి పునరుద్దరించిన విషయం తెలిసిందే. ట్విటర్ ఇండియా గ్రీవెన్స్ ఆఫీసర్ పోస్టు నుంచి ధర్మేంద్ర చాతుర్ ఆ పదవికి రాజీనామా చేశారు. ధర్మేంద్ర ఆ పదవికి రాజీనామా చేయడంతో కొత్తగా ఆయన స్థానంలోకి ట్విటర్ గ్లోబల్ లీగల్ పాలసీ డైరెక్టర్ అయిన జెరెమి కెస్సెల్‌ను భారతదేశానికి గ్రీవెన్స్ అధికారిగా నియమించింది. నిబందనల ప్రకారం స్థానికులనే గ్రీవెన్స్ ఆఫీసర్‌గా నియమించాలి. చదవండి: భారత్ మ్యాప్ ను తప్పుగా చూపించిన ట్విట్టర్ -
భారత్ మ్యాప్ ను తప్పుగా చూపించిన ట్విట్టర్
-
వికీపీడియాకు కేంద్రం నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ : భారత్ మ్యాప్‌ను తప్పుగా చూపించిన వికీపీడియాపై కేంద్ర ప్రభుత్వ ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే తప్పును సరిదిద్దుకోకపోతే తగిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని భారత ప్రభుత్వం నోటీసులు జారీచేసింది. లేహ్‌ను కేంద్రపాలిత ప్రాంత లద్దాఖ్‌లో కాకుండా జమ్మూ కశ్మీర్లో అంతర్భాగంగా గత నెలలో వికీపీడియా చూపించిన విషయం తెలిసిందే. దీనిని ట్విటర్ వేదికగా ఓ నెటిజన్ కేంద్ర సమాచార మంత్రిత్వశాఖ దృష్టికి తీసుకెళ్లారు. నెటిజన్ ట్వీట్‌పై స్పందించిన కేంద్రం.. వికీపీడియా యాజమాన్యానికి నోటీసులు జారీచేసింది. ఈ చర్య భారతదేశ ప్రాదేశిక సమగ్రతను, సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించినట్లేనని ప్రభుత్వం వికీపీడియాకు తెలియజేసింది. భారత ఐటీ చట్టం 2000లోని సెక్షన్ 69ఎ ప్రకారం ఉత్తర్వు జారీ చేసింది. వికీపీడియా తప్పును సరిదిద్దుకోవాలని, లేకుంటే సంస్థపై నిషేధం విధించడంతోపాటు ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని 2020 నవంబర్ 27న జారీచేసిన నోటీసుల్లో పేర్కొంది. దీనిపై వికీపీడియా ఇప్పటి వరకు ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. (చదవండి: జమ్మూ కశ్మీర్లో కాల్పులు.. నలుగురు హతం) -
ఇండియా కొత్త మ్యాప్‌ల వినియోగంపై ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ఇటీవల అందుబాటులోకి తీసుకొచ్చిన ఇండియా కొత్త మ్యాప్‌ను వినియోగించాలని ఆర్జేడీలు, డీఈవోలను రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) ఆదేశించింది. ఈ మేరకు సర్వే ఆఫ్ ఇండియా వెబ్సైట్ నుంచి మ్యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలని పేర్కొంది. విద్యాశాఖ కార్యాలయాలతోపాటు అన్ని పాఠశాలల్లోనూ నూతన మ్యాప్‌ను ఉపయోగించాలని స్పష్టం చేసింది. వచ్చే విద్యా సంవత్సరంలో పాఠ్య పుస్తకాల్లోనూ ఇదే మ్యాప్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు. -
కొత్త జమ్మూకశ్మీర్ మ్యాపు ఇదే!
న్యూఢిల్లీ: ఏళ్లుగా నలుగుతూ.. కల్లోలంగా ఉన్న జమ్మూకశ్మీర్ విషయంలో నరేంద్రమోదీ సర్కారు చరిత్రాత్మకమైన నిర్ణయం తీసుకుంది. జమ్మూకశ్మీర్ రాష్ట్రాన్ని రెండు కేంద్ర ప్రాంత పాలిత ప్రాంతాలుగా విభజించే బిల్లును కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోమవారం రాజ్యసభలో ప్రవేశపెట్టారు. అంతేకాకుండా జమ్మూకశ్మీర్‌కు స్వతంత్ర ప్రాతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ను రద్దుచేస్తున్నట్టు సాహసోపేతమైన నిర్ణయాన్ని వెల్లడించారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో జమ్మూకశ్మీర్ ముఖచిత్రం మారిపోనుంది. భారత మ్యాపులో కూడా మార్పులు రానున్నాయి. రాష్ట్రాన్నిరెండు కేంద్ర ప్రాంత పాలిత ప్రాంతాలు జమ్మూకశ్మీర్, లడఖ్‌గా విభజించనున్నారు. ఈ మేరకు జమ్మూకశ్మీర్ కొత్త మ్యాప్ ఈ విధంగా ఉండనుంది. (మ్యాప్‌ను పైన ఫొటోలో చూడొచ్చు) జమ్మూకశ్మీర్‌లో సీమాంతర ఉగ్రవాదం నిరంతర సమస్యగా మారడం, రాష్ట్రం గతకొంతకాలంగా కల్లోలంగా ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని అమిత్ షా తెలిపారు. కేంద్ర పాలిత ప్రాంతంగా మారనున్న జమ్మూకశ్మీర్‌కు శాసనసభ ఉంటుందని, కానీ లడఖ్ శాసనసభలేని కేంద్ర పాలిత ప్రాంతంగా మారనుందని ఆయన వెల్లడించారు. ఆర్టికల్ 370 రద్దు ప్రకటన, జమ్మూకశ్మీర్ విభజన బిల్లును ప్రవేశపెట్టడంతో రాజ్యసభలో తీవ్ర గందరగోళం చెలరేగింది. -
కశ్మీర్ లేకుండా భారత చిత్రపటం
లక్నో : వివాదాలకు కేంద్ర బిందువుగా మారే ఉత్తరప్రదేశ్‌లోని అలీఘడ్ ముస్లిం యూనివర్సిటీ (ఎఎమ్‌యూ) మరోసారి వార్తల్లో నిలిచింది. విశ్వవిద్యాలయ విద్యార్థులు మంగళవారం భారత చిత్రపటాన్ని ఆవిష్కరించి.. గోడలపై అంటించారు. ఐతే వారు ఆవిష్కరించిన మ్యాప్‌లో కశ్మీర్ లేకపోవడం వివాదానికి దారితీసింది. వెంటనే మేలుకున్న యూనివర్సిటీ యాజమాన్యం వాల్‌పోస్టర్లను తొలగించింది. కొంత మంది విద్యార్థులు ఈచర్యకు పాల్పడ్డారని వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపింది. కాగా గత కొంతకాలం నుంచి ఎఎమ్‌యూ వివాదాస్పద చర్యలతో వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. పాకిస్తాన్ జాతిపిత మహ్మద్‌అలీ జిన్నా చిత్రాన్ని యూనివర్సిటీలో పెట్టడంతో గతంలో పెద్ద దుమారమే చెలరేగింది. -
చైనా బరితెగింపు.. కశ్మీర్ లేకుండా చేసి..
కెనడా : నిత్యం భారత్‌తో పేచి పెట్టుకునే చైనా మరో దుర్మార్గపు చర్యకు పూనుకుంది. ఏకంగా కశ్మీర్ మొత్తాన్ని భారత్‌తో సంబంధం లేదన్నట్లుగా చూపించే గ్లోబులను మార్కెట్లోకి విక్రయించింది. పెద్ద మొత్తంలో కెనడా దుకాణాల్లో దర్శనం ఇస్తున్న ఈ గ్లోబులు ఇప్పుడు భారత సంతతి అమెరికన్ పౌరులను తీవ్రంగా కలవర పెడుతున్నాయి. వాటిని చూసే తమ చిన్నారులకు భారత భౌగోళిక స్వరూపం ఎలా చూపించాలని ఆందోళన చెందుతున్నారు. వివరాల్లోకి వెళితే.. నూతన సంవత్సరం సందర్భంగా సందీప్ దేశ్వాల్ అనే ఓ భారత సంతతి అమెరికన్ తన ఆరేళ్ల కూతురు అస్మితాకు గ్లోబు