అలీగఢ్: ఓ స్టూడెంట్ యూనియన్ అధ్యక్షుడు సహా 14 మంది విద్యార్థులపై దేశద్రోహం కేసు నమోదైన ఘటన అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో బుధవారం చోటుచేసుకుంది. యూనివర్సిటీలో జరగబోయే ఓ కార్యక్రమానికి హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీని ఆహ్వానించిన నేపథ్యంలో క్యాంపస్‌లో యుద్ధ వాతావరణం నెలకొంది. బీజేవైఎం కార్యకర్తలు వర్సిటీలో ఒవైసీ పర్యటనకు వ్యతిరేకంగా మంగళవారం నిరసన ప్రదర్శనలు చేపట్టారు.
ఒవైసీ పర్యటనను నిషేధించాలని డిమాండ్ చేశారు. ఇటు వర్సిటీలో చిత్రీకరించడానికి వచ్చిన ఓ టీవీ చానెల్ సిబ్బందితో సైతం కొందరు విద్యా ర్థులు గొడవ పడ్డారని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే మంగళవారం రాత్రి బీజేవైఎంకు చెందిన ముఖేశ్ లోధి బైక్‌పై వస్తుండగా క్యాంపస్‌లో అడ్డగించి కొందరు పాకిస్తాన్ అనుకూల నినాదాలు చేస్తూ దాడికి పాల్పడినట్లు కేసు నమోదైంది. విద్యార్థి యూనియన్ అధ్యక్షుడు సల్మాన్ ఇంతియాజ్, ఉపాధ్యక్షుడు హుజైఫా అమీర్ సహా 14 మందిపై కేసులు నమోదయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment