అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ గ్రంథాలయంలోకి అమ్మాయిలను కూడా అనుమతించాల్సిందేనంటూ అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది. అమ్మాయిలను అనుమతిస్తే ఇప్పుడు వస్తున్నదానికి నాలుగు రెట్లు ఎక్కువగా అబ్బాయిలు వస్తారంటూ వ్యాఖ్యానించిన వైస్ ఛాన్స్లర్ జమీరుద్దీన్ షా ఈ విషయంలో సమాధానం ఇవ్వాలనికూడా కోర్టు ఆదేశించింది.
ఈ విషయాన్ని సుమోటోగా తీసుకునేందుకు నిరాకరించిన హైకోర్టు.. ఓ పిల్ దాఖలు చేయడంతో దానిపై విచారణ చేపట్టింది. న్యాయ విద్యార్థిని, సామాజిక కార్యకర్త దీక్షా ద్వివేదీ ఈ పిల్ దాఖలు చేశారు. మహిళా విద్యార్థినుల పట్ల ఏఎంయూ వైస్ ఛాన్స్లర్ వివక్షాపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఈ అంశంపై తీవ్ర వివాదం చెలరేగడంతో, అమ్మాయిలను లైబ్రరీలోకి అనుమతించే విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటున్నట్లు ఏఎంయూ వర్గాలు కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖకు తెలిపాయి.
అమ్మాయిలను అనుమతించాల్సిందే: హైకోర్టు
Published Fri, Nov 14 2014 7:58 PM | Last Updated on Fri, Aug 31 2018 8:26 PM
Advertisement