కొని తీసుకొచ్చాడు. క్రిస్మస్ సందర్భంగా శాంటా తాతకు తనకు గ్లోబ్ కావాలని అస్మిత విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో తల్లిదండ్రులు ఆమె కోరికను తీర్చారు. అయితే, ఆ గ్లోబులో భారత్ ఎక్కడ ఉంది? కెనడా ఎక్కడ ఉంది ? అని పాప అడిగినప్పుడు వారు ఒక్కసారిగా కలవరపడ్డారు. భారత్‌కు తలకాయలాంటి కశ్మీర్‌ను పూర్తిగా వేరు చేసి ఆ గ్లోబులో ఉంది. ఆ గ్లోబులన్నీ కూడా చైనా తయారు చేసినవే. దీంతో తాను ఈ విషయాన్ని గ్లోబులు విక్రయిస్తున్న దుకాణానికి తెలియజేశాడు. ఈ సందర్బంగా తన ఆందోళనను మీడియాతో పంచుకుంటూ 'కశ్మీర్ కూడా భారత్‌లో భాగమే అనే విషయాన్ని ఇప్పుడు తాను తన కూతురుకి చెప్పకుంటే తను మరో రూపంలో ఉన్న భారత్ చిత్రపటాన్ని ఊహించుకుంటుంది. ముందు తరాల వారు కూడా దానినే అనుసరించే ప్రమాదం ఉంది. చైనా చేసిన ఈ చర్యను ఏమాత్రం సహించకూడదు' అని ఆయన అన్నారు. -
స్కూలు ప్రిన్సిపల్ పై దేశద్రోహం కేసు నమోదు
భోపాల్: భారతదేశ పటాన్ని తప్పుగా చిత్రీకరించినందుకు పాఠశాల ప్రిన్సిపల్ సహా ముగ్గురిపై దేశద్రోహం కేసు నమోదైంది. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని సదోల్ జిల్లాలో చోటుచేసుకుంది. పాఠశాల డైరీలో ఇండియా పటంలో కశ్మీర్ ను వేరే దేశం భూభాగంలో ఉన్నట్టు చిత్రీకరించారు. దీంతో పాఠశాల యాజమాన్యంపై బీజేపీ యువమోర్చా కార్యకర్త ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గ్రీన్ బెల్స్ స్కూలు యజమాని మహ్మద్ షరీఫ్ ప్రిన్సిపల్ గోవింద్ చంద్ర దాస్, ప్రింటింగ్ ప్రెస్ ఓనర్ ఏకే అగర్వాల్ లపై దేశద్రోహం కేసును నమోదు చేసిన పోలీసులు వారిని జైలుకు తరలించారు. ‘భూ ఖగోళ ప్రాంత సమాచార నియంత్రణ బిల్లు-2016’ ప్రకారం భారతదేశ పటాన్ని తప్పుగా చిత్రీకరిస్తే కఠినశిక్ష విధించేలా ఇటీవల కేంద్ర ప్రభుత్వం చట్టం చేసింది. ఈమధ్య కొన్ని సామాజిక మాధ్యమాల్లో జమ్మూ కశ్మీర్, అరుణాచల్‌ప్రదేశ్‌లను వరుసగా పాకిస్తాన్, చైనా భూభాగాలని సూచించడం వివాదస్పదమైన సంగతి తెలిసిందే. -
తప్పుడు మ్యాపులకు మోహన్ భగవత్‌ను జైల్లో పెడతారా?
న్యూఢిల్లీ: భారత దేశ నైసర్గిక సరిహద్దులను మ్యాపుల్లో ఆన్‌లైన్‌లోగానీ, ముద్రణాపరంగాగానీ తప్పుగా చూపించినట్లయితే గరిష్టంగా ఏడేళ్ల జైలు శిక్ష, కోటి రూపాయల నుంచి వంద కోట్ల రూపాయల వరకు జరిమానా లేదా రెండు విధించేందుకు వీలుగా కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం కొత్త ముసాయిదా బిల్లును రూపొందించిన విషయం తెల్సిందే. మరి అఖండ్ భారత్ లేదా అవిభాజ్య భారత్ చిత్ర పటాన్ని ఆది నుంచి ప్రదర్శిస్తూ వస్తున్న ఆరెస్సెస్‌ను ఈ కొత్త బిల్లు కింద శిక్షిస్తారా? ఆరెస్సెస్ నాయకుడు మోహన్ భగవత్‌ను అరెస్ట్‌చేసి జైల్లో పెడతారా? అఖండ్ భారత్ బ్యాక్‌డ్రాప్‌గా భారత మాతా చిత్రపటాన్ని ఆరెస్సెస్ తన అధికార మ్యాప్‌గా పరిగణిస్తున్న విషయం తెల్సిందే. ఆరెస్సెస్ మ్యాపుల్లో పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లను