జమ్మూకశ్మీర్ కొత్త మ్యాప్
న్యూఢిల్లీ: ఏళ్లుగా నలుగుతూ.. కల్లోలంగా ఉన్న జమ్మూకశ్మీర్ విషయంలో నరేంద్రమోదీ సర్కారు చరిత్రాత్మకమైన నిర్ణయం తీసుకుంది. జమ్మూకశ్మీర్ రాష్ట్రాన్ని రెండు కేంద్ర ప్రాంత పాలిత ప్రాంతాలుగా విభజించే బిల్లును కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోమవారం రాజ్యసభలో ప్రవేశపెట్టారు. అంతేకాకుండా జమ్మూకశ్మీర్‌కు స్వతంత్ర ప్రాతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ను రద్దుచేస్తున్నట్టు సాహసోపేతమైన నిర్ణయాన్ని వెల్లడించారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో జమ్మూకశ్మీర్ ముఖచిత్రం మారిపోనుంది. భారత మ్యాపులో కూడా మార్పులు రానున్నాయి. రాష్ట్రాన్నిరెండు కేంద్ర ప్రాంత పాలిత ప్రాంతాలు జమ్మూకశ్మీర్, లడఖ్‌గా విభజించనున్నారు. ఈ మేరకు జమ్మూకశ్మీర్ కొత్త మ్యాప్ ఈ విధంగా ఉండనుంది. (మ్యాప్‌ను పైన ఫొటోలో చూడొచ్చు)
జమ్మూకశ్మీర్‌లో సీమాంతర ఉగ్రవాదం నిరంతర సమస్యగా మారడం, రాష్ట్రం గతకొంతకాలంగా కల్లోలంగా ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని అమిత్ షా తెలిపారు. కేంద్ర పాలిత ప్రాంతంగా మారనున్న జమ్మూకశ్మీర్‌కు శాసనసభ ఉంటుందని, కానీ లడఖ్ శాసనసభలేని కేంద్ర పాలిత ప్రాంతంగా మారనుందని ఆయన వెల్లడించారు. ఆర్టికల్ 370 రద్దు ప్రకటన, జమ్మూకశ్మీర్ విభజన బిల్లును ప్రవేశపెట్టడంతో రాజ్యసభలో తీవ్ర గందరగోళం చెలరేగింది.
Comments
Please login to add a commentAdd a comment