
ఆ లైబ్రరీలోకి అమ్మాయిలు ఓకే!
అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ లెఫ్టినెంట్ జనరల్ జమీరుద్దీన్ షా ఎట్టకేలకు దిగొచ్చారు. తమ యూనివర్సిటీ లైబ్రరీలోకి అమ్మాయిలను అనుమతిస్తామని కోర్టుకు తెలిపారు. లైబ్రరీలోకి అమ్మాయిలను అనుమతిస్తే, అంతకుముందు వచ్చే అబ్బాయిల కంటే నాలుగు రెట్లు ఎక్కువగా వస్తారని, అప్పుడు అక్కడ స్థలం సరిపోదంటూ ఇంతకుముందు ఆయన అమ్మాయిల ప్రవేశాన్ని ఆయన అడ్డుకున్న విషయం తెలిసిందే.
ఈ విషయంలో ఎంతమంది ఎంతగా ఒత్తిడి తెచ్చినా కూడా ఆయన ఇంతకుముందు లొంగలేదు. అయితే, స్వయంగా కోర్టే కలగజేసుకుని.. గట్టిగా మొట్టికాయలు వేయడంతో ఎట్టకేలకు వీసీ జనరల్ జమీరుద్దీన్ షా తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఈ విషయాన్ని కోర్టుకు కూడా తెలిపారు.