కలిపి భారత్ మ్యాప్‌ను చూపిస్తోంది. కొన్ని చిత్రాల్లో అఫ్ఘానిస్తాన్, మయన్మార్, నేపాల్, శ్రీలంక దేశాలను కూడా చూపిస్తోంది. కొత్త బిల్లు చట్టంగా మారితే అధికార బీజేపీకి అండగా నిలుస్తున్న ఆరెస్సెస్ కూడా నేరానికి పాల్పడినట్లు కాదా? జమ్మూ కశ్మీర్‌ను పాకిస్తాన్లో, అరుణాచల్ ప్రదేశ్‌ను చైనాలో కలిపి భారత్ మ్యాప్‌లను ఆన్లైన్లో చూపిన కారణంగా ఈ బిల్లును తీసుకరావాల్సిన ఆవశ్యకత ఏర్పడిందని ప్రభుత్వం చెబుతోంది. పశ్చిమ జమ్మూ కశ్మీర్‌లోని సగ భాగం వాస్తవానికి పాకిస్తాన్ ఆధీనంలో ఉంది. ఆ ప్రాంతం మన ఆధీనంలో ఉన్నట్లు మన మ్యాపుల్లో చూపించుకుంటున్నాం. అలాగే, ఈశాన్యంలోని అక్సాయి చిన్ ప్రాంతం చైనా ఆధీనంలో ఉన్నది. అది కూడా మన ఆధీనంలో ఉన్నట్లుగా మ్యాపుల్లో చూపించుకుంటున్నాం. మన ఆధీనంలో లేని ప్రాంతాలను మన మ్యాపుల నుంచి తొలగిస్తే కొత్త చట్టం కింద శిక్షిస్తారా? ఆరెస్సెస్‌ను శిక్షిస్తారో, లేదోగానీ వాస్తవ మ్యాపులను రూపొందిస్తే మాత్రం కచ్చితంగా శిక్షిస్తారని ప్రభుత్వ ధోరణి చూస్తే అర్థం అవుతుంది. -
భారత పటాన్ని తప్పుగా చూపితే 100 కోట్ల జరిమానా
న్యూఢిల్లీ: భారత దేశ పటాన్ని తప్పుగా చిత్రీకరించే వారికి కనీసం ఏడేళ్ల జైలు శిక్ష, రూ. 100 కోట్ల జరిమానా విధించేలా ప్రభుత్వం చట్టం చేయనుంది. ఈ మధ్య కొన్ని సామాజిక మాధ్యమాల్లో జమ్మూ కశ్మీర్, అరుణాచల్‌ప్రదేశ్‌లు వరుసగా పాకిస్తాన్, చైనా భూభాగాలని సూచించడం వివాదస్పదమైన సంగతి తెలిసిందే. ప్రతిపాదిత ‘భూ ఖగోళ ప్రాంత సమాచార నియంత్రణ బిల్లు-2016’ ప్రకారం ... భారత భౌగోళిక సమాచారాన్ని సేకరించడం, ప్రచురించడం, పంపిణీచే యడానికి ముందు సదరు సంస్థ తప్పని సరిగా ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలి. -
ఆ పోస్ట్ ను ఫేస్ బుక్ సీఈఓ తొలగించారు
న్యూఢిల్లీ: అరుణాచల్ ప్రదేశ్, జమ్మూ కశ్మీర్ ప్రాంతాలు లేకుండా ఉన్న భారత్ మ్యాప్ పోస్ట్‌ను ఫేస్ బుక్ నుంచి సీఈఓ మార్క్ జూకర్ బర్గ్ శుక్రవారం తొలగించారు. అసలు విషయమేమంటే.. మే 13 తేదీన ఇంటర్ నెట్.ఆర్గ్ (Internet.org)ను మాలవి, ఆఫ్రికాలో ప్రవేశపెట్టిన సందర్భంగా ఆయన భారత్ కు సంబంధించిన మ్యాప్ పోస్ట్ చేశారు. దాంతో భారత్ నుంచి ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ఈ విషయంపై భారత్ మ్యాప్ తప్పుగా ఉందని మార్పులు చేయాలని జూకర్ బర్గ్ కు సూచిస్తూ యూజర్లు కామెంట్ చేశారు. కాగా ఈ వివాదాస్పదమైన మ్యాప్ ను ఫేస్బుక్ లో పోస్ట్ చేయడంపై జూకర్ బర్గ్ ఇప్పటివరకూ స్పందించలేదు. భారత ప్రధాని నరేంద్ర మోదీ 3 రోజుల చైనా పర్యటన నేపథ్యంలో.. చైనా అధికార టెలివిజన్ చానల్ సీసీటీవీ ఒక దుశ్చర్యకు పాల్పడింది. ప్రధాని మోదీ పర్యటన వార్తలను ప్రసారం చేస్తూ.. జమ్మూ కశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్లు లేని భారతదేశ పటాన్ని చూపించింది. అరుణాచల్ ప్రదేశ్‌ను, జమ్మూకశ్మీర్‌లోని కొన్ని ప్రాంతాలు తమవేనని చైనా వాదిస్తున్న సంగతి తెలిసిందే.