తాను నేసిన రుమాలును చూపిస్తున్న చేనేత కళాకారుడు భోగ బాలయ్య, ఆయన భార్య
భూదాన్‌పోచంపల్లి: ఇక్కత్ వ్రస్తాల తయారీలో వినూత్న ప్రయోగాలు చేస్తున్న యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లికి చెందిన చేనేత కళాకారుడు భోగ బాలయ్య తాజాగా మగ్గంపై డబుల్ ఇక్కత్ విధానంలో రుమాలు (స్కార్ప్)పై ఇండియా మ్యాప్ నేసి ఔరా అనిపించారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆజాదీకా అమృత్ మహోత్సవాలను పురస్కరించుకొని తన దేశభక్తి చాటేందుకు ఆయన ఇండియా మ్యాప్, మధ్యన రాట్నం వచ్చేటట్టుగా స్కార్ప్ నేశారు.
ఇందుకోసం మృదువుగా ఉండే ప్రత్యేకమైన నూలును కోయంబత్తూర్ నుంచి తెప్పించారు. అలాగే పర్యావరణ హితమైన ఎకో ఫ్రెండ్లీ వ్యాట్ రంగులను వినియోగించారు. భోగ బాలయ్య తాను నేసిన ఇక్కత్ ఇండియా మ్యాప్ రుమాలు ఫొటోలను పీఎంఓకు, మంత్రి కేటీఆర్‌తో పాటు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతికి ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. బాలయ్య ఇప్పటికే వినూత్న డిజైన్‌తో ఇక్కత్ చీరను నేసి గత ఏడాది ఆచార్య కొండా లక్ష్మణ్‌బాపూజీ పురస్కారాన్ని మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా అందుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment