ఆ పోస్ట్ ను ఫేస్ బుక్ సీఈఓ తొలగించారు
న్యూఢిల్లీ: అరుణాచల్ ప్రదేశ్, జమ్మూ కశ్మీర్ ప్రాంతాలు లేకుండా ఉన్న భారత్ మ్యాప్ పోస్ట్ను ఫేస్ బుక్ నుంచి సీఈఓ మార్క్ జూకర్ బర్గ్ శుక్రవారం తొలగించారు. అసలు విషయమేమంటే.. మే 13 తేదీన ఇంటర్ నెట్.ఆర్గ్ (Internet.org)ను మాలవి, ఆఫ్రికాలో ప్రవేశపెట్టిన సందర్భంగా ఆయన భారత్ కు సంబంధించిన మ్యాప్ పోస్ట్ చేశారు. దాంతో భారత్ నుంచి ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ఈ విషయంపై భారత్ మ్యాప్ తప్పుగా ఉందని మార్పులు చేయాలని జూకర్ బర్గ్ కు సూచిస్తూ యూజర్లు కామెంట్ చేశారు. కాగా ఈ వివాదాస్పదమైన మ్యాప్ ను ఫేస్బుక్ లో పోస్ట్ చేయడంపై జూకర్ బర్గ్ ఇప్పటివరకూ స్పందించలేదు.
భారత ప్రధాని నరేంద్ర మోదీ 3 రోజుల చైనా పర్యటన నేపథ్యంలో.. చైనా అధికార టెలివిజన్ చానల్ సీసీటీవీ ఒక దుశ్చర్యకు పాల్పడింది.
ప్రధాని మోదీ పర్యటన వార్తలను ప్రసారం చేస్తూ.. జమ్మూ కశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్‌లు లేని భారతదేశ పటాన్ని చూపించింది. అరుణాచల్ ప్రదేశ్‌ను, జమ్మూకశ్మీర్‌లోని కొన్ని ప్రాంతాలు తమవేనని చైనా వాదిస్తున్న సంగతి తెలిసిందే.