అనుచిత వ్యాఖ్యలు చేసిన కశ్మీరీ విద్యార్థిపై...
అలిగర్ : యూరీ ఆర్మీ బేస్ క్యాంప్‌పై జరిగిన ఉగ్రదాడిపై అభ్యంతరకర కామెంట్లను ఫేస్బుక్లో పోస్టు చేసినందుకు ఓ విద్యార్థుడిని యూనివర్సిటీ నుంచి బహిష్కరించారు. అలిగర్ ముస్లి యూనివర్సిటీ(ఏఎంయూ)లో ఆర్గనిక్ కెమిస్ట్రీలో మాస్టర్స్‌ను అభ్యసిస్తున్న కశ్మీరీ విద్యార్థుడు ముదాస్సర్ యూసఫ్ యూరీ ఉగ్రదాడిపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న ఏఎంయూ వైస్ ఛాన్సరల్ లెప్టినెంట్ జనరల్ జమీర్ ఉద్దీన్ షా, ఆ విద్యార్థుడిని యూనివర్సిటీ నుంచి బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు. జాతివ్యతిరేకంగా ఎలాంటి అసహన ఘటనలు తావెత్తకుండా ఉండేందుకు లిప్టినెంట్ జనరల్ షా ఈ నిర్ణయం తీసుకున్నట్టు యూనివర్సిటీ అధికార ప్రతినిధి పేర్కొన్నారు.
సెంటిమెంట్లను దెబ్బతీసేవిధంగా ఈ కామెంట్లను పోస్టు చేసినందుకు వైస్ చాన్సలర్‌కు ముదాస్సర్ యూసఫ్ ఆదివారమే క్షమాపణ చెప్పుకున్నాడు. కానీ ఈ విషయం చాలా సున్నితమైనది కారణంగా యూనివర్సిటీ అధికారులు విద్యార్థుడిని యూనివర్సిటీ నుంచి తొలగించాలని నిర్ణయించినట్టు అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఆ విద్యార్థుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వైస్ ఛాన్సలర్‌కు బీజేపీ లోక్‌సభ సభ్యులు లేఖ రాశారు. ఆదివారం వేకువ జామున కశ్మీర్‌లోని యూరీ బేస్ క్యాంపుపై జరిగిన ఈ దాడిలో 18 మంది భారత సైన్యం మృతిచెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనను భారత్‌తో పాటు యావత్ ప్రపంచం తీవ్రంగా ఖండిస్తోంది. ఘటనకు పాల్పడిన వారిని ఎట్టి పరిస్థితులో వదిలేది లేదని భారత ప్రభుత్వం హెచ్చరికలు కూడా జారీచేసింది.