అనుచిత వ్యాఖ్యలు చేసిన కశ్మీరీ విద్యార్థిపై... | Aligarh Muslim University Expels Kashmiri Student Over Facebook Post On Uri Attack | Sakshi
Sakshi News home page

అనుచిత వ్యాఖ్యలు చేసిన కశ్మీరీ విద్యార్థిపై...

Published Mon, Sep 19 2016 8:16 PM | Last Updated on Sat, Aug 25 2018 3:57 PM

అనుచిత వ్యాఖ్యలు చేసిన కశ్మీరీ విద్యార్థిపై... - Sakshi

అనుచిత వ్యాఖ్యలు చేసిన కశ్మీరీ విద్యార్థిపై...

అలిగర్ : యూరీ ఆర్మీ బేస్ క్యాంప్పై జరిగిన ఉగ్రదాడిపై అభ్యంతరకర కామెంట్లను ఫేస్బుక్లో పోస్టు చేసినందుకు ఓ విద్యార్థుడిని యూనివర్సిటీ నుంచి బహిష్కరించారు. అలిగర్ ముస్లి యూనివర్సిటీ(ఏఎంయూ)లో ఆర్గనిక్ కెమిస్ట్రీలో మాస్టర్స్ను అభ్యసిస్తున్న కశ్మీరీ విద్యార్థుడు ముదాస్సర్ యూసఫ్ యూరీ ఉగ్రదాడిపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న ఏఎంయూ వైస్ ఛాన్సరల్ లెప్టినెంట్ జనరల్ జమీర్ ఉద్దీన్ షా, ఆ విద్యార్థుడిని యూనివర్సిటీ నుంచి బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు. జాతివ్యతిరేకంగా ఎలాంటి అసహన ఘటనలు తావెత్తకుండా ఉండేందుకు లిప్టినెంట్ జనరల్ షా ఈ నిర్ణయం తీసుకున్నట్టు యూనివర్సిటీ అధికార ప్రతినిధి పేర్కొన్నారు.
 
సెంటిమెంట్లను దెబ్బతీసేవిధంగా ఈ కామెంట్లను పోస్టు చేసినందుకు వైస్ చాన్సలర్కు ముదాస్సర్ యూసఫ్ ఆదివారమే క్షమాపణ చెప్పుకున్నాడు. కానీ ఈ విషయం చాలా సున్నితమైనది కారణంగా యూనివర్సిటీ అధికారులు విద్యార్థుడిని యూనివర్సిటీ నుంచి తొలగించాలని నిర్ణయించినట్టు అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఆ విద్యార్థుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వైస్ ఛాన్సలర్కు బీజేపీ లోక్సభ సభ్యులు లేఖ రాశారు. ఆదివారం వేకువ జామున కశ్మీర్లోని యూరీ బేస్ క్యాంపుపై జరిగిన ఈ దాడిలో 18 మంది భారత సైన్యం మృతిచెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనను భారత్తో పాటు యావత్ ప్రపంచం తీవ్రంగా ఖండిస్తోంది. ఘటనకు పాల్పడిన వారిని ఎట్టి పరిస్థితులో వదిలేది లేదని భారత ప్రభుత్వం హెచ్చరికలు కూడా జారీచేసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement